Multibagger stock : మూడేళ్లల్లోనే రూ. 1 లక్షను రూ. 1 కోటి చేసిన పెన్నీ స్టాక్​ ఇది!-multibagger penny stock turns 1 lakh into 1 cr in 3 yrs see details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Multibagger Stock : మూడేళ్లల్లోనే రూ. 1 లక్షను రూ. 1 కోటి చేసిన పెన్నీ స్టాక్​ ఇది!

Multibagger stock : మూడేళ్లల్లోనే రూ. 1 లక్షను రూ. 1 కోటి చేసిన పెన్నీ స్టాక్​ ఇది!

Sharath Chitturi HT Telugu
Jan 24, 2025 08:10 AM IST

Multibagger stock alert : మెర్క్యూరీ ఈవీ టెక్​ స్టాక్​ మదుపర్లను మూడేళ్లల్లో కోటీశ్వరులుగా చేసింది! రూ. 1లక్ష ఇన్వెస్ట్​మెంట్​ని ఏకంగా రూ. 1కోటి చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

రూ. 1 లక్షను రూ. 1 కోటిగా మార్చిన మల్టీబ్యాగర్​ పెన్నీ స్టాక్​ ఇది..
రూ. 1 లక్షను రూ. 1 కోటిగా మార్చిన మల్టీబ్యాగర్​ పెన్నీ స్టాక్​ ఇది.. (Pixabay)

స్టాక్​ మార్కెట్​లో మల్టీబ్యాగర్​ స్టాక్స్​ కోసం మదుపర్లు నిత్యం అన్వేషిస్తూ ఉంటారు. తక్కువ సమయంలో అధిక లాభాలు ఇచ్చే స్టాక్స్​లో పెట్టుబడి పెట్టి లాభాలు పొందాలని చూస్తుంటారు. ఆయా స్టాక్స్​తో భారీ సంపదని సృష్టించుకోవచ్చని వారి నమ్మకం. ఇక ఇలాంటి స్టాక్స్​లో ఒకదాని గురించి మీరు తెలుసుకోవాలి.! మెర్క్యూరీ ఈవీ టెక్ పెన్నీ స్టాక్​.. కేవలం మూడేళ్లల్లోనే రూ. 1లక్షను రూ. 1కోటిగా మార్చి మదుపర్లను సంపన్నులుగా చేసింది.

yearly horoscope entry point

మెర్క్యూరీ ఈవీ టెక్​ షేర్​ ప్రైజ్​ హిస్టరీ..

ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ అయిన ఈ మెర్క్యూరీ ఈవీ టెక్​ కంపెనీ షేరు 2022 నుంచి క్రమంగా పెరుగుతూ రూ.0.85 నుంచి ప్రస్తుత ట్రేడింగ్ ధర రూ.85కు ఎగబాకి 9,900 శాతం భారీ లాభాలను ఆర్జించింది. గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఈ స్టాక్​ రూ. 86.79 వద్ద గరిష్ఠాన్నినమోదు చేసి, చివరికిరూ. 84.6 దగ్గర స్థిరపడింది.

ఒక ఇన్వెస్టర్ మూడేళ్ల క్రితం ఈ కంపెనీలో రూ .1 లక్ష పెట్టుబడి పెట్టి, ఈ రోజు వరకు ఇన్వెస్ట్​మెంట్​ని కొనసాగించి ఉంటే.. దాని విలువ రూ .1 కోటికి పెరిగి ఉండేది! సరైన స్టాక్స్​ని ఎంచుకుంటే ఇన్వెస్టర్ల సంపదను భారీ స్థాయికి పెంచే ఈక్విటీ మార్కెట్ సామర్థ్యాన్ని ఇది ఎత్తిచూపుతుంది.

స్టాక్ బలమైన వార్షిక పనితీరు.. షేర్​ ప్రైజ్​లో రిఫ్లెక్ట్​ అవుతోంది. సీవై22లో ఇది 1300% రాబడిని అందించింది. తరువాతి క్యాలెండర్ సంవత్సరంలో 897శాతం లాభం నమోదు చేసింది.

మెర్క్యురీ ఈవీ-టెక్ గురించి..

ఈ సంస్థ ఎలక్ట్రిక్ వాహనాలు, ఇతర సంబంధిత పునరుత్పాదక ఇంధన ఉత్పత్తుల తయారీ- ట్రేడింగ్​లో నిమగ్నమై ఉంది. ఇది వాహనాలను ఉత్పత్తి చేయడమే కాకుండా బ్యాటరీలు, ఛాసిస్, మోటార్ కంట్రోలర్లు వంటి కీలకమైన భాగాలను కూడా తయారు చేస్తుంది.

దీని ఉత్పత్తి శ్రేణి ద్విచక్ర వాహనాల నుంచి బస్సులు, లోడర్లు, ప్యాసింజర్ వాహనాల వరకు విస్తరించి ఉంది. ఇది వివిధ రవాణా అవసరాలను తీరుస్తుంది. కంపెనీ అనుబంధ సంస్థ డీసీ 2 మెర్క్యురీ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇటీవల భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్​పో 2025లో పాల్గొంది. ఇక్కడ ఇది రెండు ఉత్పత్తులను ఆవిష్కరించింది. వి.. ఆఫ్-రోడర్ ఈ-టాంక్, లగ్జరీ వెహికిల్​ యూరోపా.

కంపెనీ ఫైనాన్షియల్స్​ని చూస్తే, క్యూ2ఎఫ్​వై25లో రూ. 1.60 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది అదే త్రైమాసికంతో పోల్చితే ఇది 171శాతం వృద్ధి. సంస్థ రెవెన్యూ రూ. 19.48 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాది అదే త్రైమసికంలో ఇది రూ. 5.52 కోట్లుగా ఉండేది.

మార్కెట్ అవకాశాలు..

పెరుగుతున్న పర్యావరణ అవగాహన, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సాంకేతిక పురోగతి, బ్యాటరీ టెక్నాలజీలో మెరుగుదల వంటి అంశాలతో ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ గణనీయమైన వృద్ధిని చూస్తోంది. ఫలితంగా, ఇప్పటికే అందుబాటులో ఉన్న వాహన తయారీదారులు, కొత్తగా ప్రవేశిస్తున్న ఈవీ సంస్థలు భారీగా పెట్టుబడులు పెడుతున్నారు.

భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ ప్రపంచంలో ఐదవ అతిపెద్దదిగా ఉంది. 2030 నాటికి మూడొవ అతిపెద్ద ఆటో మర్కెట్​గా మారుతుందని అంచనాలు ఉన్నాయి. ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ (ఐఈఎస్ఏ) ప్రకారం, భారత ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ 36% సీఏజీఆర్​తో విస్తరిస్తుందని భావిస్తున్నారు.

2030 నాటికి అన్ని వాణిజ్య కార్లకు 70%, ప్రైవేట్ కార్లకు 30%, బస్సులకు 40%, ద్విచక్ర- త్రిచక్ర వాహనాలకు 80% ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల వ్యాప్తిని సాధించాలని నీతి ఆయోగ్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది 2070 నాటికి నికర జీరో కర్బన ఉద్గారాలను సాధించాలనే లక్ష్యానికి అనుగుణంగా ఉంది.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హెచ్​టీ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్​లో ఇన్వెస్ట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించాల్సి ఉంటుంది.)

Whats_app_banner

సంబంధిత కథనం