Grow your money : 3ఏళ్లల్లో 15శాతానికి పైగా రిటర్నులు.. కోటీశ్వరులవ్వాలంటే ఈ ఫండ్స్ బెస్ట్!
Mutual Funds investment : గత మూడేళ్లలో 15 శాతానికి పైగా వార్షిక రిటర్నులు అందించిన దాదాపు 10 ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ లిస్ట్‌ని ఇక్కడ తెలుసుకోండి! ఆ వివరాలను ఇక్కడ చూడండి.
భారతీయుల్లో అవగాహన పెరగడంతో మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల ప్రవాహం గత కొంతకాలంగా పెరుగుతూ వస్తోంది. అయితే మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు ఇన్వెస్టర్లు గత రాబడులను పరిశీలించడం సర్వసాధారణం! ఈ నేపథ్యంలో 3ఏళ్లల్లో అధ్యధిక రిటర్నులు ఇచ్చిన ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లిస్ట్‌ని ఇక్కడ చూడండి..
ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్..
ఫ్లెక్సీ క్యాప్ స్కీమ్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ తమ పెట్టుబడిలో కనీసం 65 శాతాన్ని ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఈ మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ వంటి స్టాక్స్‌లో ఏ నిష్పత్తిలోనైనా ఇన్వెస్ట్ చేయవచ్చు.
గత మూడేళ్లలో (నవంబర్ 14, 2024 నాటికి) 15 శాతానికి పైగా వార్షిక రాబడిని ఇచ్చిన సుమారు 10 ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ వివరాలు..
ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ | 3ఏళ్ల రిటర్నులు (%) | ఏయూఎం (రూ. కోట్లల్లో) |
Bank of India Flexi Cap Fund | 19.31 | 1,897 |
Edelweiss Flexi Cap Fund | 15.60 | 2,336 |
Franklin India Flexi Cap Fund | 15.52 | 17,120 |
HDFC Flexi Cap Fund | 21.58 | 64,221 |
HSBC Flexi Cap Fund | 16.47 | 4,820 |
ICICI Prudential Flexicap Fund | 17.23 | 16,403 |
JM Flexicap Fund | 22.81 | 4,767 |
Motilal Oswal Flexi Cap Fund | 17.77 | 11,706 |
Quant Flexi Cap Fund | 17.29 | 7,434 |
Parag Parikh Flexi Cap Fund | 15.24 | 82,567 |
(మూలం: యాంఫీ; నవంబర్ 14 నాటికి రిటర్న్స్)
పట్టికలో చూడగలిగినట్లుగా, జెఎమ్ ఫ్లెక్సీ క్యాప్ అత్యధికంగా 3 సంవత్సరాల రాబడిని (22.81%) ఇచ్చింది. హెచ్డీఎఫ్సీ ఫ్లెక్సీ క్యాప్ (21.58%) తరువాతి స్థానంలో ఉంది.
ఇదిలా ఉంటే, ఇతర హై పర్ఫార్మెన్స్ కలిగిన ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్లలో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ (19.31%), ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ (17.23%) ఉన్నాయి.
ఆస్తుల పరిమాణం పరంగా చూస్తే పరాగ్ పరీఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ (రూ.82,567 కోట్లు), హెచ్డీఎఫ్సీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ (రూ.64,221 కోట్లు) అతిపెద్ద పథకాలు కాగా, అతిచిన్న పథకం (రూ.1,897 కోట్ల ఆస్తి పరిమాణంతో) బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్ నిర్వహిస్తోంది.
ఈ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్.. సెక్టోరల్ & థీమాటిక్ ఫండ్స్ తరువాత రెండొవ అత్యంత ప్రజాదరణ పొందాయి. మొత్తం రూ.4.27 లక్షల కోట్ల ఏయూఎంతో మొత్తం 39 ఫ్లెక్సీ క్యాప్ పథకాలు ఉన్నాయి. ఇందులో ఒక్క అక్టోబర్ నెలలోనే రూ.5,180 కోట్ల పెట్టుబడులు వచ్చాయని తాజా ఏఎంఎఫ్ఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
అయితే, కేవలం రిటర్నులు చూసి ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదని గుర్తుపెట్టుకోవాలి.
(గమనిక: ఈ కథ కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. పెట్టుబడికి సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్‌తో మాట్లాడాలి.)
సంబంధిత కథనం