Multibagger stock: మల్టీబ్యాగర్ కోసం చూస్తున్నారా?.. రూ. 50 లోపు లభించే ఈ స్మాల్ క్యాప్ స్టాక్ ను ట్రై చేయండి-multibagger small cap stock available below rs 50 anand rathi expects 32 percent upside ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Multibagger Stock: మల్టీబ్యాగర్ కోసం చూస్తున్నారా?.. రూ. 50 లోపు లభించే ఈ స్మాల్ క్యాప్ స్టాక్ ను ట్రై చేయండి

Multibagger stock: మల్టీబ్యాగర్ కోసం చూస్తున్నారా?.. రూ. 50 లోపు లభించే ఈ స్మాల్ క్యాప్ స్టాక్ ను ట్రై చేయండి

Sudarshan V HT Telugu
Published Feb 14, 2025 08:23 PM IST

Multibagger stock: ప్రస్తుతం మార్కెట్ ఒడిదుడుకుల్లో మంచి రిటర్న్స్ ఇచ్చే స్టాక్ ను గుర్తించడం సవాలుతో కూడుకున్న విషయం.అయితే, సమీప కాలంలో కనీసం 32% రిటర్న్ ఇవ్వగలదని ఒక స్మాల్ క్యాప్ స్టాక్ గురించి బ్రోకరేజ్ సంస్థ ఆనంద్ రాఠీ సూచిస్తోంది.

మల్టీబ్యాగర్ కోసం చూస్తున్నారా?
మల్టీబ్యాగర్ కోసం చూస్తున్నారా?

Multibagger stock: ప్రస్తుతం రూ. 50 కన్నా తక్కువ ధరకు లభిస్తున్న ఒక మల్టీబ్యాగర్ స్మాల్ క్యాప్ స్టాక్ భవిష్యత్తులో మంచి రిటర్న్ లను ఇస్తుందని బ్రోకరేజ్ సంస్థ ఆనంద్ రాఠీ సూచిస్తోంది. మల్టీ బ్యాగర్ స్మాల్ క్యాప్ స్టాక్ ‘‘వన్ పాయింట్ వన్ సొల్యూషన్స్ లిమిటెడ్’’ సమీప భవిష్యత్తులో కనీసం 32 శాతం పెరుగుతుందని ఆనంద్ రాఠీ అంచనా వేస్తోంది.

ప్రస్తుతం తక్కువకే..

‘వన్ పాయింట్ వన్ సొల్యూషన్స్ లిమిటెడ్’’ స్టాక్ రూ.51.75 వద్ద ప్రారంభమై, బ్రాడ్ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులతో వన్ పాయింట్ వన్ సొల్యూషన్స్ షేరు ధర ఇంట్రాడేలో 3 శాతానికి పైగా క్షీణించి రూ.49.06 వద్ద ముగిసింది. వన్ పాయింట్ వన్ సొల్యూషన్స్ లిమిటెడ్ షేరు ధర ఈ సంవత్సరం ఇప్పటివరకు 11.15 శాతం క్షీణించింది. రెండేళ్ల క్రితం అంటే 2023 ఫిబ్రవరిలో రూ.15- రూ.16 స్థాయిలో ట్రేడ్ అయిన వన్ పాయింట్ వన్ సొల్యూషన్స్ లిమిటెడ్ షేరు ధర అనేక రెట్లు పెరిగింది. వన్ పాయింట్ వన్ సొల్యూషన్స్ లిమిటెడ్ షేరు ధర గత 5 సంవత్సరాలలో 1000% పైగా పెరిగింది.

32% పైగా రాబడి

వన్ పాయింట్ వన్ సొల్యూషన్స్ లిమిటెడ్ షేర్లను ఇప్పుడు కొనుగోలు చేయవచ్చని ఆనంద్ రాఠీ సూచిస్తోంది. ఈ కంపెనీ షేరు ధరలో భవిష్యత్తులో 32 శాతానికి పైగా పెరుగుదల సాధ్యమని బ్రోకరేజ్ సంస్థ ఆనంద్ రాఠీ సూచిస్తోంది. వన్ పాయింట్ వన్ సొల్యూషన్స్ లిమిటెడ్ షేర్ల టార్గెట్ ధరను ఆనంద్ రాఠీ రూ.65 గా అంచనా వేసింది. ఈ షేర్లను రూ.44 స్టాప్ లాస్ తో, ఒక నెల కాలపరిమితితో కొనుగోలు చేయాలని ఆనంద్ రాఠీ ఇన్వెస్టర్లకు సూచిస్తోంది.

వన్ పాయింట్ వన్ సొల్యూషన్స్ టెక్నికల్స్

గతంలో వన్ పాయింట్ వన్ సొల్యూషన్స్ సంస్థ షేర్లు రూ. 77.5 వద్ద గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఆ తరువాత, సుమారు 40% పడిపోయింది. ఇటీవల ఒక కీలక మద్దతు జోన్ వద్ద 1:1 దిద్దుబాటు దశను పూర్తి చేసింది. ఇది మంత్లీ, క్వార్టర్లీ, ఇయర్లీ కామరిల్లా పైవోట్ సపోర్ట్ లతో అనుసంధానించబడి ఉంటుంది. అదనంగా, ప్రస్తుత ధర ఆగస్టు 2022 నుండి ఆగస్టు 2024 వరకు అప్ట్రెండ్ యొక్క 0.382% పునరుద్ధరణకు దగ్గరగా ఉంది. ఇది సంభావ్య తిరోగమనాన్ని సూచిస్తుందని ఆనంద్ రాఠీ సంస్థలోని అనలిస్ట్ లు తెలిపారు. వన్ పాయింట్ వన్ సొల్యూషన్స్ కోసం రూ. 50-రూ. 52 శ్రేణిలో లాంగ్ పొజిషన్ ఇవ్వాలని ఆనంద్ రాఠీ సూచించారు. రీబౌండ్ కోసం రూ. 65 టార్గెట్ చేశారు. రిస్క్ ను నిర్వహించడానికి రూ. 44 స్టాప్-లాస్ సెట్ చేయాలని సూచించారు.

సూచన: పై అభిప్రాయాలు, సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులు లేదా బ్రోకింగ్ కంపెనీలవి. హెచ్ టీ తెలుగు వి కావు. ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులను సంప్రదించాలని మేము పెట్టుబడిదారులకు సలహా ఇస్తున్నాము.

Sudarshan V

eMail
He has experience and expertise in national and international politics and global scenarios. He is interested in political, economic, social, automotive and technological developments. He has been associated with Hindustan Times digital media since 3 years. Earlier, He has worked with Telugu leading dailies like Eenadu and Sakshi in various editorial positions.
Whats_app_banner