మోంట్రా ఎలక్ట్రిక్ నుంచి రెండు కొత్త ఈవీలు.. ఇ-ఎస్‌సీవీ, ఎలక్ట్రిక్ 3 డబ్ల్యూ సూపర్ కార్గో
Commercial EVs : మోంట్రా ఎలక్ట్రిక్ తమ e-SCV, ఎలక్ట్రిక్ 3W సూపర్ కార్గోను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ మేరకు భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో తీసుకురానుంది.
సుమారు 125 ఏళ్ల చరిత్ర కలిగిన మురుగప్ప గ్రూప్‌లో భాగమైన మోంట్రా ఎలక్ట్రిక్ కొత్త కార్గో వాహనాలను తీసుకురానుంది. రాబోయే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో తమ e-SCV, ఎలక్ట్రిక్ 3W సూపర్ కార్గో వాహనాలను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. చెన్నైలోని అత్యాధునిక పొన్నేరి ప్లాంట్‌లో విస్తృత పరిశోధన, పరీక్షల తర్వాత e-SCV అభివృద్ధి చేశారు. ఈ వాహనం లాంచ్ అయిన తర్వాత భారతదేశంలోని మిడ్-మైల్, లాస్ట్-మైల్ మొబిలిటీ రంగాలలో గణనీయమైన మార్పును కలిగిస్తుందని కంపెనీ నమ్మకంగా ఉంది.
ఎలక్ట్రిక్ స్మాల్ కమర్షియల్ వెహికల్స్(eSCV), ఎలక్ట్రిక్ 3W సూపర్ కార్గో అధికారిక ప్రారంభం జనవరి 17, 2025న జరిగే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఉండనుంది. వాహనం ప్రత్యేకమైన డిజైన్, బలమైన పనితీరు, నాణ్యత కస్టమర్లను ఆకర్షిస్తుందని మోంట్రా నమ్మకంతో ఉంది.
ఎప్పటి నుంచో చాలా మంది ఎదురు చూస్తున్న మోంట్రా ఎలక్ట్రిక్ 3W సూపర్ కార్గో వాహనాన్ని కస్టమర్లకు నచ్చే విధంగా రూపొందించినట్టుగా కంపెనీ చెబుతోంది. దీని ద్వారా ఫ్లీట్ వ్యాపారాలు, వ్యక్తిగత మార్కెట్ లోడ్ ఆపరేటర్‌లకు ఖర్చు కలిసి రానుంది.
తమ కంపెనీకి చెందిన 8000 కంటే ఎక్కువ వాహనాలు రోడ్డుపై ఉన్నాయని మోంట్రా తెలిపింది. 85 షోరూమ్‌లు ఇప్పటికే ప్రారంభించామని, దీని ద్వారా పాన్ ఇండియా స్థాయిలో కంపెనీకి పేరు వచ్చిందని పేర్కొంది. అర్బన్ మొబిలిటీని విప్లవాత్మకంగా మార్చే ప్రధాన దృష్టితో మోంట్రా ఎలక్ట్రిక్ వినూత్నమైన, స్థిరమైన రవాణా పరిష్కారాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. సమర్థవంతమైన వాహనాల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను పరిష్కరిస్తామని, అదే సమయంలో కస్టమర్‌కు ప్రయోజనం ఉండేలా చూస్తామని కంపెనీ తెలిపింది.
125 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న మురుగప్ప గ్రూప్‌కు చెందిన ఈవీ బ్రాండ్ మోంట్రా ఎలక్ట్రిక్. రాబోయే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో తమ e-SCV, ఎలక్ట్రిక్ 3W సూపర్ కార్గోను ప్రారంభించేందు సిద్ధంగా ఉంది. ఈ వాహనాలు కస్టమర్లకు నచ్చేలా డిజైన్ చేసినట్టుగా కంపెనీ చెబుతోంది.