Must have features in car : కంఫర్ట్​, సేఫ్టీ కోసం కారులో ఈ ఫీచర్స్ కచ్చితంగా​ ఉండాల్సిందే!-must have features in a car in 2025 for safety and comfort details inside ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Must Have Features In Car : కంఫర్ట్​, సేఫ్టీ కోసం కారులో ఈ ఫీచర్స్ కచ్చితంగా​ ఉండాల్సిందే!

Must have features in car : కంఫర్ట్​, సేఫ్టీ కోసం కారులో ఈ ఫీచర్స్ కచ్చితంగా​ ఉండాల్సిందే!

Sharath Chitturi HT Telugu

Must have features in car in 2025 : కారు కొనే ముందు చాలా ఆలోచిస్తుంటాము. కారులో ఎలాంటి ఫీచర్స్​ ఉండాలి? సేఫ్టీ ఫీచర్స్​ ఎన్ని ఉండాలి? కంఫర్ట్​ ఇచ్చే ఫీచర్స్​ ఏంటి? వంటివి చూస్తుంటాము. ఒకవేళ మీరు ఈ 2025లో కారు కొంటుంటే, ఒక కారులో ఉండాల్సిన ఫీచర్స్​ వివరాలను ఇక్కడ చూసేయండి..

కారులో కచ్చితంగా ఉండాల్సిన ఫీచర్స్​ ఏవి?

కారు కొనడం అనేది చాలా మంది కల! మరి మీరు కొత్తగా కారు కొంటున్నారా? మంచి కారులో ఎలాంటి సేఫ్టీ, కంఫర్ట్​ ఫీచర్స్​ ఉండాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే. ఈ 2025లో కారు కొంటుంటే, కచ్చితంగా ఉండాల్సిన ఫీచర్స్​ లిస్ట్​లో కొన్నింటిని ఇక్కడ తెలుసుకోండి. ఈ డేటా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

కారులో ఈ ఫీచర్స్​ ఉండాల్సిందే!

ఎయిర్​బ్యాగ్స్​- సేఫ్టీలో అత్యంత ముఖ్యమైనవి ఎయిర్​బ్యాగ్స్​. ఇప్పుడు అఫార్డిబుల్​ కార్లలోనూ వీటిని స్టాండర్డ్​గా ఇస్తున్నారు. కారు, వేరియంట్​ బట్టి 2,4,6 ఎయిర్​బ్యాగ్స్​ వస్తున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, ప్యాసింజర్లు డ్యాష్​బోర్డు, స్టీరింగ్​ వీల్​, విండ్​షీల్డ్​ని ఢీకొట్టకుండా ఇవి అడ్డుకుంటాయి. సైడ్​ ఎయిర్​బ్యాగ్స్​ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

రివర్స్​ సెన్సింగ్​ సిస్టెమ్​- కొందరికి కారు రివర్స్​ తిప్పుతున్నప్పుడు, రివర్స్​లో పార్కింగ్​ చేస్తున్నప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. దీనికి పరిష్కారం రివర్స్​ సెన్సింగ్​ సిస్టెమ్​. వెహికిల్​ వెనుక భాగంలో అమర్చే కెమెరా మన పనిని సులభతం చేస్తుంది. రివర్స్​ గేర్​ వేసినప్పుడు ఆటోమెటిక్​గా ఈ ఈ సిస్టెమ్​ ఆన్​ అవుతుంది. మీ పరిసరాలను చూడవచ్చు. ఏదైనా వస్తువు అడ్డొస్తే లేదా ఆ వస్తువుకు కారు అతి సమీపంగా వెళితే బీప్​ సౌండ్​ వచ్చి మిమ్మల్ని అలర్ట్​ చేస్తుంది.

డీఫాగర్​- విండోలు తరచూ ఫాగ్​ అవుతుంటాయి. వర్షాకాలం, చలికాలంలో ఇది ఇంకా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మీ విజన్​ బ్లర్​ అవుతుంది. అందుకే కారులో డీఫాగర్​ ఫీచర్​ ఉంటే బగుంటుంది. కొన్ని వాహనాల్లోని లో- ఎండ్​ వేరియంట్లలో ఇది లభించదు. వాల్యూ ఫర్​ మనీ వేరియంట్స్​ నుంచి ఈ ఫీచర్​ ప్రారంభమవుతుంది.

ఫాగ్​ ల్యాంప్స్​- డ్రైవింగ్​ సేఫ్టీలో ఫాగ్​ ల్యాంప్స్​ ముఖ్యం. పొగమంచు వంటి పరిస్థితుల్లో రోడ్డు కనిపించకపోవచ్చు. ఈ ఫాగ్​ లైట్స్​లో నుంచి వైడ్​ బీమ్​ లైట్​ బయటకు వస్తుంది. విజిబులిటీ మెరుగుపడుతుంది. యెల్లో ఫాగ్​ లైట్స్​ ఉంటే ఇంకా బెటర్​!

యంటీలాక్​ బ్రేకింగ్​ సిస్టెమ్​- దీనినే ఏబీఎస్​ అంటారు. ఇది కాస్త ఖర్చుతో కూడుకున్న ఫీచర్​ అయినప్పటికీ, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అత్యవసరంగా బ్రేక్​లు వేసినప్పుడు కారు వీల్స్​ లాక్​ అవ్వకుండా ఈ ఫీచర్​ చూసుకుంటుంది. అంటే, ఏబీఎస్​ వల్ల డ్రైవర్​ బ్రేక్​ వేస్తూనే, స్టీరింగ్​ని తిప్పుతూ, బయట ఉన్న వస్తువుల నుంచి తప్పించుకోవచ్చు. ఒక్క విషయం ఏంటంటే, ఆయా సమాయాల్లో ఏబీఎస్​ ఒక్కటే ప్రమాదాన్ని నివారించలేదు. డ్రైవర్​ స్కిల్​ చాలా ముఖ్యం.

ఎలక్ట్రానిక్​ స్టెబులిటీ కంట్రోల్​- దీనిని ఈఎస్​సీ అంటారు. బ్రేక్స్​ పడినప్పుడు వాహనం స్కిడ్​ అవ్వకుండా ఇది చూసుకుంటుంది.

ట్రాక్షన్​ కంట్రోల్​- వీల్స్​ స్పిన్​ అవ్వకుండా ఈ ఫీచర్​ చూసుకుంటుంది. రోడ్డు జారే విధంగా ఉన్నప్పుడు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

పవర్​ ఔట్​పుట్స్​- ఈ మధ్య కాలంలో చాలా కార్లకు 12వాట్​ పవర్​ ఔట్​పుట్స్​ వస్తున్నాయి. మొబైల్​ ఫోన్స్​ని ఛార్జ్​ చేసుకునేందుకు ఇవి మంచి ఆప్షన్​.

హైట్​ అడ్జెస్టెబుల్​ సీట్స్​- ఈ ఫీచర్​ ఇటీవలి కాలంలో ప్రాముఖ్యత పొందుతోంది. ఇప్పుడొస్తున్న కార్లలో దీనిని అడిషనల్​ ఫీచర్​గా ఇస్తున్నారు. హైట్​ తక్కువ ఉన్న డ్రైవర్లకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. హైట్​ ఎక్కువ ఉన్న డ్రైవర్లు కూడా ఈ ఫీచర్​తో సీట్​ హైట్​ని తగ్గించుకోవచ్చు.

టెక్నాలజీ- లేటెస్ట్​ టెక్నాలజీకి మనం అప్డేట్​ అవ్వకపోతే కష్టమే! అందుకే మనం కొనే కారులో సరైన నేవిగేషన్​ సిస్టెమ్​, స్మార్ట్​ఫోన్​ ఇంటిగ్రేషన్​ వంటివి కచ్చితంగా ఉండాలి.

పవర్​ విండోస్​, ఆటోమెటిక్​ లాక్స్​- ఇవి అనేక కార్లలో స్టాండర్డ్​గా వస్తున్నాయి. పవర్​ విండోస్​తో మన పని చాలా సులభమవుతుంది. కారు కొంత వేగాన్ని అందుకున్న తర్వాత డోర్స్​ ఆటోమెటిక్​గా లాక్​ అవుతాయి.​ కానీ కొన్ని లో- ఎండ్​ వేరియంట్లలో పవర్​ విండోస్​ ఉండకపోవచ్చు చెక్​ చేసుకోండి.

ఏసీ- కారులో ఏసీ ఉండాలి. ఎండా కాలంలో దీని అవసరం ఇంకా ఎక్కువ పడుతుంది.

ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​- ప్రతికారులోనూ ఇది స్టాండర్డ్​ ఫీచర్​గా మారిపోయింది. ఎఫ్​ఎం, మ్యూజిక్​ నుంచి నేవిగేషన్​, కాంటాక్స్​ వరకు ఇందులో చాలా చూడవచ్చు. ఎన్ని ఇంచ్​ల ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​ ఉండాలనేది మీ ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది.

ఏడీఏఎస్​- దీనిని అడ్వాన్స్​డ్​ డ్రైవర్​ అసిస్టెంట్​ సిస్టెమ్​ అంటారు. ఇందులోని అనేక సేఫ్టీ ఫీచర్స్​ ఉంటాయి. కానీ ఇది టాప్​- ఎండ్​ మోడల్స్​లో ఎక్కవ అందుబాటులో ఉంటుంది.

అదనపు ఫీచర్లు..

ప్యాసింజర్ల కంఫర్ట్​, సేఫ్టీ కోసం పైన చెప్పిన వాటితో పాటు ఇంకా చాలా ఫీచర్స్​ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. సన్​రూఫ్​, 360 డిగ్రీ కెమెరా, రూఫ్​ రెయిల్​, రేర్​ ఏసీ వెంట్స్​, వెంటిలేటెడ్​ సీట్స్​, అడ్జెస్టెబుల్​ స్టీరింగ్​ కాలమ్​, టర్బోఛార్జ్​డ్​ ఇంజిన్​, వివిధ డ్రైవ్​ మోడ్స్​, లెథర్​ అప్​హోలిస్ట్రీ, యాంబియెంట్​ లైటింగ్​, ప్రీమియం సౌండ్​ సిస్టెమ్​, క్రూయిజ్​ కంట్రోల్​, వైర్​లెస్​ ఛార్జింగ్​ వంటివి కొన్ని ఉదాహరణలు. రానున్న కాలంలో ఇంకా ఎన్నో ఫీచర్లు మన ముందుకు వస్తుటాయి. అయితే, ఇవన్నీ కస్టమర్​ అభిరుచులు, కోరికలను ప్రతిబింబిస్తాయి. కచ్చితంగా ఉండాల్సిందే! అని కాదు. పైగా ఇవి ఖర్చుతో కూడుకున్నవి.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం