MIUI 14: ఈ షావోమీ, రెడ్‍మీ మొబైళ్లు వాడుతున్న వారికి గుడ్‍న్యూస్.. ఎంఐయూఐ 14 అప్‍డేట్ ఎప్పుడొస్తుందంటే!
MIUI 14 Update: ఎంఐయూఐ 14 రోల్అవుట్ టైమ్‍లైన్‍ను షావోమీ ప్రకటించింది. మూడు క్వార్టర్‌లలో ఈ అప్‍డేట్‍ను అందుకోనున్న షావోమీ, రెడ్‍మీ మొబైళ్ల లిస్టులను వెల్లడించింది.
MIUI 14 Update: లేటెస్ట్ వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎంఐయూఐ 14 (MIUI) గ్లోబల్ రిలీజ్‍ను షావోమీ ప్రకటించింది. రానున్న వారాల్లో ఎంపిక చేసిన షావోమీ, రెడ్‍మీ స్మార్ట్ ఫోన్‍లకు ఈ ఎంఐయూఐ 14 ఓఎస్ అప్‍డేట్‍లను రోల్అవుట్ చేయనుంది. ఎంఐయూఐ 14 ఇంటర్ఫేస్‍లో కీలక మార్పులు చేసింది షావోమీ. మినిమలిస్ట్ లేఅవుట్లను పొందుపరిచింది. కొత్త విజువల్ స్టైల్స్, సిస్టమ్ యాప్స్ డిజైన్‍లో మార్పు ఉంటుంది. ఎంఐయూఐ 14లో సూపర్ ఐకాన్స్, కొత్త పర్సనలైజ్డ్ వాల్‍పేపర్స్, కొత్త డిజైన్‍తో హోమ్ స్క్రీన్ విడ్జెట్స్ ఉంటాయి. అలాగే ఎంఐయూఐ 14లో కొన్ని కొత్త ఫీచర్లు, డిజైన్ మార్పులు ఉంటాయి. బార్సిలోనా వేదికగా జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023 (MCW 2023)లో ఈ ఎంఐయూఐ 14ను షావోమీ ప్రకటించింది. అలాగే ఇండియాలో ఏ డివైజ్‍లకు ఎప్పుడు ఈ ఎంఐయూఐ 14 రోల్అవుట్‍ను ఇవ్వనున్నది టైమ్‍లైన్‍ను షావోమీ వెల్లడించింది. ఆ వివరాలివే..
ట్రెండింగ్ వార్తలు
ఎంఐయూఐ 14 అప్‍డేట్‍ను 2023 తొలి క్వార్టర్ (మూడు నెలలు)లో అందుకునే ఫోన్లు
MIUI 14 Update: షావోమీ 12 ప్రో, షావోమీ 13 ప్రో, ఎంఐ 11 అల్ట్రా, ఎంఐ 11ఎక్స్ ప్రో 5జీ, ఎంఐ11టీ ప్రో, రెడ్‍మీ నోట్ 12 ప్రో+ 5జీ, ఎంఐ 11ఎక్స్, రెడ్‍మీ నోట్ 12 ప్రో 5జీ, రెడ్‍మీ కే50ఐ 5జీ, షావోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ, రెడ్‍మీ 11 ప్రైమ్ 5జీ
2023 రెండో క్వార్టర్‌లో..
MIUI 14 Update: షావోమీ 11ఐ, షావోమీ 11ఐ హైపర్ చార్జ్, ఎంఐ 10ఐ, ఎంఐ 10, రెడ్‍మీ నోట్ 10 ప్రో మ్యాక్స్, రెడ్‍మీ నోట్ 11 ప్రో, రెడ్‍మీ నోట్ 10టీ 5జీ, రెడ్‍మీ నోట్ 10ఎస్, రెడ్‍మీ నోట్ 10 5జీ, రెడ్‍మీ 9 పవర్
2023 మూడో క్వార్టర్‌లో..
MIUI 14 Update: ఎంఐ 10టీ, ఎంఐ 10టీ ప్రో, రెడ్‍మీ నోట్ 11 ప్రో 5జీ, రెడ్‍మీ నోట్ 12 5జీ, రెడ్‍మీ నోట్ 11ఎస్, రెడ్‍మీ నోట్ 11టీ 5జీ, రెడ్‍మీ 10 ప్రైమ్ 2022, రెడ్‍మీ 10 ప్రైమ్, రెడ్‍మీ నోట్ 11, రెడ్‍మీ 10
MIUI 14 Update: సపోర్ట్ చేసే మరిన్ని షావోమీ, రెడ్‍మీ డివైజ్‍లకు ఎంఐయూఐ 14 అప్‍డేట్ తర్వాత రోల్అవుట్ అవుతుంది. టైమ్‍లైన్‍లోనూ కొన్ని మార్పులు ఉండొచ్చు.
ఇండియాలో ఇటీవలే షావోమీ 13 ప్రో 5జీ లాంచ్ అయింది. స్నాప్‍డ్రాగన్ 8 జెన్ 2 సహా ప్రీమియమ్ ఫ్లాగ్‍షిప్ లైకా కెమెరాతో ఈ మొబైల్ వచ్చింది. అలాగే అన్ని విభాగాల్లోనూ ఇది ఫ్లాగ్‍షిప్ ఫోన్‍గా ఉంది.
సంబంధిత కథనం