Penny stock : 1లక్షను 5.45 కోట్లుగా మార్చిన పెన్నీ స్టాక్ ఇది- ఇన్వెస్టర్లు ఫుల్ ఖుష్!
Multibagger penny stock : మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్స్‌లో ఒకటైన టీసీపీఎల్ ప్యాకేజింగ్.. ఇన్వెస్టర్స్‌కి అద్భుతమైన రిటర్నులు ఇచ్చింది. 22ఏళ్లల్లో రూ. 1లక్షను రూ. 5.45 కోట్లుగా మార్చింది.
మల్టీబ్యాగర్ స్టాక్స్‌కి ఉన్న హైప్, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఇక మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్స్ కోసం మదుపర్లు ఎప్పటికప్పడు వెతుకుతూనే ఉంటారు. ఇలాంటి స్టాక్స్‌లో ఒకటి టీసీపీఎల్ ప్యాకేజింగ్! ఈ స్టాక్ రూ. 1లక్షను ఏకంగా రూ. 5.45 కోట్లుగా మార్చింది. వివరాల్లోకి వెళితే..
టీసీపీఎల్ ప్యాకేజింగ్ షేర్ ప్రైజ్ హిస్టరీ..
డాట్ కామ్ బబుల్ పతనం తర్వాత టీసీపీఎల్ ప్యాకేజింగ్ షేరు ధర రూ.10 దిగువకు పడిపోయింది. 2002 మార్చ్ 13న బీఎస్ఈలో టీసీపీఎల్ ప్యాకేజింగ్ షేరు ధర రూ.7.95 వద్ద ముగిసింది. ఎవరైనా ఈ పాయింట్లో టీసీపీఎల్ ప్యాకేజింగ్ షేర్లను కొనుగోలు చేసి, ఈ రోజు వరకు కంటిన్యూ చేసి ఉంటే, ఈ 22 సంవత్సరాలలో ఆ పెట్టుబడి విలువ 545 రెట్లు పెరిగేది! ఇటీవలి దశాబ్దాల్లో భారతీయ స్టాక్ మార్కెట్ అందించిన మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్స్‌లో టీసీపీఎల్ ప్యాకేజింగ్ షేర్ ఒకటనడంలో సందేహం లేదు.
ఇక ఇప్పుడు.. నెల రోజుల వ్యవధిలో టీసీపీఎల్ ప్యాకేజింగ్ షేరు ధర బీఎస్ఈలో రూ .3,748 నుంచి రూ. 4,365 కు పెరిగింది. ఇది 15 శాతానికి పైగా పెరుగుదలను నమోదు చేసినట్టు. గత ఆరు నెలల్లో ఈ మల్టీబ్యాగర్ స్టాక్ 30 శాతానికి పైగా పెరిగింది. వైటీడీ టైమ్‌లో టీసీపీఎల్ ప్యాకేజింగ్ షేరు ధర 35 శాతం పెరుగుదలతో రూ.3,222 నుంచి రూ.4,365కు పెరిగింది. ఏడాదిలో మల్టీబ్యాగర్ స్టాక్ తన పొజిషనల్ షేర్ హోల్డర్లకు 90 శాతం రాబడిని ఇచ్చింది! గత ఐదేళ్లలో ఈ మల్టీబ్యాగర్ షేరు ధర రూ.190 నుంచి రూ.4,365కు పెరిగి 2,200 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత పదేళ్లలో, ఈ మల్టీబ్యాగర్ స్టాక్ ఒక షేరుకు సుమారు రూ. 440 నుంచి రూ .4,365కు చేరింది. ఇది దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు 1,000 శాతం రాబడిని అందించినట్టు!
అదేవిధంగా, గత 20 సంవత్సరాల్లో, ఈ మల్టీబ్యాగర్ స్టాక్ ఒక షేరుకు రూ. 22 నుంచి రూ. 4,365కు పెరిగింది. ఇది దాని పొజిషనల్ వాటాదారులకు 19,750 శాతం రాబడిని అందించినట్టు. గత 22 ఏళ్లలో ఈ మల్టీబ్యాగర్ స్టాక్ 545 రెట్లు లేదా 54,500 శాతం పెరిగింది.
రూ. 1లక్ష పెట్టుబడి ఇలా..
టీసీపీఎల్ ప్యాకేజింగ్ షేర్ ప్రైజ్ హిస్టరీని పరిశీలిస్తే, ఒక పెట్టుబడిదారుడు ఒక నెల క్రితం ఇందులో రూ .1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే, విలువ రూ .1.15 లక్షలకు మారుతుంది. 2024 చివరి నాటికి ఇన్వెస్టర్ ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌లో రూ .1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే, అది రూ .1.35 లక్షలకు మారుతుంది. ఆరు నెలల క్రితం ఇన్వెస్టర్ ఈ స్టాక్‌లో రూ .1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే, అది నేడు రూ .1.30 లక్షలకు, ఒక సంవత్సరంలో ఇది రూ .1.90 లక్షలకు మారుతుంది. గత అయిదేళ్లలో పెట్టుబడిదారుడి రూ.లక్ష నేడు రూ.23 లక్షలుగా ఉండేది.
పదేళ్ల క్రితం ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌లో పెట్టుబడి పెట్టి ఉంటే దాని రూ.1 లక్ష నేడు రూ.11 లక్షలకు చేరేది. అదేవిధంగా, ఒక పెట్టుబడిదారుడు 20 సంవత్సరాల క్రితం ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్‌లో రూ .1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే, అది రూ .1.98 కోట్లకు మారుతుంది. అదేవిధంగా, ఒక పెట్టుబడిదారుడు డాట్ కామ్ బబుల్ తర్వాత రూ .1 లక్ష పెట్టుబడి పెడితే, ఒక రూ .1 లక్ష రూ .5.45 కోట్లుగా మారుండేది.
టీసీపీఎల్ ప్యాకేజింగ్ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ రెండింటిలోనూ ట్రేడింగ్‌కి అందుబాటులో ఉన్నాయి. 26,715 వద్ద గురువారం ట్రేడింగ్ వాల్యూం ముగిసింది. టీసీపీఎల్ ప్యాకేజింగ్ షేర్ల ప్రస్తుత మార్కెట్ క్యాప్ రూ.3,964 కోట్లు. 52 వారాల గరిష్టం రూ.4,775 కాగా, 52 వారాల కనిష్ట స్థాయి రూ.1,902.05గా ఉంది.
(గమనిక- ఇది పెట్టుబడి సలహా కాదు. ఇది కేవలం సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధ లేదు. ఏదైనా స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు మీరు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించాల్సి ఉంటుంది.)
సంబంధిత కథనం