Multibaggar stock : అసలుసిసలైన మల్టీబ్యాగర్ స్టాక్ అంటే ఇదే- ఏడాదిలో 6,000 శాతం పెరిగింది..
Multibaggar stock alert : భారత్ గ్లోబల్ డెవలపర్స్ షేర్లు ఏడాది కాలంలో 6వేల శాతం పెరిగాయి! ఇప్పుడు కంపెనీ నుంచి మరో బిగ్ అప్డేట్ వచ్చింది. బోనస్ షేర్లు, స్టాక్ స్ల్పిట్, డివిడెండ్‌ని సంస్థ ప్రకటించింది. ఆ వివరాలు..
మల్టీబ్యాగర్ స్టాక్స్ గురించి మదుపర్లు వెతుకుతూ ఉంటారు. ఎందుకుంటే, ఇవి సాధారణ స్టాక్స్ కన్నా కనీవినీ ఎరుగని రీతిలో రిటర్నులు ఇస్తాయి! ఇలాంటి మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో ఒకటి.. భారత్ గ్లోబల్ డెవలపర్స్. ఈ సంస్థ షేర్లు ఏడాది కాలంలో దాదాపు 6000శాతం రిటర్నులు ఇవ్వడం విశేషం. ఇక ఇప్పుడు వచ్చే వారం ఈ షేర్లు ఫోకస్లో ఉండనున్నాయి. ఎందుకుంటే..
మల్టీబ్యాగర్ స్టాక్ అలర్ట్..
భారత్ గ్లోబల్ డెవలపర్స్ షేర్లు గత ఏడాది కాలంలో కంపెనీ షేరు ధరలు 6000 శాతానికి పైగా పెరిగాయి. గురువారం కంపెనీ షేర్లు 5 శాతం పెరిగి రూ. 1,153 వద్ద స్థిరపడ్డాయి.
వీటికి తోడు ఇప్పుడు సంస్థ బోనస్ షేర్లు, స్టాక్ స్ల్పిట్, డివిడెండ్‌ను ప్రకటించింది. నవంబర్ 12న స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో 10 షేర్లకు 8 బోనస్ షేర్లు ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది. అదే సమయంలో రూ.10 ముఖ విలువ కలిగిన షేరును స్ల్పిట్ చేయనున్నట్టు వెల్లడించింది. దీంతోపాటు ఒక షేరుకు 100 శాతం మధ్యంతర డివిడెండ్ చెల్లించేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. ఈ మూడు ప్రతిపాదనలపై 2024 నవంబర్ 18న నిర్ణయం తీసుకోనున్నారు.
ఈ మూడు ప్రతిపాదనలపై కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకుంటే సంస్థ చరిత్రలో తొలిసారి బోనస్ షేరు, డివిడెండ్, స్టాక్ విభజన ఒకేసారి ఉంటుంది.
భారత్ గ్లోబల్ డెవలపర్స్ షేర్ ప్రైజ్ హిస్టరీ..
గురువారం అప్పర్ సర్క్యూట్ తర్వాత కంపెనీ షేరు రూ.1153 స్థాయిలో ముగిసింది. భారత్ గ్లోబల్ డెవలపర్స్ లిమిటెడ్ షేర్లు గత మూడు నెలల్లో 555 శాతం పెరిగాయి. అదే సమయంలో, కంపెనీ షేరు ధర 2024 లో 1971.89 శాతం పెరిగింది. షేరు ధర ఏడాదిలో 6077 శాతం వృద్ధిచెందింది.
కంపెనీ 52 వారాల గరిష్ట స్థాయి రూ.1152.80, 52 వారాల కనిష్ట స్థాయి రూ.19.59. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.11,673.21 కోట్లుగా ఉంది.
(గమనిక:- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం. సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించడం ఉత్తమం.)
సంబంధిత కథనం