Multibagger stock: 125% డివిడెండ్ ప్రకటించిన మల్టీ బ్యాగర్ స్టాక్
Multibagger stock: పారిశ్రామిక రంగంలో ఉన్నస్మాల్ క్యాప్ కంపెనీ కిర్లోస్కర్ న్యూమాటిక్ కంపెనీ లిమిటెడ్ (Kirloskar Pneumatic Company Limited). ఈ సంస్థ మార్కెట్ క్యాప్ రూ. 3,573.39 కోట్లు. తాజాగా, ఈ కంపెనీ మల్టీ బ్యాగర్ గా అవతరించి, షేర్ హోల్డర్లకు సిరులను కురిపిస్తోంది.
Multibagger stock: కిర్లోస్కర్ న్యూమాటిక్ కంపెనీ లిమిటెడ్ (Kirloskar Pneumatic Company Limited) ప్రధానంగా ఎయిర్ కంప్రెషర్స్, ఎయిర్ కండిషనింగ్, రిఫ్రిజిరేషన్ సిస్టమ్స్, ప్రాసెస్ గ్యాస్ సిస్టమ్స్, వేపర్ అబ్సాప్షన్ సిస్టమ్స్, ఇండస్ట్రియల్ గేర్ బాక్స్ లను ఉత్పత్తి చేస్తుంది. ఆయిల్, గ్యాస్, స్టీల్, సిమెంట్, ఫుడ్ అండ్ బేవరేజెస్, రైల్వేస్, డిఫెన్స్, మెరైన్.. తదితర రంగాల్లోని పరిశ్రమలకు తన ఉత్పత్తులను అందిస్తుంది.
ట్రెండింగ్ వార్తలు
Multibagger stock: 125% డివిడెండ్
షేర్ హోల్డర్లకు 125% డివిడెండ్ ఇవ్వాలని తాజాగా జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. రూ. 2 ముఖ విలువ కలిగిన ప్రతీ షేరుకు రూ. 2.50 చొప్పున డివిడెండ్ చెల్లించనున్నట్లు వెల్లడించింది. ఈ డివిడెండ్ ను పొందడానికి రికార్డు డేట్ గా ఫిబ్రవరి 7 వ తేదీని నిర్ణయించింది.
Multibagger stock: రూ. 312. 28 కోట్ల లాభం
ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (Q3FY23) ఈ కిర్లోస్కర్ న్యూమాటిక్ కంపెనీ లిమిటెడ్ (Kirloskar Pneumatic Company Limited) నికర ఆదాయం రూ. 312.28 కోట్లు. ఇది గత Q3 (Q3FY22) కన్నా 37.39% అధికం. నికర లాభాల విషయానికి వస్తే, ఈ Q3లో సంస్థ రూ. 32.85 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం Q3 లో సంస్థ (Kirloskar Pneumatic Company Limited) నికర లాభాలు రూ. 12.11 కోట్లు మాత్రమే. అంటే, గత Q3తో పోలిస్తే, ఈ Q3లో కిర్లోస్కర్ న్యూమాటిక్ కంపెనీ లిమిటెడ్ (Kirloskar Pneumatic Company Limited) ఏకంగా 171.26% అధిక నికర లాభాలను ఆర్జించింది. ఈ Q3FY23 లో కంపెనీ ఖర్చులు రూ. 270.87 కోట్లకు పెరిగాయి. గత Q3 లో ఇవి రూ. 213.85 కోట్లు మాత్రమే.
Multibagger stock: షేరు విలువ
జనవరి 25న బీఎస్ఈ లో Kirloskar Pneumatic Company Limited షేరు ధర రూ. 546.45గా ఉంది. జనవరి 24 ముగింపు ధర రూ. 529.85 గా ఉంది. గత ఐదేళ్లలో ఈ సంస్థ మల్టీ బ్యాగర్ రిటర్న్ లను సాధించింది. గత ఐదేళ్లలో సంస్థ 195% రిటర్న్స్ ను, గత మూడేళ్లలో ఏకంగా 232% రిటర్న్స్ సాధించింది. సంవత్సర కాలంలో సంస్థ (Kirloskar Pneumatic Company Limited) షేరు విలువ రూ. 17.22% పెరిగింది. నవంబర్ 21న సంస్థ షేరు రూ. 654.00 లకు చేరి 52 వారాల గరిష్టాన్ని అందుకుంది.