రాధికా మర్చంట్‌తో అనంత్ అంబానీ ఎంగేజ్‌మెంట్-mukesh ambanis son anant ambani gets engaged to radhika merchant at antilia ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Mukesh Ambanis Son Anant Ambani Gets Engaged To Radhika Merchant At Antilia

రాధికా మర్చంట్‌తో అనంత్ అంబానీ ఎంగేజ్‌మెంట్

HT Telugu Desk HT Telugu
Jan 19, 2023 10:04 PM IST

ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ నిశ్చితార్థ వేడుక గురువారం వారి నివాసంలో జరిగింది.

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌తో ముకేష్ అంబానీ దంపతులు
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌తో ముకేష్ అంబానీ దంపతులు (REUTERS)

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చంట్‌‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. అంబానీ నివాసం అంటీలియాలో గురువారం ఈ వేడుక జరిగింది. రాధికా మర్చంట్ ఎన్‌కోర్ హెల్త్ కేర్ సీఈవో వీరేన్ మర్చంట్ కూతురు. గుజరాత్‌లోని కచ్ ప్రాంతానికి చెందిన వారు. ఆమె గురు భావనా థాకర్ వద్ద 8 ఏళ్లు భరత నాట్యం నేర్చుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

జియో వరల్డ్ సెంటర్‌లో అంబానీ కుటుంబం జూన్ నెలలో ఆరంగేట్రం ఉత్సవం నిర్వహించినప్పుడు రాధిక వార్తల్లో నిలిచారు. అనంత్ అంబానీ ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇంధన విభాగానికి అధిపతిగా ఉన్నారు. అమెరికాలోని బ్రౌన్ యూనివర్శిటీలో చదువుకున్నారు. అప్పటి నుంచి రిలయన్స్ గ్రూపులో వేర్వేరు పదవుల్లో పనిచేశారు.

ఇటీవలే ఈ జంటకు సంప్రదాయ రోకా వేడుక రాజస్తాన్‌లోని శ్రీనాథ్‌జీ మందిరంలో జరిగింది.

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌తో ముకేష్ అంబానీ దంపతులు
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌తో ముకేష్ అంబానీ దంపతులు (AP)

‘అనంత్, రాధిక ఒకరికొకరు కొన్నేళ్లుగా తెలుసు. ఈనాటి వేడుకతో వారి వివాహ బంధానికి నాంది పడింది..’ అని రిలయన్స్ గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఇరు కుటుంబాలు అనంత్, రాధికలకు అందరి ఆశీస్సులు కోరుతున్నాయి..’ అని పేర్కొంది.

అనంత్ రిలయన్స్ ఎనర్జీ విభాగం వ్యవహారాలు చూస్తుండగా, రాధిక ఎన్‌కోర్ హెల్త్‌కేర్ బోర్డ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ముకేష్ అంబానీకి ముగ్గురు సంతానం. ఆకాష్, ఇషా కవలలు కాగా, అనంత్ చిన్న కుమారుడు.

WhatsApp channel

టాపిక్