సొగసైన డిజైన్, మిడ్-రేంజ్ పనితీరును మేళవించిన ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ మోటరోలా రేజర్ 60 ని భారత్ లో లాంచ్ చేసింది. తన ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ లైనప్ ను విస్తరించే లక్ష్యంతో మోటరోలా వివిధ సెగ్మెంట్లలో ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్ ను విడుదల చేస్తోంది.
మోటరోలా రేజర్ 60 ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ధర రూ .49,999గా నిర్ణయించారు. ఇది ధరలో తమ ఫ్లాగ్ షిప్ రేజర్ 60 అల్ట్రా కంటే దిగువన ఉంటుంది. రేజర్ 50 కి ఎగువన ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను జూన్ 4 నుండి ఫ్లిప్ కార్ట్, రిలయన్స్ డిజిటల్, మోటరోలా ఇండియా వెబ్సైట్, ఇతర ప్రధాన ఆఫ్ లైన్ రిటైలర్ల వద్ద కొనుగోలు చేయవచ్చు. మోటరోలా రేజర్ 60 ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ తో వస్తుంది. వినియోగదారులు మూడు పాంటోన్-సర్టిఫైడ్ కలర్ వేరియంట్ల నుండి ఎంచుకోవచ్చు. అవి పెరల్ మార్బుల్ ఫినిషింగ్ తో లైట్ స్కై కలర్, ఫ్యాబ్రిక్ బ్యాక్ తో జిబ్రాల్టర్ సీ కలర్, వేగన్ లెదర్ ఫినిషింగ్ తో స్ప్రింగ్ బడ్ కలర్. ఈ స్మార్ట్ ఫోన్ తో మోటరోలా మూడు సంవత్సరాల ఆండ్రాయిడ్ ఓఎస్ అప్ డేట్స్ ను, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్ లను అందిస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత హలో యుఐ ఇందులో ఉంటుంది.
ఈ మోటరోలా రేజర్ 60 ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ లో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,700 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో కూడిన 3.6 అంగుళాల పోఎల్ఈడీ ఎక్స్ టర్నల్ డిస్ప్లేతో పాటు, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, 3,000 నిట్స్ బ్రైట్నెస్ తో 6.9 అంగుళాల ఎల్టీపీవో పోఎల్ఈడీ మెయిన్ స్క్రీన్ ఉంటాయి. ఈ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ టైటానియం-రీఇన్ ఫోర్స్ డ్ హింజ్ ను కలిగి ఉంది. ఇది 5 లక్షల సార్లు ఫోల్డ్ చేయడాన్ని తట్టుకోగలదు. దుమ్ము మరియు నీటి నిరోధకత కోసం ఐపి 48 రేటింగ్ ను కలిగి ఉంది.
రేజర్ 60 ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ఎక్స్ చిప్ సెట్ పై పనిచేస్తుంది. ఇది 8 జిబి ర్యామ్, 256 జిబి యుఎఫ్ఎస్ స్టోరేజ్ తో జతచేయబడింది. డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్లు, స్పేషియల్ సౌండ్ సపోర్ట్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఈ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ లో ఓఐఎస్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ / మాక్రో సెన్సార్ ఉన్నాయి. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 32 మెగాపిక్సెల్, ఇంటర్నల్ డిస్ప్లేలో ఉంది. ఇందులో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 30వాట్ వైర్డ్ ఛార్జింగ్, 15వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లో 30వాట్ ఛార్జర్ ను అందిస్తున్నారు.
సంబంధిత కథనం