India's first electric double decker bus : దేశంలోనే తొలి ఎలక్ట్రిక్​ డబుల్​ డెక్కర్​ బస్సు ఇదే..-mumbai gets india s first electric double decker bus check full details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Mumbai Gets India's First Electric Double Decker Bus Check Full Details Here

India's first electric double decker bus : దేశంలోనే తొలి ఎలక్ట్రిక్​ డబుల్​ డెక్కర్​ బస్సు ఇదే..

Sharath Chitturi HT Telugu
Feb 14, 2023 01:42 PM IST

India's first electric double decker bus : ముంబై రోడ్ల మీద ఎలక్ట్రిక్​ డబుల్​ డెక్కర్​ బస్సులు తిరగనున్నాయి. దేశంలోనే తొలి ఎలక్ట్రిక్​ డబుల్​ డెక్కర్​ బస్సు అందుకున్న నగరంగా ముంబై నిలిచింది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

దేశంలోనే తొలి ఎలక్ట్రిక్​ డబుల్​ డెక్కర్​ బస్సు ఇదే..
దేశంలోనే తొలి ఎలక్ట్రిక్​ డబుల్​ డెక్కర్​ బస్సు ఇదే..

India's first electric double decker bus : దేశంలోనే తొలి ఎలక్ట్రిక్​ డబుల్​ డెక్కర్​ బస్సు అందుకున్న నగరంగా ముంబై నిలిచింది. మంగళవారం ఉదయం.. ఈ ఎలక్ట్రిక్​ డబుల్​ డెక్కర్​ బస్సులు బృహన్​ముంబై ఎలక్ట్రిక్​ సప్లై అండ్​ ట్రాన్స్​పోర్ట్​ (బీఈఎస్​టీ)లోకి చేరాయి. చాలా నెలల ఆలస్యం తరువాత ఇవి అందుబాటులోకి వచ్చాయి.

ట్రెండింగ్ వార్తలు

ఈ ఎలక్ట్రిక్​ డబుల్​ డెక్కర్​ బస్సులను ఈఐవీ22 అని పిలుస్తున్నారు. మార్చ్​ చివరి నాటికి దాదాపు 20 బస్సులు ముంబై రోడ్ల మీద తిరగనున్నాయి. అశోక్​ లేల్యాండ్​కు చెందిన ఎలక్ట్రిక్​ కమర్షియల్​ వెహికిల్​ విభాగమైన స్విఛ్​ మొబిలిటీ నుంచి బీఈఎస్​టీ వీటిని లీజుకు తీసుకుంది. గతేడాది ఆగస్టు 17న.. దేశంలోనే తొలి ఎలక్ట్రిక్​ డబుల్​ డెక్కర్​ బస్సును కేంద్రమంత్రి నితిన్​ గడ్కరీ ఆవిష్కరించారు. అప్పటి నుంచి వీటిపై ప్రజల్లో ఆసక్తి విపరీతంగా పెరిగింది.

Electric double decker bus : ఇక ఇప్పుడు ఆర్​టీఓ ఆఫీసులో ఈ ఎలక్ట్రిక్​ డబుల్​ డెక్కర్​ బస్సుల రిజిస్ట్రేషన్​ జరగాల్సి ఉంది. ఆ వెంటనే ముంబై సబ్​అర్బన్​ రోడ్ల మీద ఇవి దర్శనమిస్తాయి. ముంబైలో ఇప్పటికే కొన్ని డబుల డెక్కర్​ బస్సులు ఉన్నాయి. కాగా.. అవి డీజిల్​తో నడుస్తున్నాయి. వాటిని భర్తీ చేస్తూ.. ఈ ఈఐవీ22ని తీసుకొచ్చారు అధికారులు.

"రానున్న కొన్ని రోజుల్లో మరో ఐదు ఎలక్ట్రిక్​ డబుల్​ డెక్కర్​ బస్సులు చేరుతాయి. ఈ ఏడాది చివరి నాటికి 200కుపైగా ఈవీ డబుల్​ డెక్కర్​ బస్సులు మాకు దక్కుతాయి. అతి త్వరలోనే వీటిని ప్రజా సేవ కోసం అంకితం చేస్తాము," అని బీఈఎస్​టీ జనరల్​ మేనేజర్​ లోకేశ్​ చంద్ర తెలిపారు.

ఈఐవీ22 ఫీచర్స్​..

Mumbai electric double decker bus :స్విఛ్​ మొబిలిటీ రూపొందించిన ఈ ఈఐవీ22లో లిథియం- ఐయాన్​ మాడ్యులర్​ బ్యాటరీ ఆప్షన్స్​ ఉంటాయి. లిక్విడ్​ కూలింగ్​ ఇంజిన్​తో పాటు 231కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ కెపాసిటీ వీటిల్లో ఉంటుంది. 1.5- 3 గంటల్లో బస్సులను ఛార్జ్​ చేయవచ్చు. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. ఈ ఎలక్ట్రిక్​ డబుల్​ డెక్కర్​ బస్సులు 250కి.మీల దూరం ప్రయాణిస్తాయి. ఇందులోని ఎలక్ట్రిక్​ మోటార్​.. 320 హెచ్​పీ పవర్​ను, 3100 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

మహారాష్ట్ర రాయ్​గఢ్​లో ఉన్న పాతాల్​గంగాలోని స్విఛ్​ మొబిలిటీలో ఈ ఎలక్ట్రిక్​ డబుల్​ డెక్కర్​ బస్సులను తయారు చేస్తున్నారు. ఇందులో రెండు డోర్లు ఉంటాయి. పైకి వెళ్లేందుకు మెట్లు ఉంటాయి. డిజిటల్​ టికెటింగ్​, సీసీటీవీ కెమెరాలు, లైవ్​ ట్రాకింగ్​, డిజిటల్​ డిస్​ప్లే, పానిక్​ బటన్​ వంటి ఫీచర్స్​ వీటిల్లో ఉంటాయి. 65 మంది ప్రయాణికుల కూర్చునే విధంగా వీటిని రూపొందించారు. నిలబడి ప్రయాణించేవారిని కూడా కలుపుకుంటే.. ఒకేసారి 100మంది కూడా ఇందులో ప్రయాణించవచ్చు.

First electric double decker bus : వాస్తవానికి ఈ ఎలక్ట్రిక్​ డబుల్​ డెక్కర్​ బస్సులు గతేడాది అక్టోబర్​లోనే అందుబాటులోకి రావాల్సి ఉంది. కానీ సర్టిఫికేషన్​లో జాప్యం కారణంగా ఆలస్యమైంది.

WhatsApp channel

సంబంధిత కథనం