Electric vehicles in India : ‘2030 నాటికి.. ఇండియాలో 2కోట్ల ఎలక్ట్రిక్​ వాహనాలు’-more than 2 crore electric vehicles will be on road by 2030 says gadkari ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  More Than 2 Crore Electric Vehicles Will Be On Road By 2030 Says Gadkari

Electric vehicles in India : ‘2030 నాటికి.. ఇండియాలో 2కోట్ల ఎలక్ట్రిక్​ వాహనాలు’

Sharath Chitturi HT Telugu
Feb 13, 2023 07:28 AM IST

Electric vehicles in India : 2030 నాటికి ఇండియాలో 2కోట్లకుపైగా ఈవీలు ఉంటాయని కేంద్రమంత్రి నితిన్​ గడ్కరీ అన్నారు. ఈవీలతో కాలుష్యం తగ్గడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయన్నారు.

‘2030 నాటికి.. ఇండియాలో 2కోట్ల ఎలక్ట్రిక్​ వాహనాలు’
‘2030 నాటికి.. ఇండియాలో 2కోట్ల ఎలక్ట్రిక్​ వాహనాలు’ (HT_PRINT)

Electric vehicles in India : దేశంలో ఎలక్ట్రిక్​ వాహనాలకు విపరీతమైన డిమాండ్​ కనిపిస్తోంది. ముఖ్యంగా గత రెండేళ్లల్లో ఈవీలను కొనుగోలు చేసే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్​ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. 2030 నాటికి దేశంలో 2కోట్లకుపైగా ఎలక్ట్రిక్​ వెహికిల్స్​ రోడ్ల మీద తిరుగుతాయని అన్నారు. ఫలితంగా కాలుష్యం తగ్గుతుందని, ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయని స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

ఈవీలతో వృద్ధి..

ఎలక్ట్రిక్​ మొబిలిటీ అండ్​ ఫ్యూటర్​ మొబిలిటీ థీమ్​తో జరిగిన ఓ ఈవెంట్​లో ఇటీవలే పాల్గొన్నారు నితిన్​ గడ్కరీ. ఈ క్రమంలోనే దేశంలోని ఈవీ సెగ్మెంట్​ వృద్ధిపై మాట్లాడారు.

India Electric vehicles : "2030 నాటికి 2 కోట్లకుపైగా ఈవీలు ఇండియాలో తిరుగుతాయి. కాలుష్యం తగ్గడంతో పాటు ఉద్యగాలు పెరుగుతాయి. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ మరింత వృద్ధిచెందుతుంది. దేశం ఆత్మనిర్భరంగా మారుతుంది," అని నితిన్​ గడ్కరీ వ్యాఖ్యానించారు.

Electric car charging costs : మీ ఈవీ ఛార్జింగ్​ ఖర్చులను  ఎలా తగ్గించుకోవాలో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

సాధారణంగా.. పొల్యూషన్​లో శబ్ధ కాలుష్యం, వాయు కాలుష్యం, నీటి కాలుష్యం ఉంటాయి. కాలుష్యంలో 40శాతం వాటా రవాణా రంగానిదని తెలిపారు కేంద్రమంత్రి. దానిని తగ్గించేందుకు కృషిచేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్​ బస్సులను పెంచాలని చూస్తున్నట్టు వెల్లడించారు.

Electric vehicles growth in India : "ఇంధన దిగుమతి ఇండియాకు పెద్ద సవాలే. దేశ ఆర్థిక వ్యవస్థలోని రూ. 16లక్షల కోట్లు.. పెట్రోల్​, డీజిల్​ కొనుగోలుకే విదేశాలకు వెళతాయి. ఇంధన అవసరాల్లో 80శాతం దిగుమతే చేసుకుంటుంది ఇండియా. ఫలితంగా విదేశీ మారక నిల్వల్లో ఎక్కువ మొత్తాన్ని ఉపయోగించుకోవాల్సి వస్తోంది. ఎలక్ట్రిక్​ వాహనాల సంఖ్య పెరిగితే.. ఇది దిగొస్తుంది," అని నితిన్​ గడ్కరీ పేర్కొన్నారు.

ఈవీలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాలు విధానాలు రూపొందించాలని అభిప్రాయపడ్డారు కేంద్రమంత్రి. దీని ద్వారా కూడా ఉద్యోగ అవకాశాలు సృష్టించుకోవచ్చని సూచించారు.

ఇప్పటికే 20లక్షల వాహనాలు..

ఎలక్ట్రిక్​ వాహనాలపై భారతీయుల ఆసక్తి ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగింది. ఆటో సంస్థల మధ్య నెలకొన్న పోటీతో ధరలు దిగొస్తుండటం కూడా ప్లస్​ పాయింట్​గా నిలుస్తోంది. 2021తో పోల్చుకుంటే 2022లో ఈవీ సెగ్మెంట్​ 200శాతం వృద్ధిని సాధించింది! దేశంలో ఈవీ సేల్స్​ 20లక్షల మైలురాయిని దాటినట్టు కేంద్ర విద్యుత్​శాఖ వెల్లడించింది. కేవలం 6ఏళ్లల్లోనే ఈ మైలురాయిని అందుకోవడం విశేషం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

WhatsApp channel