Multibaggar penny stock : 19000శాతం పెరిగిన రూ. 1 పెన్నీ స్టాక్- ఇప్పుడు ఎంట్రీ ఇవ్వొచ్చా?
ఝవేరీ క్రెడిట్స్ అండ్ క్యాపిటల్ షేర్లు దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు బలమైన రిటర్నులు ఇచ్చాయి.
ఒకప్పుడు పెన్నీ స్టాక్‌గా పిలిచే ఝవేరీ క్రెడిట్స్ అండ్ క్యాపిటల్ షేర్లు దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు బలమైన రాబడులను ఇచ్చాయి. శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఈ కంపెనీ షేరు 3 శాతం పెరిగి రూ.378 వద్ద గరిష్ఠాన్ని నమోదు చేసి రూ. 371 వద్ద ముగిసింది. నాలుగేళ్ల క్రితం 2020 జూలైలో ఈ షేరు ధర రూ.1.96గా ఉంది. అంటే ఈ కాలంలో ఇది 19185% పెరిగినట్టు. గత మూడేళ్లలో ఈ స్టాక్ విపరీతంగా పెరిగింది. 2021 జూలైలో రూ.5.38తో పోలిస్తే 6926 శాతం వృద్ధిని నమోదు చేసినట్టు!

మల్టీబ్యాగర్ స్టాక్ హైలైట్స్..
ఏడాదిలో ఈ ఝవేరీ క్రెడిట్స్ అండ్ క్యాపిటల్ షేరు 310 శాతానికి పైగా లాభపడింది. కాగా ఈ ఏడాది 2024 ఇప్పటివరకు నాలుగు నెలల్లో స్టాక్ నష్టపోయింది. జూన్‌లో దాదాపు 4 శాతం, మేలో 2.6 శాతం, ఏప్రిల్ లో 23 శాతం, మార్చిలో 5 శాతానికి పైగా పడిపోయింది. కానీ ఈ ఏడాది ప్రారంభంలో ఫిబ్రవరిలో 21 శాతం గణనీయమైన ర్యాలీని చూసింది. జనవరిలో 47 శాతం భారీ పెరుగుదలను చూసింది.
మార్చి 2, 2024 నాటి రికార్డు గరిష్ట స్థాయి రూ.527.30 నుంచి ప్రస్తుతం షేరు 30 శాతానికి పైగా పడింది. ఝవేరి క్రెడిట్ అండ్ క్యాపిటల్ 2023 జూలై 24 న నమోదైన 52 వారాల కనిష్ట స్థాయి రూ.90.70 నుంచి ఇప్పటికీ 305 శాతం పెరిగింది.
ఇదీ చూడండి:- Budget Impact On Stock Market : బడ్జెట్ 2024తో ఏ రంగాల్లోని ఏ స్టాక్స్ లాభపడతాయి?
ఈ స్టాక్‌లో ఇప్పుడు ఎంట్రీ ఇవ్వొచ్చా?
ఝవేరి క్రెడిట్స్ అండ్ క్యాపిటల్ లిమిటెడ్ భారతదేశంలో కమోడిటీ బ్రోకింగ్ వ్యాపారంలో చురుకుగా ఉంది. ఝవేరి క్రెడిట్స్ & క్యాపిటల్ 1993 లో స్థాపించారు. ఇది వడోదర, భారతదేశం ఆధారిత సంస్థ.
కాగా ఈ స్టాక్ ప్రస్తుతం ఈఎస్ఎం: స్టేజ్ 1 కింద ఉంది. ఇటీవల (జూలై 10 న) మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి షోకాజ్ నోటీసును అందుకుంది. అడ్వాన్స్డ్ సర్వైలెన్స్ మెజర్స్ (ఈఎస్ఎం) అనేది భారతదేశంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) అమలు చేసే నియంత్రణ ఫ్రేమ్‌వర్క్. పెట్టుబడిదారులను రక్షించడానికి, మార్కెట్ సమగ్రతను నిర్ధారించడానికి లిస్టెడ్ కంపెనీల పర్యవేక్షణ, నిఘాను పెంచడం దీని లక్ష్యం.
మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని మదుపర్లు చూస్తుంటారు. వీటిల్లో రిటర్నులు చాలా ఇంప్రెసివ్‌గా ఉంటాయి. అయితే రిస్క్ కూడా అలాగే ఉంటుంది. ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి.
(గమనిక:- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించడం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం