Multibagger stock: ఒక్క నెలలో 108% లాభపడిన మల్టీ బ్యాగర్ స్టాక్
ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. తెలంగాణ, ఆంధ్రాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న టెలీకాం కంపెనీ. నెల రోజుల వ్యవధిలో 108% వృద్ధి సాధించి రికార్డు సృష్టించింది.
నెట్ లింక్స్ లిమిటెడ్ (Nettlinx Ltd) సంస్థ టెలీకాం రంగంలో ఉన్న డిజిటల్ మీడియా సొల్యూషన్స్ అందించే స్మాల్ క్యాప్ కంపెనీ. ఈ సంస్థ మార్కెట్ విలువ రూ. 248.01 కోట్లు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల్లోని టాప్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ (ISP) ల్లో ఒకటి.
ట్రెండింగ్ వార్తలు
Nettlinx Ltd: డివిడెండ్, బోనస్ షేర్
2022-23 సంవత్సరానికి గానూ మధ్యంతర డివిడెండ్ (interim dividend) ను బోనస్ షేర్లను (Bonus share) నెట్ లింక్స్ లిమిటెడ్ (Nettlinx Ltd) సంస్థ ప్రకటించింది. మదుపర్లకు రూ. 10 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 0.40 మధ్యంతర డివిడెండ్ ను, 1: 1 రేషియలో బోనస్ షేర్లను ఇవ్వనున్నట్లు వెల్లడించింది. డివిడెండ్ చెల్లింపునకు, బోనస్ షేర్ అలాట్ మెంట్ కు మార్చి 17వ తేదీని రికార్డు డేట్ గా ప్రకటించింది.
Nettlinx Ltd Q3 results: Q3 ఫలితాలు..
ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (Q3FY23)లో నెట్ లింక్స్ (Nettlinx Ltd) ఆదాయం రూ. 2.43 కోట్లు. గత Q3లో ఇది రూ. 2.19 కోట్లు. లీజ్డ్ బ్యాండ్ విడ్త్ కనెక్టివిటీ కాంట్రాక్ట్స్ తో భవిష్యత్తులో సంస్థ మరింత వృద్ధిచెందే అవకాశాలున్నాయని నెట్ లింక్స్ (Nettlinx Ltd) ఎండీ, ప్రమోటర్ డాక్టర్ మనోమర్ లోక రెడ్డి తెలిపారు. సోమవారం, మార్చి 6వ తేదీన సంస్థ షేర్ విలువ బీఎస్ఈలో రూ. 216.35 వద్ద ముగిశాయి. ఈ సంస్థ (Nettlinx Ltd) షేర్ విలువ (Share value) గత ఐదు సంవత్సరాలలో 169.09%, గత సంవత్సరం కాలంలో 157.25% పెరిగింది. అంతేకాదు, సరిగ్గా గత నెల రోజుల్లో ఈ సంస్థ (Nettlinx Ltd) షేర్ విలువ 108.03% పెరగడం విశేషం. అలాగే, గత 6 నెలల్లో 172.48% పెరిగి మల్టీ బ్యాగర్ గా అవతరించింది.