మోటోరోలా తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ని ఇండియాలో లాంచ్ చేసింది. దీని పేరు మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్. ఇదొక మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్. మిలిటరీ గ్రేడ్ ఎంఐఎల్-ఎస్టీడీ-810హెచ్ సర్టిఫికేషన్, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68 రేటింగ్, క్వాడ్ కర్వ్డ్ ఓఎల్ఈడీ డిస్ప్లే వంటి స్పెసిఫికేషన్స్‌తో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ సింగిల్ 8 జీబీ ర్యామ్ / 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లో అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ.22,999. ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా సొంత వెబ్సైట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో ఈ ఏప్రిల్ 23 నుంచి ఈ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉండనుంది.
పాంటోన్ సర్ఫ్ ది వెబ్, పాంటోన్ జిబ్రాల్టర్ సీ అనే రెండు కలర్ వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్ లభించనుంది.
మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్‌లో 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 10 బిట్ పీఓలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటివి ఉన్నాయి. ఈ ఫోన్ ముందు భాగంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3, వెనుక భాగంలో వీగన్ లెథర్ ఫినిషింగ్ ఉన్నాయి.
అడ్రినో 710జీపీయూతో కూడిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్‌పై ఈ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ వరకు ఎల్పీడీడీఆర్ 4ఎక్స్ ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ లభిస్తోంది. అయితే, దీన్ని మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
ఆండ్రాయిడ్ 15 ఆధారిత మోటోరోలా మై యూఎక్స్తో వచ్చిన ఈ ఫోన్‌పై 2 సంవత్సరాల ఓఎస్ అప్డేట్స్, 3 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లను సంస్థ హామీ ఇస్తోంది. మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో 68 వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.
ఇక కెమెరా విషయానికొస్తే, ఈ మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్‌లో 50 మెగాపిక్సెల్ సోనీ ఎల్వైటీ-700సీ ప్రైమరీ సెన్సార్, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌తో వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ వంటివి ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
కనెక్టివిటీ విషయానికొస్తే, ఈ ఫోన్ 5జీ, డ్యూయల్ 4జీ వోల్ట్ఈ, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.4, జీపీఎస్, ఎన్ఎఫ్సీతో వస్తుంది. డాల్బీ అట్మాస్ బ్రాండింగ్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్ సెటప్‌కు కూడా ఫోన్ సపోర్ట్ చేస్తుంది.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ భారతీయులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
ఇంకో విషయం! హెచ్‌టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్ ఛానెల్స్‌లో అందుబాటులో ఉంది. టెక్ ప్రపంచం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్‌లో హెచ్‌టీ తెలుగు ఛానెల్‌ని ఫాలో అవ్వండి..
సంబంధిత కథనం