Multibagger stock : స్టాక్​ స్ల్పిట్​తో పాటు బోనస్​- ఈ మల్టీబ్యాగర్​ షేర్లు ఉన్న వారికి పండుగే!-multibagger stock declares 1 5 stock split 1 5 bonus shares ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Multibagger Stock : స్టాక్​ స్ల్పిట్​తో పాటు బోనస్​- ఈ మల్టీబ్యాగర్​ షేర్లు ఉన్న వారికి పండుగే!

Multibagger stock : స్టాక్​ స్ల్పిట్​తో పాటు బోనస్​- ఈ మల్టీబ్యాగర్​ షేర్లు ఉన్న వారికి పండుగే!

Sharath Chitturi HT Telugu
Aug 09, 2024 01:40 PM IST

మల్టీబ్యాగర్ స్టార్​లైనెప్స్​ ఎంటర్ప్రైజెస్ సంస్థ స్టాక్​ స్ల్పిట్​తో పాటు బోనస్​ కూడా ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ సంస్థ షేర్లు 5ఏళ్లల్లో 500శాతం రిటర్నులు ఇచ్చాయి.

మల్టీబ్యాగర్​ స్టాక్​ అలర్ట్​..
మల్టీబ్యాగర్​ స్టాక్​ అలర్ట్​.. (Photo: Bloomberg)

భారత స్టాక్ మార్కెట్ అందించిన మల్టీబ్యాగర్ స్టాక్స్​లో ఒకటి స్టార్​లైనెప్స్​ ఎంటర్ప్రైజెస్. స్మాల్ క్యాప్ సంస్థకు చెందిన షేరు గత ఐదేళ్లలో రూ.26.80 నుంచి రూ.165కు పెరిగాయి. అంటే మదుపర్లకు కేవలం 5ఏళ్లల్లో దాదాపు 500 శాతం రిటర్నులు ఇచ్చినట్టు! సుమారు రూ.700 కోట్ల మార్కెట్ క్యాప్ కలిగిన ఈ స్మాల్​క్యాప్ స్టాక్ గురువారం జరిగిన బోర్డు సమావేశంలో స్టాక్ స్ల్పిట్​, బోనస్ షేర్లను ప్రకటించడంతో నేడు వార్తల్లో నిలిచింది. బోనస్ షేర్లను 1:5 నిష్పత్తిలో, స్టాక్ విభజనను 1:5 నిష్పత్తిలో జారీ చేసేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. 

స్టాక్ స్ల్పిట్​, బోనస్ షేర్ల రికార్డు తేదీని తరువాత ప్రకటిస్తారు.

స్టార్​లైనెప్స్​ ఎంటర్ప్రైజెస్ స్టాక్ స్ల్పిట్​..

“కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు 2024 ఆగస్టు 8, గురువారం జరిగిన మీటింగ్ నంబర్ 2/2024-25 లో కంపెనీ ఈక్విటీ షేర్లను రూ.5/- (రూ.5) ఫేస్​ వాల్యూ నుంచి రూ.5/- (రూ.1, రూ.5) (రూ.5) నుంచి రూ.1 (రూ.5) వరకు సబ్ డివిజన్/విభజనకు ఆమోదం తెలిపింది,” అని స్టాక్ ఎక్స్ఛేంజ్​కి సంస్థ తెలియజేసింది. ఇన్​వెస్టర్లు దీనిని ఆమోదించాల్సి ఉంది. దీనికి సంబంధించి, రికార్డు తేదీని తగిన సమయంలో స్టాక్ ఎక్స్ఛేంజీకి తెలియజేస్తామని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:- OLA Electric IPO Listing : లాభాల్లేవ్​- నష్టాల్లేవ్​.. ఫ్లాట్​గా ఓలా ఎలక్ట్రిక్​ ఐపీఓ లిస్టింగ్

స్టార్​లైనెప్స్​ ఎంటర్ప్రైజెస్ బోనస్ షేర్లు..

స్టార్​లైనెప్స్​ ఎంటర్ప్రైజెస్ బోనస్ షేర్ల గురించి భారతీయ స్టాక్ మార్కెట్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. “కంపెనీ డైరెక్టర్ల బోర్డు 2024-25 లో 2024 ఆగస్టు 8, గురువారం జరిగిన మీటింగ్ నంబర్ 2/2024-25 లో కంపెనీ ఈక్విటీ వాటాదారులకు బోనస్ ఈక్విటీ షేర్లను జారీ చేసే ప్రతిపాదనను ఆమోదించింది,” అని సంస్థ వెల్లడించింది. పోస్టల్ బ్యాలెట్ ద్వారా పొందాల్సిన షేర్ హోల్డర్ల ఆమోదం, అవసరమైన ఇతర అనుమతులకు ఇది లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. రికార్డ్ తేదీ నాటికి కంపెనీలో అర్హత కలిగిన ఈక్విటీ వాటాదారులు కలిగి ఉన్న ప్రతి 5 (ఐదు) ఈక్విటీ షేర్లకు రూ. 1/- ఫేస్​ వాల్యూతో ఒక షేరు ఇస్తున్నట్టు ప్రకటించింది.

ఈ మేరకు బోనస్ ఇష్యూకు సంబంధించిన రికార్డు తేదీని స్టాక్ ఎక్స్ఛేంజీకి త్వరలో తెలియజేస్తామని స్టార్​లైనెప్స్​ ఎంటర్ప్రైజెస్ తెలిపింది.

మల్టీబ్యాగర్ స్టాక్ బీఎస్ఈలో మాత్రమే ట్రేడింగ్​కు అందుబాటులో ఉంది. బీఎస్ఈలో దీని ప్రస్తుత ట్రేడింగ్ వాల్యూం 2.03 లక్షలు. స్టాక్​ స్ల్పిట్​, బోనస్​ షేర్ల ప్రకటన అనంతరం శుక్రవారం ట్రేడింగ్ సెషన్​లో మధ్యాహ్నం 1 గంట 15 నిమిషాల సమయానికి ఈ సంస్థ షేర్లు రూ. 162 వద్ద ట్రేడ్​ అవుతున్నాయి.​ ఈ స్మాల్ క్యాప్ షేరు 52 వారాల గరిష్ట స్థాయి రూ.182 కాగా, 52 వారాల కనిష్ట స్థాయి రూ.83.30.

(గమనిక:- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఇన్​వెస్ట్​మెంట్​ చేసే ముందు మీరు మీ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

సంబంధిత కథనం