మోటోరోలా నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ అయ్యింది. దీని పేరు మోటోరోలా ఎడ్జ్ 60. ఇందులో మోటోరోలా ఎడ్జ్ 60, ఎడ్జ్ 60 ప్రో గ్యాడ్జెట్స్ ఉన్నాయి. ఇవి ఎడ్జ్ 50, ఎడ్జ్ 50 ప్రో మోడళ్లకు సక్సెసర్‌గా మార్కెట్లోకి అడుగుపెట్టాయి. కొత్త స్మార్ట్‌ఫోన్స్ అనేక కీలక క్వాలిటీస్‌ని పంచుకుంటాయి కాని కొన్ని ఫీచర్స్ భిన్నంగా ఉంటాయి. రెండు గ్యాడ్జెట్స్‌లో వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐపీ 69 రేటింగ్, 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టెమ్ 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ వంటివి ఉన్నాయి.
ఇండియాలో లాంచ్ గురించి అధికారిక ధృవీకరణ లేనప్పటికీ, మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో వేరియంట్ ఈ నెలాఖరులో భారతదేశానికి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఎందుకంటే మోటోరోలా ఇప్పటికే తన అధికారిక వెబ్‌సైట్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ లిస్ట్ చేసింది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా దాని రాకను టీజ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్స్ వివరాలను చూసేయండి..
మోటోరోలా ఎడ్జ్ 60, ఎడ్జ్ 60 ప్రో రెండింటిలోనూ 6.7 ఇంచ్ 1.5కే 120 హెర్ట్జ్ క్వాడ్ కర్వ్డ్ పోలెడ్ డిస్ప్లే, హెచ్డీఆర్10+ సపోర్ట్, 4500 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. అదే 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) తో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా వంటివి ఉన్నాయి. అదనంగా, రెండు మోడళ్లు 3ఎక్స్ ఆప్టికల్ జూమ్, ఓఐఎస్ సామర్థ్యం ఉన్న 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్‌తో వస్తాయి. రెండింటి మధ్య ఉన్న ఏకైక వ్యత్యాసం.. అల్ట్రావైడ్ కెమెరా వ్యూ. ప్రో మోడల్ 122-డిగ్రీల వ్యూ అందిస్తుంది. ప్రామాణిక మోడల్ 120-డిగ్రీల వ్యూ అందిస్తుంది.
పర్ఫార్మెన్స్ పరంగా, మోటోరోలా ఎడ్జ్ 60 స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ (2.5 గిగాహెర్ట్జ్), ఎడ్జ్ 60 ప్రో మరింత శక్తివంతమైన డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ (3.35 గిగాహెర్ట్జ్) కలిగి ఉన్నాయి. అదనంగా, ప్రో వేరియంట్లో 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000 ఎంఏహెచ్ పెద్ద బ్యాటరీ ఉంది. రెగ్యులర్ మోడల్ 5,200 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టెమ్పై పనిచేసే ఈ రెండు ఫోన్లలో యూఎస్బీ-సీ 2.0, ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్, డాల్బీ అట్మాస్‌తో స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. స్టాండర్డ్ మోడల్ మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్‌కు సపోర్ట్ చేస్తుంది.
మోటోరోలా ఎడ్జ్ 60 ధర 379.99 పౌండ్లు (సుమారు రూ. 43,000), ఎడ్జ్ 60 ప్రో స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర 599.99 పౌండ్లు (సుమారు రూ.68,000).
మోటోరోలా భారతదేశంలో రాబోయే ఎడ్జ్ 60 సిరీస్ గ్యాడ్జెట్ లాంచ్‌ను ఫ్లిప్‌కార్ట్ మొబైల్ యాప్‌లోని పోస్టర్ ద్వారా టీజ్ చేసింది. ఎడ్జ్ 60 ప్రో మోటోరోలా ఇండియా వెబ్సైట్లో పాంటోన్ షాడో, పాంటోన్ డాస్లింగ్ బ్లూ, పాంటోన్ స్పార్క్లింగ్ గ్రేప్తో పాటు బహుళ రంగుల ఎంపికలలో వస్తుంది. 8 జీబీ+256 జీబీ, 12 జీబీ+256 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. అధికారిక ధర, అమ్మకాల వివరాలు ఇంకా వెల్లడించనప్పటికీ, ఎడ్జ్ 60 ప్రో ఈ నెలాఖరులో భారతదేశంలో లాంచ్ అవుతుందని నివేదికలు సూచిస్తున్నాయి.
సంబంధిత కథనం