Multibagger Stock : 5 ఏళ్ల కిందట ఈ షేర్ల మీద లక్ష పెట్టుంటే.. ఇప్పుడు 4 కోట్ల రూపాయలు!
Multibagger Stock : స్టాక్ మార్కెట్‌లో దీర్ఘకాలిక పెట్టుబడి కొందరికి మంచి లాభాలు ఇస్తాయి. అలా మంచి రిటర్న్స్ ఇచ్చిన కంపెనీలో రాజ్ రేయాన్ ఉంది. ఎందుకంటే మల్టీబ్యాగర్ లాభాలతో ఇన్వెస్టర్ల జేబులు నింపింది.
స్టాక్ మార్కెట్‌లో దీర్ఘకాలంలో పెట్టుబడిదారులకు మల్యీబ్యాగర్ రాబడిని ఇచ్చిన అనేక పెన్నీ స్టాక్స్ ఉన్నాయి. అలాంటి పెన్నీ స్టాక్ రాజ్ రేయాన్. మంగళవారం ఈ స్టాక్ ట్రేడింగ్ ముగిసే సమయానికి 1.97 శాతం పెరిగి.. 20.21 వద్ద ముగిసింది.

రాజ్ రేయాన్ స్టాక్స్ పెట్టుబడిదారులపై గత 5 ఏళ్లలో డబ్బు వర్షం కురిపించింది. రాజ్ రేయాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 1993లో స్థాపించారు. ఇది పాలిస్టర్ చిప్స్ తయారీ వ్యాపారంలో నిమగ్నమై ఉంది. ఈ కంపెనీ ఉత్పత్తుల జాబితాలో ట్రైలోబల్, కోట్‌లాక్, ఫైర్ రిటార్డెంట్, ఆక్టాలోబల్ నూలు ఉన్నాయి. ఇది తన ఉత్పత్తులను అనేక దేశాలకు ఎగుమతి చేస్తుంది. ఇందులో బ్రెజిల్, చిలీ, కొలంబియా, ఈజిప్ట్, పెరూ, స్పెయిన్, సిరియా, థాయిలాండ్, వియత్నాం ఉన్నాయి.
5 ఏళ్లలో మంచి రాబడి
ఈ స్టాక్ గత కొంతకాలంగా పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడిని అందిస్తోంది. ఎన్ఎస్ఈలో ఈ షేరు ప్రస్తుత ధర రూ.20.43(ఫిబ్రవరి 5 ఉదయం 10.21 వరకు)గా ఉంది. గత ఐదు సంవత్సరాలలో పెట్టుబడిదారులు 39,960శాతం లాభం పొందారు. అంటే 5 సంవత్సరాల క్రితం కేవలం 5 పైసలు ఉన్న ఈ షేరు ధర ఇప్పుడు రూ.20కి పెరిగింది. 5 సంవత్సరాల క్రితం ఈ షేర్లలో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పుడు అది రూ.4 కోట్లకు పెరిగి ఉండేది.
కంపెనీ ఆదాయం
కంపెనీ వార్షిక ప్రాతిపదికన ఆదాయంలో 32.12 శాతం వృద్ధిని సాధించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ.3.48 కోట్ల నష్టాన్ని నివేదించింది. గత ఏడాది ఇదే కాలంలో రూ.0.29 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. గత త్రైమాసికంతో పోలీస్తే.. వరుసగా 6.84 శాతం ఆదాయం తగ్గింది.
స్టాక్ మార్కెట్
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతోపాటుగా మరికొన్ని అంశాలు స్టాక్ మార్కెట్ మీద ప్రభావం చూపిస్తున్నట్టుగా కనిపిస్తోంది. డొనాల్డ్ ట్రంప్.. కెనడియన్, మెక్సికన్ ఉత్పత్తులపై 25 శాతం దిగుమతి సుంకం, చైనా ఉత్పత్తులపై 10 శాతం సుంకం విధిస్తామని ప్రకటించారు. దీని వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక రకమైన అనిశ్చితి ఏర్పడింది. అయితే తర్వాత ట్రంప్.. మెక్సికో, కెనడా వంటి దేశాలపై ఒక నెల పాటు సుంకాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత మార్కెట్లు కోలుకుంటున్నట్టుగా కనిపిస్తున్నాయి.
గమనిక : ఇది కేవలం స్టాక్ పనితీరు గురించి మాత్రమే. పెట్టుబడి సలహా కాదు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి రిస్క్. నిపుణుల సలహా తీసుకోండి.