Multibagger Stock : ఒకప్పుడు రూ.3 స్టాక్.. ఇప్పటివరకు 26900 శాతం పెరుగుదల, నిధుల సమీకరణకు కంపెనీ ఏర్పాట్లు!-multibagger stock eco recycling limited share surges 26900 percent from 3 rupees check out details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Multibagger Stock : ఒకప్పుడు రూ.3 స్టాక్.. ఇప్పటివరకు 26900 శాతం పెరుగుదల, నిధుల సమీకరణకు కంపెనీ ఏర్పాట్లు!

Multibagger Stock : ఒకప్పుడు రూ.3 స్టాక్.. ఇప్పటివరకు 26900 శాతం పెరుగుదల, నిధుల సమీకరణకు కంపెనీ ఏర్పాట్లు!

Anand Sai HT Telugu
Jan 26, 2025 06:30 PM IST

Multibagger Stock : ఎకో రీసైక్లింగ్ లిమిటెడ్ స్టాక్ దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు మంచి రాబడులను ఇచ్చింది. 2004 జూలై 17న కంపెనీ షేరు ధర రూ.3గా ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 26,900 శాతం రాబడిని ఇచ్చింది. శుక్రవారం రూ.810 వద్ద క్లోజ్ అయింది.

ఎకో రీసైక్లింగ్ లిమిటెడ్ స్టాక్
ఎకో రీసైక్లింగ్ లిమిటెడ్ స్టాక్

ఎకో రీసైక్లింగ్ లిమిటెడ్ షేర్లు పెట్టుబడిదారులకు మంచి రాబడులను ఇచ్చాయి. 2004 జూలై 17న కంపెనీ షేరు ధర రూ.3గా ఉండేది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు 26,900 శాతం పైకి వెళ్లింది. శుక్రవారం రూ.810 వద్ద క్లోజ్ అయింది. వచ్చే వారం కంపెనీ షేర్లపై ఫోకస్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వాస్తవానికి ఈ సంస్థ నిధులు సమీకరించబోతోంది.

yearly horoscope entry point

క్వాలిఫైడ్ ఇన్ స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్(క్యూఐపీ) ప్రక్రియ ద్వారా నిధులను సమీకరించాలని భావిస్తున్నట్లు ఎకో రీసైక్లింగ్ లిమిటెడ్ జనవరి 23న ప్రకటించింది. క్యూఐపీ ఫండ్ రైజింగ్ ప్రక్రియ అనేది స్టాక్ మార్కెట్లో పనిచేస్తున్న క్వాలిఫైడ్ ఇన్ స్టిట్యూషనల్ బయ్యర్స్(క్యూఐబీ) వంటి పెద్ద పెట్టుబడిదారులకు తమ సెక్యూరిటీలను విక్రయించడం ద్వారా పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలకు నిధులను సేకరించే ప్రక్రియ. క్యూఐపీ ఇష్యూకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా జీవైఆర్ క్యాపిటల్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను డైరెక్టర్ల బోర్డు నియమించారు.

ఎకో రీసైక్లింగ్ లిమిటెడ్ షేరు శుక్రవారం స్టాక్ మార్కెట్ సెషన్ తర్వాత 2.78 శాతం క్షీణించి రూ.810 వద్ద ముగిసింది. బీఎస్ఈ డేటా ప్రకారం.. ఎకో రీసైక్లింగ్ షేరు 2024 ఆగస్టు 29న 52 వారాల గరిష్ట స్థాయి రూ.1,215.10ను తాకింది. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి ఈ షేరు మార్కెట్ క్యాప్ రూ.1,558.02 కోట్లుగా ఉంది.

గత ఏడాది కాలంలో ఈ మల్టీబ్యాగర్ స్టాక్ ఇన్వెస్టర్లకు 104 శాతానికి పైగా రాబడులను, గత ఐదేళ్లలో 2,000 శాతానికి పైగా రాబడులను ఇచ్చింది. అయితే ఎకో రీసైక్లింగ్ స్టాక్ ఏడాది ప్రాతిపదికన(వైటీడీ) 16.81 శాతం క్షీణించింది.

గమనిక : ఇది పెట్టుబడి సలహా కాదు. కేవలం స్టాక్ పనితీరు మాత్రమే. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం రిస్క్‌తో కూడుకున్నది. నిపుణుల సలహా తీసుకోండి.

Whats_app_banner