Budget friendly smartphone : ప్రీమియం లుక్స్​తో బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​- మోటో జీ05 బెస్ట్​!-moto g05 india launch date revealed check confirmed specs design and more ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Budget Friendly Smartphone : ప్రీమియం లుక్స్​తో బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​- మోటో జీ05 బెస్ట్​!

Budget friendly smartphone : ప్రీమియం లుక్స్​తో బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​- మోటో జీ05 బెస్ట్​!

Sharath Chitturi HT Telugu
Jan 04, 2025 06:40 AM IST

Moto G05 : మోటో జీ05 లాంచ్​ డేట్​ ఫిక్స్​ అయ్యింది. ఈ లేటెస్ట్​ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ ఫీచర్స్​తో పాటు ఇతర వివరాలను ఇక్కడ చూసేయండి..

మోటో జీ05 లాంచ్​ డేట్​ ఫిక్స్​..
మోటో జీ05 లాంచ్​ డేట్​ ఫిక్స్​.. (Motorola/Flipkart)

మోటోరోలా సరికొత్త బడ్జెట్​ ఫ్రెండ్లీ జీ సిరీస్ స్మార్ట్​ఫోన్​ని ఇండియాలో లాంచ్​ చేసేందుకు రెడీ అవుతోంది. దీని పేరు మోటో జీ05. ఇది గత సంవత్సరం అందుబాటులోకి వచ్చిన మోటో జి04కు సక్సెసర్​. అనేక అప్​గ్రేడ్​లను లేటెస్ట్​ గ్యాడ్జెట్​ కలిగి ఉంటుంది. ఈ మొబైల్​ ఇండియా లాంచ్​ డేట్​పై క్లారిటీ వచ్చేసింది. అంతేకాదు, ఫ్లిప్​కార్ట్​లోని మైక్రోసైట్ పుణ్యమా అని లాంచ్​కు ముందే ఈ బడ్జెంట్​ ఫ్రెండ్లీ మోటో జీ05 గురించి కొన్ని వివరాలు అందుబాటులోకి వచ్చాయి. వాటిని ఇక్కడ చూసేద్దాము..

yearly horoscope entry point

మోటో జీ05 స్పెసిఫికేషన్లు..

మోటో జీ05 స్మార్ట్​ఫోన్​ కోసం ఫ్లిప్​కార్ట్ మైక్రోసైట్​ని సందర్శిస్తే ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ81 ఎక్స్​ట్రీమ్ చిప్​సెట్​తో పనిచేస్తుందని తేలింది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఇందులో ఉండనుంది.

50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ షూటర్​ని మోటరోలా ఈ ఫోన్​లో ఇచ్చింది.

ఇక డిస్​ప్లే కోసం ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​లో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,000 నిట్స్ పీక్ బ్రైట్​నెస్​తో కూడిన 6.67 ఇంచ్​ ప్యానెల్​ని కలిగి ఉంటుంది. మోటోరోలా డిస్​ప్లే ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3ని ఎంచుకుంది.

డిజైన్ విషయానికొస్తే, మోటోరోలా వెజిటేరియన్​ లెదర్ బ్యాక్​ని ప్రవేశపెడుతోంది. ఇది ఫోన్​కు ప్రీమియం లుక్​ను ఇస్తుంది. ఇది బ్రాండ్ మరింత ప్రీమియం ఆఫర్లకు భిన్నంగా ఉంటుంది. అదనంగా, ఈ ఫోన్ పాంటోన్ క్యూరేటెడ్ రంగుల్లో లభిస్తుంది. వైబ్రెంట్ షేడ్స్​ను అందిస్తుంది.

ఇక సాఫ్ట్​వేర్​ విషయానికొస్తే మోటో జీ05 ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది. రెండేళ్ల పాటు అప్​డేట్స్​ ఇస్తామని సంస్థ చెబుతోంది. బ్యాటరీ విషయానికొస్తే, ఈ డివైస్ 5,200 ఎంఏహెచ్ యూనిట్​ని కలిగి ఉంది. ఇది 70 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 39 గంటల టాక్ టైమ్, 19 గంటల వీడియో ప్లేబ్యాక్, 28 గంటల ఇంటర్నెట్ బ్రౌజింగ్​ని అందిస్తుంది. మోటోరోలా ఐపీ52 వాటర్ రిపెల్లెంట్ రేటింగ్, వాటర్ టచ్ టెక్నాలజీ ఫీచర్ వంటి అదనపు ఫీచర్లను కూడా ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ కలిగి ఉంది.

మోటో జీ05 విడుదల తేదీ, లభ్యత..

ఇండియా మార్కెట్​లో సరికొత్త బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ మోటో జీ05.. జనవరి 7న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్​కార్ట్​లో లాంచ్ కానుంది. మైక్రోసైట్ రెండు కలర్​ ఆప్షన్స్​ని చూపిస్తోంది. అవి.. ఫారెస్ట్ గ్రీన్ (ఆకుపచ్చ షేడ్), ప్లమ్ రెడ్ (మెరూనిష్ రెడ్​). ఇతర కలర్ ఆప్షన్లు కూడా అందుబాటులోకి వస్తాయో లేదో చూడాలి.

ధరతో పాటు ఇతర వివరాలు లాంచ్​ నాటికి అందుబాటులోకి వస్తాయి.

Whats_app_banner

సంబంధిత కథనం