Maruti Suzuki Alto K10 : ఈ చౌకైన కారు అమ్మకాల్లో తగ్గడం లేదు.. మైలేజీలోనూ బెటర్.. పెట్రోల్, సీఎన్జీ ఆప్షన్స్
Maruti Suzuki Alto K10 : మారుతి సుజుకి ఆల్టో కె10 దేశీయ మార్కెట్లో అత్యంత చౌకైన కారు. ఈ హ్యాచ్‌బ్యాక్‌కు మంచి డిమాండ్ ఉంది. జనవరిలోనూ మంచి అమ్మకాలు చేసింది.

భారత ఆటోమెుబైల్ మార్కెట్‌లో అనేక ఆప్షన్స్ ఉన్నప్పటికీ.. మారుతి ఆల్టో K10కి డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. జనవరి 2025లో ఈ చిన్న హ్యాచ్‌బ్యాక్ 11,352 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఆల్టో ప్రజాదరణ అస్సలు తగ్గిపోవడం లేదని అర్థమవుతోంది.
ధర వివరాలు
దేశీయ మార్కెట్లో మారుతి ఆల్టో K10 ధర ఇప్పుడు రూ. 4.09 లక్షల నుండి రూ. 6.05 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంది. వేరియంట్ల ఆధారంగా ధరల్లో మార్పు ఉంటుంది. ఈ హ్యాచ్‌బ్యాక్ ఎస్టీడీ, ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, వీఎక్స్ఐ ప్లస్ వంటి నాలుగు వేరియంట్లలో లభిస్తుంది.
ఇంజిన్
మారుతి సుజుకి ఆల్టో కె10 1-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను పొందుతుంది. ఇది 67 పీఎస్ శక్తిని, 89 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనితో 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఏఎంటీ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ కారు సీఎన్జీ పవర్‌ట్రెయిన్‌ను కూడా పొందుతుంది. ఇది 57 పీఎస్ శక్తిని, 82 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనితో 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మాత్రమే అందిస్తారు. ఈ కారులో ఐడిల్ ఇంజిన్ స్టార్ట్/స్టాప్ టెక్నాలజీ అందుబాటులో ఉంది.
మైలేజీ ఎంతంటే
మారుతి సుజుకి ఆల్టో కె10 పెట్రోల్ మోడల్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 24.39 కి.మీ.ల మైలేజీని, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 24.90 కి.మీ.ల మైలేజీని అందిస్తుంది. సీఎన్జీ మోడల్ కిలోకు 33.85 కి.మీ వరకు మైలేజీని ఇస్తుంది.
ఇతర ఫీచర్లు
ఈ కారులో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీ, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, రివర్స్ కెమెరా, ఈబీడీతో ఏబీఎస్, వెనుక పార్కింగ్ సెన్సార్లు వంటి లక్షణాలతో వస్తుంది.