మోటోరోలా నుంచి కొత్త ప్రాడక్ట్స్- ప్యాడ్ 60 ప్రో, బుక్ 60 లాంచ్‌పై అప్డేట్..
Moto Pad 60 Pro India launch : మోటోరోలా ఏప్రిల్ 17 న భారతదేశంలో మోటో ప్యాడ్ 60 ప్రో, మోటో బుక్ 60లను లాంచ్ చేయనుంది. లాంచ్‌కి ముందు ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్స్ ద్వారా కీలక స్పెసిఫికేషన్లు, ఫీచర్లు బయటకు వచ్చాయి. ఆ వివరాలు..
మోటోరోలా నుంచి బిగ్ అప్డేట్! రెండు కొత్త గ్యాడ్జెట్స్‌ని సంస్థ త్వరలోనే ఇండియాలో లాంచ్ చేయనుంది. ఏప్రిల్ 17న మోటో ప్యాడ్ 60 ప్రో, మోటో బుక్ 60ని భారతదేశంలో లాంచ్ చేయనున్నట్లు ధృవీకరించింది. మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్‌ను ఏప్రిల్ 15న లాంచ్ చేయనున్నట్లు కంపెనీ వెల్లడించిన కొద్దిసేపటికే ఈ ప్రకటన వెలువడింది. మోటో ప్యాడ్ 60 ప్రో, మోటో బుక్ 60 రెండింటి వివరణాత్మక స్పెసిఫికేషన్లు ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి. రాబోయే గ్యాడ్జెట్స్‌కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
మోటో ప్యాడ్ 60 ప్రో: కీలక ఫీచర్లు
మోటో ప్యాడ్ 60 ప్రో పెద్ద, హై-క్వాలిటీ డిస్ప్లే, హై పర్ఫార్మెన్స్ని కోరుకునే వినియోగదారుల కోసం రూపొందించిన గ్యాడ్జెట్ అని చెప్పుకోవాలి. ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్ ధృవీకరించినట్లుగా ఈ డివైస్ 12.7 ఇంచ్ ఎల్సిడీ స్క్రీన్‌ని కలిగి ఉంది. ఇది 3 కే రిజల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటును అందిస్తుంది. డైమెన్సిటీ 8300 చిప్సెట్, 45వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 10,200 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే ఈ డివైజ్ జేబీఎల్ రూపొందించిన క్వాడ్ స్పీకర్ సెటప్‌తో ప్రీమియం మల్టీమీడియా ఎక్స్‌పీరియెన్స్‌ని అందిస్తుంది. అదనంగా, మోటోరోలా మోటో పెన్ ప్రో స్టైలస్‌ని బాక్స్‌లో చేర్చనుంది.
మోటో బుక్ 60: ముఖ్య స్పెసిఫికేషన్లు
మోటో బుక్ 60 కేవలం 1.4 కిలోల బరువున్న తేలికపాటి ల్యాప్‌టాప్ ఆప్షన్ని అందిస్తుంది. ఇందులో 2.8కే రిజల్యూషన్, 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 14 ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లేని అందించారు. ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్, 60వాట్ యూఎస్బీ-సీ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేసే 60వాట్ బ్యాటరీతో ఈ ల్యాప్‌టాప్ పనిచేస్తుంది. డాల్బీ అట్మాస్ రూపొందించిన డ్యూయెల్ స్టీరియో స్పీకర్ల ద్వారా ఆడియోను అందిస్తారు. మోటో బుక్ 60 రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది: వెడ్జ్‌వుడ్ (బ్లూ), బ్రాంజ్ గ్రీన్.
ఈ రెండు గ్యాడ్జెట్స్‌కి సంబంధించిన ధరలను సంస్థ ఇంకా ప్రకటించలేదు. ఏదేమైనా, మోటో బుక్ 60 అనేది మోటోరోలో తొలి నోట్‌బుక్ అవుతుంది. టెక్ మార్కెట్లో సంస్థ తన ప్రాడక్ట్స్ సెగ్మెంట్‌ని విస్తరించుకుంటోందని దీని బట్టి అర్థమవుతుంది.
మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్..
ఏప్రిల్ 15న మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్‌ను ఆవిష్కరించనుంది. ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్స్ ప్రకారం.. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్తో 6.67 ఇంచ్ 1.5కే పీఓఎల్ఈడ్ డిస్ప్లేతో వస్తుంది. ఇందులో 256 జీబీ వరకు స్టోరేజ్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ సహా ట్రిపుల్ కెమెరా సెటప్‌ని అందించనున్నారు.
సంబంధిత కథనం