Mukesh Ambani: రూ.38వేల కోట్ల విలువైన ఫుట్‍బాల్ క్లబ్‍ను అంబానీ కొననున్నారా?-mukesh ambani in race to buy english football premier league club liverpool fc ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Mukesh Ambani In Race To Buy English Football Premier League Club Liverpool Fc

Mukesh Ambani: రూ.38వేల కోట్ల విలువైన ఫుట్‍బాల్ క్లబ్‍ను అంబానీ కొననున్నారా?

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 13, 2022 07:29 PM IST

Mukesh Ambani in Race to buy Liverpool FC: ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్‍లో పాపులర్ జట్టు లివర్ పూల్ ఫుల్‍బాల్ క్లబ్‍ను సొంతం చేసుకునేందుకు ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ ఆసక్తిగా ఉన్నారని సమాచారం.

Mukesh Ambani - Liverpool FC: లివర్ పూల్ ఫుల్‍బాల్ క్లబ్‍ను అంబానీ కొననున్నారా?
Mukesh Ambani - Liverpool FC: లివర్ పూల్ ఫుల్‍బాల్ క్లబ్‍ను అంబానీ కొననున్నారా? (HT_PRINT)

Mukesh Ambani in Race to buy Liverpool FC: ప్రపంచ కుబేరుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) చైర్మన్ ముకేశ్ అంబానీ ఒకరు. అనేక రంగాల్లో ఆయన చాలా విజయవంతమయ్యారు. ఇప్పుడు ఓ ప్రముఖ ఫుల్‍బాల్ క్లబ్‍ను సొంతం చేసుకునేందుకు ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ ఆసక్తి చూపుతున్నారని సమాచారం. ప్రపంచంలోనే అత్యంత పాపులర్ అయిన ఇంగ్లిష్ ఫుట్‌‍‌బాల్ టీమ్ లివర్ పూల్‍ (Liverpool FC)ను కొనుగోలు చేసేందుకు అంబానీ ఆసక్తిగా ఉన్నారని ది మిర్రర్ రిపోర్ట్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్‍ (English Premier League) లో లివర్ పూల్ చాలా ఫేమస్ క్లబ్. ప్రస్తుతం ఫెన్‍వే స్పోర్ట్స్ గ్రూప్ (FSG) ఈ క్లబ్‍కు ఓనర్ గా ఉంది. 2010 అక్టోబర్ లో కొనుగోలు చేసిన ఈ క్లబ్‍ను ఇప్పుడు విక్రయించాలని ఆ సంస్థ భావిస్తోంది. గోల్డ్ మన్ సచ్స్, మోర్గాన్ స్టాన్లీలను ఈ విక్రయ ప్రక్రియ కోసం ఎఫ్‍ఎఫ్‍సీ నియమించుకుందని సమాచారం.

Mukesh Ambani - Liverpool FC: కళ్లు చెరిరే ధర!

4 బిలియన్ బ్రిటీష్ పౌండ్‍ల (సుమారు రూ.38వేల కోట్లు)కు Liverpool FCని విక్రయించాలని FSG నిర్ణయించుకుందని ది మిర్రర్ వెల్లడించింది. ప్రస్తుతం అంబానీ ఆస్తుల విలువ 90 బిలియన్ బ్రిటీష్ పౌండ్లుగా ఉంది. ప్రస్తుతం ప్రపంచంలో ఎనిమిదో అత్యంత ధనికుడిగా ముకేశ్ అంబానీ ఉన్నారు. ఈ నేపథ్యంలో లివర్ పూల్‍ను కొనేందుకు ముకేశ్ అంబానీ ముందుకు రానున్నారని తెలుస్తోంది. ఆ క్లబ్‍ను మరింత బలోపేతం చేసేందుకు మరిన్ని మిలియన్ డాలర్లను ఖర్చు చేసేందుకు కూడా ఆయన సిద్ధంగా ఉన్నారట. అయితే లివర్ పూల్ క్లబ్ కోసం ఆయన యూఈఏ, మిడిల్ ఈస్ట్ కు చెందిన కొన్ని సంస్థలతో పోటీ పడాల్సి వస్తుందని ది మిర్రర్ అంచనా వేసింది.

Mukesh Ambani - Liverpool FC: ఇండియాలోనూ క్రేజ్

ఇండియాలో క్రికెట్ తర్వాత ఫుట్‍బాల్‍కే అత్యంత ఆదరణ ఉంటుంది. ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (English Premier League) అంటే భారత్‍లో ఎంతో క్రేజ్. చాలా మంది భారత అభిమానులు ఈ లీగ్‍ను ఫాలో అవుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ఈ లీగ్‍ను ఇష్టపడతారు. ముఖ్యంగా లివర్ పూల్ క్లబ్ చాలా పాపులర్.

అయితే Liverpool FCని దక్కించుకునేందుకు ముకేశ్ అంబానీ ఆసక్తిగా ఉన్నారన్న వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు. 2010లో ఈ క్లబ్‍ను సొంతం చేసుకునేందుకు అంబానీతో పాటు సుబ్రతో రాయ్ కూడా ఆఫర్లు సమర్పించాలని రిపోర్టులు వచ్చాయి.

అత్యంత ధనిక క్రికెట్ టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‍ (IPL)లో ముంబై ఇండియన్స్ జట్టు.. అంబానీదే. భారత ఫుట్‍బాల్ టోర్నీ ఇండియన్ సూపర్ లీగ్ (ISL) నిర్వహణలోనూ అంబానీ కుటుంబానిదే కీలకపాత్రగా ఉంది. ఇప్పుడు ప్రపంచంలోనే పాపులర్ అయిన లివర్ పూల్‍ను కూడా ముకేశ్ అంబానీ సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ అధికారంగా ఏ సంకేతాలు ఇవ్వలేదు.

WhatsApp channel