Multibagger stock : 10 నెలల్లో 1900శాతం రిటర్నులు- రూ. 35 నుంచి భారీ పెరిగిన స్టాక్​..-multibagger stock trident techlabs give 1900 percent returns in 10 months ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Multibagger Stock : 10 నెలల్లో 1900శాతం రిటర్నులు- రూ. 35 నుంచి భారీ పెరిగిన స్టాక్​..

Multibagger stock : 10 నెలల్లో 1900శాతం రిటర్నులు- రూ. 35 నుంచి భారీ పెరిగిన స్టాక్​..

Sharath Chitturi HT Telugu
Nov 02, 2024 10:20 AM IST

ట్రైడెంట్ టెక్ ల్యాబ్స్ షేరు 10 నెలల్లో రూ.35 నుంచి రూ.700కు పెరిగింది. ఈ కాలంలో కంపెనీ షేర్లు 1900 శాతానికి పైగా వృద్ధిచెంది మదుపర్లకు మంచి లాభాలను ఇచ్చాయి.

10 నెలల్లో 1900శాతం రిటర్నులు!
10 నెలల్లో 1900శాతం రిటర్నులు!

స్టాక్​ మార్కెట్​లో మల్టీబ్యాగర్​ రిటర్నులు ఇచ్చే సంస్థల కసం మదుపర్లు చూస్తుంటారు. అలాంటి మల్టిబ్యాగర్స్​లో ఒకటి ఈ ట్రైడెంట్​ టెక్​ ల్యాబ్స్​ స్టాక్​! ఈ స్టాక్​.. 10 నెలల్లో ఏకంగా 1900శాతం వృద్ధి చెంది, మదుపర్లను సంతోష పెట్టింది.

ట్రైడెంట్​ టెక్​ ల్యాబ్స్​..

ట్రైడెంట్ టెక్​ల్యాబ్స్ షేర్లు 10 నెలల్లో 1900 శాతానికి పైగా పెరిగాయి. ట్రైడెంట్ టెక్​ల్యాబ్స్ ఐపీఓ గతేడాది డిసెంబర్​లో వచ్చింది. ఐపీఓలో కంపెనీ షేరు ధర రూ.35గా ఉంది. 2024 నవంబర్ 1న కంపెనీ షేరు ధర రూ.716.80 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1235 కోట్లు దాటింది. 

ట్రైడెంట్ టెక్​ల్యాబ్స్ షేరు 52 వారాల గరిష్ట స్థాయి రూ.998. అదే సమయంలో కంపెనీ షేరు 52 వారాల కనిష్ట స్థాయి 93.25 రూపాయలు.

ట్రైడెంట్ టెక్​ల్యాబ్స్​ ఐపీఓ 2023 డిసెంబర్ 21న ప్రారంభమై డిసెంబర్ 26 వరకు కొనసాగింది. ఐపీఓలో కంపెనీ షేరు ధర రూ.35గా ఉంది. 2023 డిసెంబర్ 29న ట్రైడెంట్ టెక్​ల్యాబ్స్​ షేరు ధర రూ.98.15 వద్ద లిస్ట్ అయింది! లిస్టింగ్ రోజున కంపెనీ షేరు ధర రూ.103.05 వరకు పెరిగింది. ఇష్యూ ధర రూ.35తో పోలిస్తే ట్రైడెంట్ టెక్​ల్యాబ్స్ షేర్లు తొలిరోజే ఏకంగా 194 శాతం రిటర్నులు ఇచ్చినట్టు! 

ఈ ఐపీఓలో ఒకే లాట్ లో 4000 షేర్లు ఉన్నాయి. అంటే కంపెనీ ఐపీఓలో రిటైల్ ఇన్వెస్టర్లు రూ.140,000 ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది.

కంపెనీలో ప్రమోటర్లకు 67.97 శాతం వాటా ఉంది. ఇది సానుకూల విషయం. అదే సమయంలో పబ్లిక్ షేర్ హోల్డింగ్ 32.03 శాతంగా ఉంది.

ట్రైడెంట్ టెక్​ల్యాబ్స్​ ఐపీఓ 763.30 సార్లు సబ్​స్క్రైబ్ అయింది. ఐపీఓలో రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 1059.43 రెట్లు పెరిగింది. అదే సమయంలో నాన్ ఇన్​స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (ఎన్ ఐఐ) కేటగిరీకి 854.37 రెట్లు సబ్​స్క్రిప్షన్ లభించింది. క్వాలిఫైడ్ ఇన్​స్టిట్యూషనల్ బయ్యర్స్ (క్యూఐబీ) కేటగిరీలో ఈ ఐపీఓకు 117.91 రెట్లు సబ్​స్క్రిప్షన్ లభించింది.

ట్రైడెంట్ టెక్​ల్యాబ్స్ 2000 సంవత్సరంలో ప్రారంభమైంది. ఏరోస్పేస్, డిఫెన్స్, ఆటోమోటివ్, టెలీకమ్యూనికేషన్స్, సెమీకండక్టర్, పవర్ డిస్ట్రిబ్యూషన్ పరిశ్రమలకు టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలను ట్రైడెంట్ టెక్​ల్యాబ్స్​ అందిస్తుంది. ఇంజినీరింగ్ సొల్యూషన్స్, పవర్ సిస్టమ్ సొల్యూషన్స్ అనేవి కంపెనీకి చెందిన రెండు విభాగాలు.

(గమనిక:- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్​లో ఇన్​వెస్ట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్లను సంప్రదించడం శ్రేయస్కరం.)

Whats_app_banner

సంబంధిత కథనం