Flipkart sale on smartphones : రూ. 30వేల స్మార్ట్​ఫోన్స్​పై అదిరిపోయే ఆఫర్లు!-mobile phones bonanza on flipkart best deals on smartphones under 30000 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Mobile Phones Bonanza On Flipkart: Best Deals On Smartphones Under 30,000

Flipkart sale on smartphones : రూ. 30వేల స్మార్ట్​ఫోన్స్​పై అదిరిపోయే ఆఫర్లు!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 12, 2022 10:49 AM IST

Flipkart sale on smartphones : స్మార్ట్​ఫోన్​లపై అదిరిపోయే ఆఫర్లతో మరోమారు మన ముందుకు వచ్చేసింది ఫ్లిప్​కార్ట్​. ఆ వివరాలు ఇక్కడ చూసేయండి.

 రూ. 30వేల స్మార్ట్​ఫోన్స్​పై అదిరిపోయే ఆఫర్లు!
రూ. 30వేల స్మార్ట్​ఫోన్స్​పై అదిరిపోయే ఆఫర్లు!

Discounts on smartphones in Flipkart : "పండుగ సీజన్​తో పాటు స్మార్ట్​ఫోన్​లపై ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా అయిపోయాయి.." అని మీరు అనుకుంటున్నారా? కొత్త స్మార్ట్​ఫోన్​ కొనుగోలు చేయాలని మీరు చూస్తున్నారా? అయితే.. మీకోసం అదిరిపోయే ఆఫర్లతో మరోమారు వచ్చేసింది ఫ్లిప్​కార్ట్​. వివిధ స్మార్ట్​ఫోన్​లపై మంచి డిస్కౌంట్లు ఇస్తోంది. ఫలితంగా కొన్ని మంచి స్పెసిఫికేషన్లు ఉన్న స్మార్ట్​ఫోన్​లు రూ.30వేల కన్నా తక్కువకే లభిస్తున్నాయి. వాటిపై మీరూ ఓ లుక్కేయండి...

ట్రెండింగ్ వార్తలు

షియోమీ 11ఐ హైపర్​ఛార్జ్​ 5జీ..

Xiaomi 11i Hypercharge 5G price : ఇది ఫ్లిప్​కార్ట్​లో ప్రస్తుతం రూ. 25,999గా ఉంది. కొన్ని బ్యాంకుల క్రెడిట్​, డెబిట్​ కార్డ్​లతో రూ. 2000 తగ్గుతుంది. ఈ స్మార్ట్​ఫోన్​లో మీడియాటెక్​ డైమెన్సిటీ 920 ప్రాసెసర్​ ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4,500 ఎంఏహెచ్​. ఈ డివైజ్​లో 108ఎంపీ ప్రైమరీ కెమెరా, 16ఎంపీ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి.

వివో వీ25 5జీ..

Discount on Vivo V25 5G in Flipkart : ఇది ఫ్లిప్​కార్ట్​లో రూ. 27,999గా ఉంది. ఫ్లిప్​కార్ట్​ యాక్సిస్​ బ్యాంక్​ కార్డ్​పై 5శాతం క్యాష్​బ్యాక్​ లభిస్తోంది. అంతేకాకుండా.. కొన్ని బ్యాంక్​ల క్రెడిట్​, డెబిట్​ కార్డులపై ఆఫర్లు కూడా ఉన్నాయి. నెలకు రూ. 4,667తో నో కాస్ట్​ ఈఎంఐ కూడా లభిస్తోంది.

ఒప్పో ఎఫ్​21 ప్రో 5జీ..

Oppo F21 Pro 5G : ఈ స్మార్ట్​ఫోన్​ ఒరిజినల్​ ధరపై 18శాతం డిస్కౌంట్​ లభిస్తోంది. ఫలితంగా ఇది రూ. 25,999కే అందుబాటులోకి వచ్చింది. ఇందులో 6.43 ఇంచ్​ డిస్​ప్లే, 2400X1080 పిక్సెల్​ రిజొల్యూషన్​ ఉంది. 64ఎంపీ మెయిన్​ కెమెరా, 2ఎంపీ+ 2ఎంపీ మాక్రో కెమెరా దీని సొంతం. కాస్మిక్​ బ్లాక్​, రెయిన్​బో స్పెక్ట్రం వంటి రెండు రంగుల్లో ఈ స్మార్ట్​ఫోన్​ అందుబాటులో ఉంది.

రియల్​మీ జీటీ నియో 3టీ..

Realme GT Neo 3T price: ఫ్లిప్​కార్ట్​లో ఈ స్మార్ట్​ఫోన్​ రూ. 24,999కే లభిస్తోంది. ఇందులో క్వాల్కం స్నాప్​డ్రాగన్​ 870 ప్రాసెసర్​ ఉంటుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000ఎంఏహెచ్​, ఇందులో 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది.

మోటోరోలా ఎడ్జ్​ 30..

Offers on Motorola Edge 30 in Flipkart : మొటోరోలా ఎడ్జ్​ 30.. ఫ్లిప్​కార్ట్​లో 26,999కి అందుబాటులో ఉంది. మెటియర్​ గ్రే, ఆరోరా గ్రీన్​ రంగుల్లో ఇది వస్తోంది. క్వాల్కం స్నాప్​డ్రాగన్​ 778జీ ఆక్టో కోర్​ ప్రాసెసర్​ ఇందులో ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4,020ఎంఏహెచ్​.

ఇక ఆలస్యం ఎందుకు? మీకు నచ్చిన ఫోన్​ను వెంటనే కొనేయండి!

WhatsApp channel

సంబంధిత కథనం