Telugu News  /  Business  /  Motorola Moto E13 Set To Launch In India Tomorrow Check Specifications Price Features Sale Color Options Details
Motorola New Phone: మోటో ఈ13 లాంచ్ రేపే..రూ.7వేలలోపు ధరతో! (Photo: Motorola)
Motorola New Phone: మోటో ఈ13 లాంచ్ రేపే..రూ.7వేలలోపు ధరతో! (Photo: Motorola)

Motorola New Phone: మోటో ఈ13 లాంచ్ రేపే..రూ.7వేలలోపు ధరతో!

07 February 2023, 16:05 ISTChatakonda Krishna Prakash
07 February 2023, 16:05 IST

Moto E13 India launch: ఎంట్రీ లెవెల్‍లో మోటో ఈ13 ఫోన్ రేపు (ఫిబ్రవరి 8) ఇండియాలో విడుదల కానుంది. బడ్జెట్ ధరలో 5,000mAh బ్యాటరీ, స్లీక్ డిజైన్‍తో ఈ మొబైల్ రానుంది.

Moto E13 India launch: బడ్జెట్ రేంజ్‍లో మరో స్మార్ట్ ఫోన్‍ను మోటోరోలా (Motorola) తీసుకొస్తోంది. మోటో ఈ13 లాంచ్ గురించి అధికారిక ప్రకటన చేసింది ఆ సంస్థ. మోటో ఈ13 మొబైల్ రేపు (ఫిబ్రవరి 8) భారత్‍లో విడుదల కానుంది. తక్కువ ధరలో 5,000 mAh బ్యాటరీతో రానుంది. స్లీక్ డిజైన్‍తో ఈ 4జీ ఫోన్‍ను తీసుకొస్తున్నట్టు మోటోరోలా పేర్కొంది. ఈ మోటో ఈ13కు సంబంధించిన కీలకమైన స్పెసిఫికేషన్లను వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

మోటో ఈ13 స్పెసిఫికేషన్లు

Moto E13 Specifications: మోటో ఈ13 ఫోన్ ఇప్పటికే ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్‌లో లిస్ట్ అయింది. దీని ద్వారా కీలకమైన స్పెసిఫికేషన్లను మోటోరోలా వెల్లడించింది. 6.5 ఇంచుల IPS LCD డిస్‍ప్లేను మోటో ఈ13 కలిగి ఉంది. యునీఎస్ఓసీ టీ606 (Unisoc T606) ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ (Android 13 Go Edition) ఆపరేటింగ్ సిస్టమ్‍తో ఈ నయా 4జీ మొబైల్ వస్తోంది.

Moto E13 Details: మోటో ఈ13 మొబైల్‍లో 5,000mAh బ్యాటరీ ఉంటుంది. గరిష్ఠంగా 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‍తో ఈ ఫోన్ వస్తోంది. డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉంటుంది. 8.5 మిల్లీమీటర్ల మందం, 180 గ్రాముల బరువుతో స్లీక్ డిజైన్‍తో Moto E13 వస్తోంది.

మోటో ఈ13 వెనుక 13 మెగాపిక్సెల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటాయి. డ్యుయల్ సిమ్, 4జీ ఎల్‍టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, జీపీఎస్ యూఎస్‍బీ టైప్-సీ పోర్ట్, 3.5mm హెడ్‍ఫోన్ జాక్‍ కనెక్టివిటీ ఫీచర్లతో ఈ మొబైల్ రానుంది.

మోటో ఈ13 అంచనా ధర

Moto E13 Price in India: మోటో ఈ13 ధర రూ.6,499 నుంచి రూ.6,999 మధ్య ఉంటుందని లీక్‍ల ద్వారా వెల్లడైంది. ఆరా గ్రీన్, కాస్మిక్ బ్లాక్, క్రీమ్ వైట్ కలర్లలో ఈ ఫోన్ లభిస్తుంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్, జియో మార్ట్ డిజిటల్‍తో పాటు ఆఫ్‍లైన్ స్టోర్లలోనూ ఈ మొబైల్ సేల్‍కు వస్తుంది.

స్పెసిఫికేషన్లను బట్టి చూస్తే ఎంట్రీ లెవెల్‍లో మోటో ఈ13 మంచి ఆప్షన్‍లా కనిపిస్తోంది. ముఖ్యంగా స్లిమ్ డిజైన్, తక్కువ బరువు ఉండడం ప్లస్ పాయింట్లుగా ఉండనున్నాయి.