Multibagger Stock: సంవత్సరంలో రూ.లక్షను రూ.8లక్షలు చేసిన స్టాక్
Multibagger Stock: స్టాక్ మార్కెట్‍లో ఓ కంపెనీ స్టాక్స్.. ఇన్వెస్టర్లకు లాభాలను కురిపించింది. ఏకంగా సంవత్సరంలోనే 800 శాతానికి పైగా పెరిగింది. వివరాలివే..
Multibagger Stock: సాధారణంగా స్టాక్ మార్కెట్‍లో పెట్టుబడులు పెట్టడం రిస్క్ అని చాలా మంది భావిస్తారు. ముఖ్యంగా స్మాల్ క్యాప్ కంపెనీల్లో ఒడుదొడుకులు ఎక్కువగా ఉంటాయి. అయితే, కొన్ని కంపెనీలు మాత్రం మల్టీబ్యాగర్ రిటర్నులతో ఇన్వెస్టర్లకు లాభాల వర్షం కురిపిస్తాయి. ఇలాంటి స్టాక్‍లను ధర పెరగక ముందే కొనుగోలు చేసిన మదుపరులకు లాభాల పంట పడుతుంది. అలాంటి ఓ స్టాక్ గురించే ఇక్కడ చెబుతోంది. ఈ స్టాక్ ఒక్క సంవత్సరంలో 800 శాతానికిపైగా పెరిగింది. అంటే 8 రెట్లు ర్యాలీ అయింది. ఏడాదిలో ఇంత భారీగా ర్యాలీ అయిన స్టాక్ పేరు దీప్ డైమండ్ ఇండియా లిమిటెడ్ (Deep Diamond India LTD). రూ.50.72 కోట్ల మార్కెట్ విలువ ఉన్న స్మాల్ క్యాప్ కంపెనీ ఇది. సంవత్సరం క్రితం ఈ కంపెనీ స్టాక్ విలువ ఎంత ఉంది.. ఎంత వరకు పెరిగిందన్న వివరాలు ఇక్కడ చూడండి.
ఏడాదిలో 800 శాతానికి పైగా..
Multibagger Stock: దీప్ డైమండ్ ఇండియా లిమిటెడ్ సంస్థ 1993లో ప్రారంభమైంది. 18 క్యారెట్ల డైమండ్ ఆభరణాలను ఈ కంపెనీ విక్రయిస్తుంటుంది.
2022 జనవరి 17వ తేదీన దీప్ డైమండ్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీకి చెందిన ఒక్కో షేర్ ధర రూ.16.60గా ఉండేది. ప్రస్తుతం శుక్రవారం (2023 జనవరి 13) మార్కెట్ ముగిసే సమయానికి రూ.158.30 వద్ద ఈ కంపెనీ స్టాక్ ధర ఉంది. అంటే సంవత్సరంలో ఏకంగా 800 శాతానికిపైగా ఈ కంపెనీ స్టాక్ పెరిగింది. అంటే ఏడాది క్రితం రూ.లక్ష పెట్టుబడి పెడితే అది ఇప్పుడు సుమారు రూ.8లక్షలపైనే ఉంటుంది. 2022 జూలైలో దీప్ డైమండ్ ఇండియా లిమిటెడ్ షేర్ ధర రూ.34.75 వద్ద ఉండేది. అక్కడి నుంచి కూడా పరుగులు పెట్టి భారీ మల్టీబ్యాగర్‌గా మారింది. ఇన్వెస్టర్లకు భారీ లాభాలను కట్టబెట్టింది. అప్పుడు పెట్టుబడి పెట్టిన వారికి కూడా 400శాతానికిపైగా లాభాలను ఇచ్చింది.
Multibagger Stock: కాగా, 2022 అక్టోబర్ 25న 52 వారాల గరిష్ఠమైన రూ.171.95కు దీప్ డైమండ్ ఇండియా లిమిటెడ్ స్టాక్ చేరింది. అయితే ఆ తర్వాత ఒడిదొడుకులను ఎదుర్కొని ప్రస్తుతం రూ.158.30 వద్ద ఉంది.
ఈ వారంలోనే స్ప్లిట్..
Multibagger Stock: కాగా, దీప్ డైమండ్ ఇండియా లిమిటెడ్ స్టాక్ త్వరలోనే స్ప్లిట్ కానుంది. జనవరి 20 దీనికి రికార్డు డేట్‍గా ఉంది.
ఇది గుర్తుంచుకోవాలి
Multibagger Stock: స్టాక్ మార్కెట్‍లో ఏదైనా కంపెనీలో పెట్టుబడి పెట్టే ముందు ఇన్వెస్టర్లు పూర్తిగా విశ్లేషణ చేయాలి. కంపెనీ వ్యాపారం, లాభాలు, ఆదాయం, భవిష్యత్తు ప్రణాళకలతో పాటు పూర్తి వివరాలను పూర్తిగా తెలుసుకోవాలి. ఫైనాన్షియల్ అడ్వయిజర్ సలహాను కూడా తీసుకోవడం మంచిది. ఒకవేళ స్టాక్ పెరుగుతుంటే ఎందుకు పెరుగుతుందో తెలుసుకోవాలి. పూర్తి వివరాలు విశ్లేషించకుండా ఎంట్రీ అవకూడదని గుర్తుంచుకోవాలి.
సంబంధిత కథనం