టామ్​ క్రూజ్​ నెట్ ​వర్త్​ చూస్తే ‘ఇంపాజిబుల్​’ అనాల్సిందే! కళ్లు చెదిరే విధంగా సంపద..-mission impossible final reckoning actor tom cruise net worth revealed ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  టామ్​ క్రూజ్​ నెట్ ​వర్త్​ చూస్తే ‘ఇంపాజిబుల్​’ అనాల్సిందే! కళ్లు చెదిరే విధంగా సంపద..

టామ్​ క్రూజ్​ నెట్ ​వర్త్​ చూస్తే ‘ఇంపాజిబుల్​’ అనాల్సిందే! కళ్లు చెదిరే విధంగా సంపద..

Sharath Chitturi HT Telugu

మిషన్​ ఇంపాజిబుల్​ ఫైనల్​ రెకనింగ్​తో మరోసారి అభిమానులను అలరించారు హాలీవుడ్​ స్టార్​ టామ్​ క్రూజ్​. మరి టామ్​ క్రూజ్​ నెట్​ వర్త్​ ఎంతో మీకు తెలుసా?

టామ్​ క్రూజ్​.. (REUTERS)

హాలీవుడ్​ లెజెండరీ యాక్టర్స్​లో టామ్​ క్రూజ్​ ఒకరు. ఆయన నటించిన మిషన్​ ఇంపాజిబుల్​- ది ఫైనల్​ రెకనింగ్​ సినిమా తాజాగా విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మిషన్​ ఇంపాజిబుల్​ ఫ్రాంచైజ్​కి భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. టామ్​ క్రూజ్​ యాక్టింగ్​కి భారీ ఫ్యాన్​ ఫాలోయింగ్​ ఉంది. అయితే, చాలా మందికి తమ అభిమాన నటుడి సంపద ఎంత? అని తెలుసుకోవాలని ఉంటుంది. ఈ నేపథ్యంలో 62ఏళ్ల టామ్​ క్రూజ్​ నెట్​ వర్త్​కి సంబంధించిన వివరాలను ఇక్కడ చూసేయండి..

టామ్​ క్రూజ్​ నెట్​ వర్త్​..

పరేడ్​ మ్యాగజైన్​ ప్రకారం.. హాలీవుడ్​ నటుడు టామ్​ క్రూజ్​ నెట్​ వర్త్​ 600 మిలియన్​ డాలర్లు. అంటే అది రూ. 51,36,03,90,000! సినిమాలు, ఇన్వెస్ట్​మెంట్స్​ రూపంలో ఈ స్థాయిలో సంపదను వెనకేసుకున్నారు ఈ మిషన్​ ఇంపాజిబుల్​ యాక్టర్​.

ఫిల్మ్​ ఇండస్ట్రీలో టామ్​ క్రూజ్​ అడుగుపెట్టినప్పుడు తొలుత ఆయనకు 50,000 డాలర్ల నుంచి 5,00,000 డాలర్ల వరకు వేతనం అందేది. కాగా 1986లో వచ్చిన టాప్​ గన్​ సినిమాతో టామ్​ క్రూజ్​ దశ తిరిగిపోయింది. ఆ ఒక్క సినిమా నుంచి టామ్​ క్రూజ్​ 2 మిలియన్​ సంపాదించారు. టాప్​ గన్​కి సీక్వెన్స్​గా 2022 వచ్చిన టాప్​ గమ్​ మేవరిక్​ కోసం ఆయన 12-14 మిలియన్​ డాలర్లు తీసుకున్నట్టు సమాచారం. సినిమా ప్రాఫిట్స్​లో కూడా ఆయన వాటా ఉన్నట్టు తెలుస్తోంది.

సాధారణంగా యాక్టర్​గా క్లిక్​ అయితే చాలా మందికి బ్రాండ్​ ఎండోర్స్​మెంట్​ పోర్ట్​ఫోలియో చాలా పెద్దగా ఉంటుంది. కానీ అతి తక్కువ బ్రాండ్​ ఎండోర్స్​మెంట్స్​ ఉన్న వారిలో టామ్​ క్రూజ్​ ఒకరు. అయినప్పటికీ, బ్రాండ్స్​ నుంచి తన కెరీర్​ మొత్తం మీద 100 మిలియన్​ డాలర్లకు పైగా టామ్​ క్రూజ్​ సంపాదించినట్టు తెలుస్తోంది.

ఇక టామ్​ క్రూజ్​ ఇన్వెస్ట్​మెంట్స్​ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఆయనకు సొంతంగా ప్రొడక్షన్​ కంపెనీ ఉంది. రికార్డింగ్​ స్టూడియోలో 30శాతం వాటా ఉంది. అనేక వెంచర్లలో ఆయనకు పెట్టుబడులు కూడా ఉన్నాయి.

మిషన్​ ఇంపాజిబుల్​ ఫైనల్​ రెకనింగ్​ లీడ్​ యాక్టర్​ టామ్​ క్రూజ్​ రియల్​ ఎస్టేట్​ పోర్ట్​ఫోలియో హైలైట్​! ఇప్పటికే చాలా ప్రాపర్టీలను కొని, మంచి లాభాలకు విక్రయించారు. 2007లో టామ్​ క్రూజ్​ బెవెర్లీ హిల్స్​లో నివాసం కొన్నారు. ప్రస్తుతం అందులోనే ఉంటున్నారు. కొలరాడోలోని తన 10,000 స్క్వేర్​ఫీట్​ మాన్షన్​ని 2021లో 40 మిలియన్​ డాలర్లకు విక్రయించారు హాలీవుడ్​ స్టార్​. 2015లో లండన్​కి సమీపంలోని తన 14 ఎకరా రియల్​ ఎస్టేట్​ భూమిని 7.3 మిలియన్​కి విక్రయించారు. ఆ తర్వాత హాలీవుడ్​లో 12 మిలియన్​ డాలర్లు పెట్టి రెసిడెన్స్​ కొన్నారు.

ప్రపంచ సంపన్న యాక్టర్స్​ లిస్ట్​లో టామ్​ క్రూజ్​ ప్రస్తుతం 3వ స్థానంలో ఉన్నారు. ఆర్నల్డ్​ స్క్వార్జెనెగర్, డ్వైన్​ జాన్స్​లు ముందు ఉన్నారు. బాలీవుడ్​ బాద్​షా షారుఖ్​ ఖాన్​ 4వ స్థానంలో ఉన్నారు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం