Motilal Oswal's Diwali stock picks: దివాళీకి మోతీలాల్ టాప్ 10 స్టాక్స్ ఇవే-motilal oswal diwali picks tata chemicals idfc among top 10 stocks to buy ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Motilal Oswal's Diwali Stock Picks: దివాళీకి మోతీలాల్ టాప్ 10 స్టాక్స్ ఇవే

Motilal Oswal's Diwali stock picks: దివాళీకి మోతీలాల్ టాప్ 10 స్టాక్స్ ఇవే

HT Telugu Desk HT Telugu

Motilal Oswal's Diwali stock picks: మోతీలాల్ ఓస్వాల్ బ్రోకరేజీ సంస్థ ఈ దీపావళికి 10 స్టాక్స్ రెకమెండ్ చేసింది.

దీపావళిపై అవగాహన పెంచుతూ నిర్వహించిన కార్యక్రమానికి సంబంధించిన ఫోటో (AFP)

నిఫ్టీ ఇండెక్స్ గ్లోబల్ మార్కెట్‌ను అధిగమించింది. భారతీయ మార్కెట్ బాగానే ఉందని, అంతర్జాతీయ అస్థిరత కారణంగా ఏదైనా పెద్ద క్షీణత ఉన్నా ఉత్తమ పనితీరు దానిని అధిగమిస్తుందని దేశీయ బ్రోకరేజ్, రీసెర్చ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ తెలిపింది.

‘గత దీపావళి (04 నవంబర్ 2021) నిఫ్టీ 17,900 జోన్‌కు సమీపంలో ట్రేడైంది. ఇప్పుడు దానికి దిగువన ట్రేడవుతోంది. అయితే నిఫ్టీ 15200 జోన్‌ నుంచి పైకెగిసింది. భయాందోళన ఉన్నప్పటికీ విదేశీ సంస్థాగత కొనుగోలుదారులు తెలివిగా కొనుగోలు చేశారు. భౌగోళిక-రాజకీయ ఆందోళన, రూపాయి విలువ క్షీణించడం, డాలర్ ఇండెక్స్ పెరగడం వంటి కారణాల వల్ల ప్రతికూలత కనిపిస్తోంది..’ అని మోతీలాల్ ఓస్వాల్ నివేదిక తెలిపింది. అయినప్పటికీ సిప్, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల నుండి వచ్చే నిధుల ప్రవాహం ఇండెక్స్‌ను మునుపటి దీపావళి స్థాయిలకు తీసుకువెళ్లనుందని తెలిపింది.

సంవత్ 2079కి సంబంధించిన సాంకేతిక అంశాల ఆధారంగా, బ్రోకరేజ్ హౌస్ టెక్నికల్ అంశాల ప్రాతిపదికన 10 స్టాక్‌లను సిఫార్సు చేసింది. ఈ దీపావళికి పెట్టుబడిదారులు కొనుగోలు చేయవచ్చునని సూచించింది.

దీపావళికి మోతీలాల్ ఓస్వాల్ టాప్ స్టాక్ పిక్స్:

IDFC లిమిటెడ్: కొనుగోలు పరిధి రూ. 78.5-76.5, స్టాప్ లాస్ రూ. 70, టార్గెట్ ధర రూ. 100

యాక్సిస్ బ్యాంక్: కొనుగోలు శ్రేణి రూ. 818-800, స్టాప్ లాస్ రూ. 750, టార్గెట్ ధర రూ. 1000

ఆదిత్య బిర్లా ఫ్యాషన్: కొనుగోలు శ్రేణి రూ. 333-322, స్టాప్ లాస్ రూ. 300, టార్గెట్ ధర రూ. 390

సీమెన్స్: కొనుగోలు రేంజ్ రూ. 2820-2780, స్టాప్ లాస్ రూ. 2640, టార్గెట్ ధర రూ. 3500

భారతీ ఎయిర్‌టెల్: కొనుగోలు పరిధి 780-760, స్టాప్ లాస్ రూ. 700, టార్గెట్ ధర రూ. 900

కొచ్చిన్ షిప్‌యార్డ్: కొనుగోలు రేంజ్ రూ. 515-490, స్టాప్ లాస్ రూ. 475, టార్గెట్ ధర రూ. 600

దీపక్ నైట్రేట్: కొనుగోలు రేంజ్ రూ. 2265-2230, స్టాప్ లాస్ రూ. 2050, టార్గెట్ ధర రూ. 2700

టాటా కెమికల్స్: కొనుగోలు శ్రేణి రూ. 1178-1150, స్టాప్ లాస్ రూ. 1080, టార్గెట్ ధర రూ. 1400

హిందుస్థాన్ ఏరోనాటిక్స్: కొనుగోలు శ్రేణి రూ. 2465-2420, స్టాప్ లాస్ రూ. 2270, టార్గెట్ ధర రూ. 2800

ట్రెంట్: కొనుగోలు శ్రేణి రూ. 1414-1385, స్టాప్ లాస్ రూ. 1300, టార్గెట్ ధర రూ. 1650

నిఫ్టీ సూచీ గత 12 నెలల్లో 15,183 నుండి 18,350 జోన్‌ వరకు 3000 పాయింట్ల విస్తృత శ్రేణిలో అస్థిరతల మధ్య పెరిగింది. ఎక్కువగా 16500-17000 జోన్‌ల దగ్గర కదులుతోంది.

పైన చేసిన అభిప్రాయాలు మరియు సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులు లేదా బ్రోకింగ్ కంపెనీలవి, హెచ్‌టీ తెలుగుకు చెందినవి కావు.