Electric car : సింగిల్​ ఛార్జ్​తో 460 కి.మీ రేంజ్​- ఈ బెస్ట్​ సెల్లింగ్​ ఎలక్ట్రిక్​ కారు ధర పెరిగింది!-mg zs ev price hike check out this electric cars variant cost data ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Electric Car : సింగిల్​ ఛార్జ్​తో 460 కి.మీ రేంజ్​- ఈ బెస్ట్​ సెల్లింగ్​ ఎలక్ట్రిక్​ కారు ధర పెరిగింది!

Electric car : సింగిల్​ ఛార్జ్​తో 460 కి.మీ రేంజ్​- ఈ బెస్ట్​ సెల్లింగ్​ ఎలక్ట్రిక్​ కారు ధర పెరిగింది!

Sharath Chitturi HT Telugu
Feb 02, 2025 09:00 AM IST

MG ZS EV price hike : ఇండియాలో టాప్​ ఎలక్ట్రిక్​ కార్లలో ఒకటైన జెడ్​ఎస్​ ఈవీ ధరలను జేఎస్​డబ్ల్యూ ఎంజీ మోటార్​ సంస్థ భారీగా పెంచేసింది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఎంజీ జెడ్​ఎస్​ ఈవీ ధర పెంపు..
ఎంజీ జెడ్​ఎస్​ ఈవీ ధర పెంపు..

ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఎలక్ట్రిక్​ కార్స్​లో ఒకటి.. ఎంజీ జెడ్​ఎస్​ ఈవీ! ఇప్పుడు ఈ ఈవీ ధరను పెంచుతున్నట్టు జేఎస్​డబ్ల్యూ ఎంజీ మోటార్​ ప్రకటించింది. ఈ పెంపు, ఇప్పటికే అమల్లోకి వచ్చింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్​యూవీ.. వేరియంట్ ఆధారంగా రూ.89,000 వరకు పెరిగింది! ఈ నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్​ వెహికిల్​ ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ చూసేయండి..

yearly horoscope entry point

ఎంజీ జెడ్ఎస్ ఈవీ: ఏ వేరియంట్ ధర ఎంత పెరిగింది?

ఇన్​పుట్​ కాస్ట్​ పేరుతో గత రెండు నెలలుగా దేశంలోని దాదాపు అన్ని ఆటోమొబైల్​ సంస్థలు తమ వాహనాల ధరలను పెంచుతున్నాయి. ఇందులో భాగంగానే జెడ్​ఎస్​డబ్ల్యూ ఎంజీ మోటార్​ కూడా ఇప్పుడు ఎంజీ జెడ్​ఎస్​ ఈవీ ధరలను పెంచేసింది.

ఎంజీ జెడ్ఎస్ ఈవీ టాప్-స్పెక్ ఎసెన్స్ డ్యూయెల్ టోన్ ఐకానిక్ ఐవరీ, ఎసెన్స్ డార్క్ గ్రే వేరియంట్లు అత్యధికంగా రూ.89,000 ధర పెరిగాయి. దీని తరువాత ఎక్స్​క్లూజివ్ ప్లస్ డార్క్ గ్రే వేరియంట్ ప్రస్తుత ధర కంటే రూ .61,800 ప్రీమియంతో వస్తోంది. హ్యుందాయ్ క్రెటా ఈవీకి పోటీగా ఉన్న ఎంజీ జెడ్ఎస్ ఈవీ ఎక్స్​క్లూజివ్ ప్లస్ డ్యూయల్ టోన్ ఐకానిక్ ఐవరీ, 100 ఇయర్స్ ఎడిషన్ వేరియంట్ల ధర రూ.61,000 పెరిగింది.

ఎలక్ట్రిక్ ఎస్​యూవీ ఎక్సైట్ ప్రో వేరియంట్ ధర రూ.49,800 పెరిగింది. అయితే ఎంట్రీ లెవల్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు! ఈ ధరల పెంపుతో ఎంజీ జెడ్ఎస్ ఈవీ శ్రేణి ఇప్పుడు రూ .18.98 లక్షల నుంచి రూ .26.64 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి.

ఎంజీ జెడ్ఎస్ ఈవీ: రేంజ్​..

ఎంజీ జెడ్ఎస్ ఈవీకి శక్తినిచ్చేది 50.3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్. ఇది సింగిల్ ఎలక్ట్రిక్ మోటారుతో కనెక్ట్​ చేసి ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 174బీహెచ్​పీ పవర్, 280ఎన్ఎమ్ పీక్​ టార్క్​ను జనరేట్​ చేస్తుంది. జెడ్ఎస్ ఈవీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 461 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కార్ల తయారీ సంస్థ పేర్కొంది.

ఎంజీ లైనప్​ సూపర్​..!

ఇండియాలో, ఎంజీ మోటార్​ ఎలక్ట్రిక్​ వాహనాల లైనప్​లో జెడ్​ఎస్​ ఈవీ అగ్రస్థానంలో ఉంది. ఇందులో ఏడు విభిన్న వేరియంట్లు ఉన్నాయి.

ఎంజీ కామెట్ ఈవీ, ఎంజీ విండ్సర్ ఈవీ వంటి మోడళ్లు కూడా ఈ శ్రేణిలో ఉన్నాయి. దేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారుగా కామెట్ ఈవీని భారతదేశంలో విడుదల చేశారు. ఏదేమైనా, భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్​పో2025 లో రూ .3.25 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో వైవే ఈవా ఎలక్ట్రిక్ కారును విడుదల చేయడంతో.. కామెట్ ఈవీ ఇప్పుడు భారతదేశంలో రెండొవ అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారుగా మారింది.

Whats_app_banner

సంబంధిత కథనం