ముకేశ్ అంబానీ మూడు ముక్కల్లో చెప్పిన ‘సక్సెస్ మంత్ర’ ఇదే.. విజయం సాధించాలంటే ఫాలో కండి..!-mukesh ambani asias richest man shares success mantra in 3 simple words ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ముకేశ్ అంబానీ మూడు ముక్కల్లో చెప్పిన ‘సక్సెస్ మంత్ర’ ఇదే.. విజయం సాధించాలంటే ఫాలో కండి..!

ముకేశ్ అంబానీ మూడు ముక్కల్లో చెప్పిన ‘సక్సెస్ మంత్ర’ ఇదే.. విజయం సాధించాలంటే ఫాలో కండి..!

Sudarshan V HT Telugu

ప్రపంచ కుబేరుల్లో ఒకరు, ఆసియాలో అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అయిన ముకేశ్ అంబానీ తన విజయమంత్రాన్ని, సక్సెస్ సీక్రెట్ ను మూడు ముక్కల్లో చెప్పారు. అదేంటో ఇక్కడ చూడండి..

ముకేశ్ అంబానీ తో అనంత్ లాధా (LinkedIn/Anant Ladha)

పెట్టుబడి ఆధారిత కంపెనీ వ్యవస్థాపకుడు అనంత్ లాధా ఇటీవల ఆసియాలోని అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీని కలిశారు. ఆ సందర్భంగా ముకేశ్ అంబానీతో జరిగిన క్లుప్త సంభాషణను లింక్డ్ఇన్ లో ఆయన పంచుకున్నారు. ఈ పోస్ట్ కొద్ది సేపట్లోనే వైరల్ గా మారింది. వేలాది లైక్స్ ను సాధించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీతో కలిసి దిగిన రెండు ఫొటోలను కూడా ఆయన తన లింక్డ్ఇన్ పోస్ట్ లో షేర్ చేశారు. వారి సంభాషణ సారాంశాన్ని, ఒక క్యాప్షన్ ను జత చేశారు.

ఒకే ప్రశ్న.. సూటి జవాబు

ముకేశ్ అంబానీతో కొద్దిసేపు సంభాషించినప్పుడు తాను ఒకే ఒక ప్రశ్న అడగగలిగానని పెట్టుబడి ఆధారిత స్టార్ట్ అప్ వ్యవస్థాపకుడు అనంత్ లాధా వెల్లడించారు. తాను ముకేశ్ అంబానీని "విజయం సాధించడానికి ఏమి కావాలి?" అనే చిన్న ప్రశ్నను అడిగానని వివరించాడు. అందుకు ముకేశ్ సూటిగా, క్లుప్తంగా ఈ జవాబు ఇచ్చారని వెల్లడించారు. ‘‘ఫోకస్, డెలిగేట్ అండ్ డైవర్సిఫై (Focus, delegate and diversify)’’ అని ముకేశ్ జవాబిచ్చారని వెల్లడించారు.

ప్రభావవంతమైన మెసేజ్

ముకేష్ అంబానీ సర్ ఇచ్చిన సరళమైన, ప్రభావవంతమైన సమాధానం ఇది అని ఆయన అభివర్ణించారు. అంబానీ ఫిలాసఫీలోని స్పష్టత, వివేకాన్ని ప్రశంసిస్తూ ఆయన పోస్ట్ చాలా మందిలో, ముఖ్యంగా ఔత్సాహిక వ్యాపార వర్గాల్లో వైరల్ గా మారింది.

లింక్డ్ఇన్ లో వైరల్ మూమెంట్

ముకేశ్ అంబానీతో దిగిన రెండు ఫొటోలు, ఒక చిన్న సందేశం ఉన్న ఈ లింక్డ్ ఇన్ పోస్ట్ వేగంగా ట్రాక్షన్ పొందింది. 2,000కు పైగా లైక్ లను సంపాదించింది. కామెంట్ల సంఖ్య నామమాత్రంగానే ఉన్నప్పటికీ, కనిపించిన కొన్ని ప్రశంసలను, స్ఫూర్తిని ప్రతిబింబించాయి. ఒక యూజర్ దీనిని "అత్యంత గొప్ప సలహా’ అన్నారు. మరొకరు ఈ ఫోటోను "మిలియన్ డాలర్ల క్షణం" అని అభివర్ణించారు. "ఇది బంగారం లాంటి సలహా. చాలా మంది ఒకేసారి 100 వస్తువుల వెంటబడ్తారు. ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ముకేశ్ అంబానీ మాత్రం ఇలా అంటాడు: 3 పనులు బాగా చేయండి. అంతే అని" మూడో నెటిజన్ వ్యాఖ్యానించారు. మరొకరు ఇలా రాశారు, "ఇంత అద్భుతమైన వ్యాపార టైకూన్ ను కలవడం గొప్ప విజయం. కంగ్రాట్స్!" అన్నారు.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం