Moody's cuts India's growth forecast: భారత వృద్ధిరేటు అంచనాను తగ్గించిన మూడీస్-moodys cuts india s growth forecast to 7 for 2022 from 77 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Moody's Cuts India's Growth Forecast To 7% For 2022 From 7.7%

Moody's cuts India's growth forecast: భారత వృద్ధిరేటు అంచనాను తగ్గించిన మూడీస్

HT Telugu Desk HT Telugu
Nov 11, 2022 07:49 PM IST

Moody's cuts India's growth projection: అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ భారత వృద్ధిరేటు అంచనాను మరోసారి తగ్గించింది. 2022 ఆర్థిక సంవత్సరం భారత జీడీపీ వృద్ధిరేటు అంచనాను మూడీస్ శుక్రవారం 7 శాతానికి తగ్గించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Moody's cuts India's growth forecast: భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాను మూడీస్ తగ్గించడం గత రెండు నెలల కాలంలో ఇది రెండో సారి. ఈ సెప్టెంబర్ నెలలో వృద్ధి రేటు అంచనాను 8.8% నుంచి 7.7 శాతానికి తగ్గించింది. తాజాగా, శుక్రవారం భారత ఆర్థిక వృద్ధి రేటును 7.7% నుంచి 7 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు

Moody's cuts India's growth forecast: ఇవే కారణాలు.

భారత వృద్ధిరేటును తగ్గించడానికి కారణాలను మూడీస్ ఇలా వివరించింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లు, అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం.. తదితర కారణాల వల్ల వృద్ధిరేటును తగ్గించాల్సి వచ్చిందని వివరించింది. ద్రవ్య విధానాల విషయంలో కఠిన నిర్ణయాలు, రుతుపవన వర్షపాతంలో అసమానతలు తదితర కారణాలు కూడా ఇందుకు కారణమని పేర్కొంది.

Moody's cuts India's growth forecast: ఆర్బీఐ నిర్ణయాలు..

పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో రెపో రేటును కనీసం మరో 50 బేసిస్ పాయింట్ల మేరకు తగ్గించాలని యోచిస్తోంది. 2023 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాను కూడా మూడీస్ తగ్గించింది. గతంలో అంచనా వేసినట్లు 5.2 % కాకుండా వృద్ధిరేటు 4.8% గానే ఉండబోతున్నట్లు వెల్లడించింది. 2024 సంవత్సరంలో మాత్రం ఆర్థిక వ్యవస్థ పుంజుకుని వృద్ధిరేటు 6.4% వరకు చేరవచ్చని అంచనా వేసింది.

Moody's cuts India's growth forecast: తగ్గుతున్న రూపాయి విలువ

రూపాయి విలువ తగ్గుతుండడం, క్రూడాయిల్ ధరల్లో పెరుగుదల ద్రవ్యోల్బణం పెరగడానికి కారణమవుతున్నాయి. భారత్ లో ద్రవ్యోల్బణానికి సంబంధించి ఆర్బీఐ లక్ష్యం 2% నుంచి 6% కాగా, ఆ పరిధిలో ఈ సంవత్సరం ద్రవ్యోల్బణం ఎప్పుడూ లేదు. ఒక్క భారత్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఇవే పరిస్థితులు నెలకొని ఉన్నాయని మూడీస్ వివరించింది. ఈ సంవత్సరం మే నుంచి సెప్టెంబర్ మధ్య ఆర్బీఐ రెపొ రేటును పలు దఫాలుగా 190 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది.

WhatsApp channel