Motorola New Phone | రూ.10వేలలోపు ధరలోనే మోటోరోలా కొత్త ఫోన్ లాంచ్.. 128జీబీ స్టోరేజ్‍, స్టీరియో స్పీకర్లతో..-moto g13 launched in india check price specifications features sale date ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Moto G13 Launched In India Check Price Specifications Features Sale Date

Motorola New Phone | రూ.10వేలలోపు ధరలోనే మోటోరోలా కొత్త ఫోన్ లాంచ్.. 128జీబీ స్టోరేజ్‍, స్టీరియో స్పీకర్లతో..

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 29, 2023 01:39 PM IST

Moto G13 launched: మోటోరోలా జీ13 ఫోన్ వచ్చేసింది. బడ్జెట్ ధరలోనే 128జీబీ స్టోరేజ్, డాల్బీ అట్మోస్ సపోర్ట్ స్టీరియో స్పీకర్లు ఉండడం హైలైట్‍గా ఉంది.

Motorola New Phone | రూ.10వేలలోపు ధరలోనే మోటోరోలా కొత్త ఫోన్ లాంచ్ (Photo: Motorola)
Motorola New Phone | రూ.10వేలలోపు ధరలోనే మోటోరోలా కొత్త ఫోన్ లాంచ్ (Photo: Motorola)

Moto G13 launched: జీ సిరీస్‍లో మరో బడ్జెట్ ఫోన్‍ను మోటోరోలా భారత మార్కెట్‍లోకి తీసుకొచ్చింది. మోటో జీ13 (Moto G13) మొబైల్‍ను బుధవారం (మార్చి 29) లాంచ్ చేసింది. డ్యుయల్ స్టీరియో స్పీకర్లు, ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‍ను ఈ మొబైల్ కలిగి ఉంది. హెచ్‍డీ+ డిస్‍ప్లే, మీడియాటెక్ హీలియో ప్రాసెసర్‌తో వస్తోంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్ (Flipkart)లో సేల్‍కు వస్తుంది. మోటో జీ13 మొబైల్ ధర, సేల్, పూర్తి స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయంటే..

ట్రెండింగ్ వార్తలు

మోటో జీ13 ధర, సేల్

Moto G13 Price: 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ఉన్న మోటో జీ13 ఫోన్ ధర రూ.9,999గా ఉంది. ఏప్రిల్ 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్‌లో ఈ ఫోన్ సేల్‍కు వస్తుంది. మ్యాట్ చార్కోల్, బ్లూ లావెండర్ కలర్ ఆప్షన్‍లలో Moto G13 లభిస్తుంది.

మోటో జీ13 స్పెసిఫికేషన్లు

Moto G13 Specifications: 6.5 హెచ్‍డీ+ ఎల్‍సీడీ డిస్‍ప్లేతో మోటో జీ13 వస్తోంది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పాండా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ ఫోన్ కేవలం 8.19 మిల్లీమీటర్ల మందం, 184 గ్రాముల బరువు ఉండగా.. డిజైన్‍ను హైలైట్ చేస్తోంది మోటో.

ప్రాసెసర్, ఓఎస్

Moto G13: మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌పై మోటో జీ13 రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‍తో వస్తోంది. ఆండ్రాయిడ్ 14 అప్‍డేట్‍ను కూడా ఈ మొబైల్ అందుకుంటుందని మోటో పేర్కొంది. డ్యుయల్ సిమ్ 4జీ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్‍బీ టైప్-సీ పోర్టు. 3.5mm హెడ్‍ఫోన్ జాక్ కనెక్టివిటీ ఫీచర్లతో ఈ మొబైల్ వస్తోంది.

స్టీరియో స్పీకర్లు

Moto G13: డాల్బీ అట్మోస్‍ సపోర్ట్ ఉండే డ్యుయల్ స్టీరియో స్పీకర్లను మోటో జీ13 కలిగి ఉంది. ఫింగర్ ప్రింట్ స్కానర్.. పవర్ బటన్‍కు ఉంటుంది. ఈ ఫోన్‍లో 5,000mAh బ్యాటరీ ఉంది. స్టాండర్డ్ 10 వాట్ల చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం