Muhurat trading : ఈసారి ముహురత్ ట్రేడింగ్ ఎప్పుడు? అధికారిక ప్రకటన వచ్చేసింది..
Muhurat trading 2024 date : ముహురత్ ట్రేడింగ్ 2024 ఎప్పుడు? ఈ విషయంపై ఎన్ఎస్ఈ ఓ అధికారిక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో అసలు ముహురత్ ట్రేడింగ్ అంటే ఏంటి? ఈ ఏడాది ముహురత్ ట్రేడింగ్ ఎప్పుడు? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఈ ఏడాది ముహురత్ ట్రేడింగ్ ఎప్పుడు? అన్న విషయంపై నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) క్లారిటీ ఇచ్చేసింది. దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసే ఈ స్పెషల్ ట్రేడింగ్ సెషన్‌ని ఈ ఏడాది నవంబర్ 1న నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. ఫలితంగా నవంబర్ 1, శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ముహురత్ ట్రేడింగ్ 2024 జరుగుతుంది. బీఎస్ఈ (బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్) ఈ విషయంపై ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ నవంబర్ 1నే స్పెషల్ ట్రేడింగ్ సెషన్‌ని నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ముహురత్ ట్రేడింగ్ 2024 విశేషాలు..
ఈ సెషన్ దీపావళి నాడు ప్రారంభమయ్యే హిందూ క్యాలెండర్ సంవత్సరమైన కొత్త సంవత్ని సూచిస్తుంది. 'ముహురత్' లేదా శుభ సమయంలో ట్రేడింగ్ చేయడం వల్ల ట్రేడర్లు, ఇన్వెస్టర్స్‌కి శ్రేయస్సు, ఆర్థిక వృద్ధి లభిస్తుందని స్టాక్ మార్కెట్లో విశ్వాసం.
సాధారణంగా అన్ని పండగలు, జాతీయ దినోత్సవాలకు స్టాక్ మార్కెట్లకు సెలవు ఉంటుంది. దీపావళికి కూడా సెలవు ఉంటుంది. కానీ సాయంత్రం గంట సేపు ముహురత్ ట్రేడింగ్‌ని నిర్వహిస్తారు. ఇక నవంబర్ 1న, సాయంత్రం 5.45 నుంచి 6.00 గంటల వరకు ప్రీ ఓపెనింగ్ సెషన్ జరగనుంది.
సాంప్రదాయకంగా కొత్త వెంచర్లను ప్రారంభించడానికి దీపావళి అనువైన సమయంగా భావిస్తారని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సెషన్లో పాల్గొనడం ద్వారా ఇన్వెస్టర్లు ఏడాది పొడవునా ప్రయోజనం పొందుతారని భావిస్తారు. అయితే కేవలం ఒక గంట ట్రేడింగ్‌తో, మార్కెట్లు అస్థిరంగా ఉంటాయి. ఈ సెషన్లో లాభనష్టాల గురించి పెద్దగా పట్టించుకోరు.
ఈ సమయంలో ఈక్విటీ, కమోడిటీ డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్, ఈక్విటీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ లోన్ (ఎస్ఎల్బీ) సహా వివిధ విభాగాల్లో ముహురత్ ట్రేడింగ్ జరుగుతుంది.
స్టాక్ మార్కెట్లో గత 17 ప్రత్యేక సెషన్లలో 13 సెషన్లలో బీఎస్ఈ సెన్సెక్స్ లాభాల్లో ముగియడంతో ఇన్వెస్టర్లు తరచుగా సానుకూల రాబడులను చూశారు. ఈ సెషన్లలో ఈక్విటీ సూచీల్లో పెద్ద కదలికలు కనిపించకపోవచ్చు.
అయితే 2008లో సెన్సెక్స్ అత్యంత ఆశావహ అంచనాలను సైతం ధిక్కరించి ఒక గంట సెషన్లో ఏకంగా 5.86 శాతం పెరిగింది!
ముహూర్తం ట్రేడింగ్ ఎందుకు ముఖ్యం?
భారతదేశంలో, స్టాక్ బ్రోకర్లు దీపావళిని తమ ఆర్థిక సంవత్సరం ప్రారంభంగా భావిస్తారు. చాలా మంది ఇన్వెస్టర్లు స్టాక్స్ కొనుగోలు చేయడం ద్వారా రాబోయే సంవత్సరానికి శ్రేయస్సును తీసుకురావడానికి ఈ సెషన్‌ని ఒక అవకాశంగా భావిస్తున్నారు. ఇది ట్రేడర్లకు వారి పోర్ట్‌ఫోలియోలను వైవిధ్యపరచడానికి, కొత్త ఖాతాలను తెరవడానికి అవకాశాన్ని అందిస్తుంది.
ముహూరత్ ట్రేడింగ్ సాధారణంగా చురుకైన భాగస్వామ్యాన్ని ఆకర్షిస్తుంది. చాలా మంది అనుభవజ్ఞులైన పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియోలను సర్దుబాటు చేయడానికి ఈ అవకాశాన్ని ఉపయోగిస్తారు. ఏదేమైనా, దాని స్వల్ప వ్యవధిని బట్టి, మార్కెట్ కదలికలు తరచుగా అస్థిరంగా ఉంటాయి.
కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడంతో పాటు, ముహురత్ ట్రేడింగ్ రాబోయే వ్యాపార సీజన్ కోసం ఆశావాదం, వృద్ధిని సూచిస్తుంది. ఇది స్టాక్ మార్కెట్లో విశ్వాసాన్ని పెంపొందిస్తుంది.
సంబంధిత కథనం