జెఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ భారతదేశంలో ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ మైలురాయిని సెలబ్రేట్ చేసుకునేందుకు వాహన తయారీదారు జెడ్ఎస్ ఈవీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి చెందిన అన్ని వేరియంట్లపై భారీగా ప్రైజ్ కట్ని ప్రకటించింది. 2025 ఎంజీ జెడ్ఎస్ ఈవీ ధర ఇప్పుడు రూ .4.44 లక్షల వరకు తగ్గింది. ప్రైజ్ కట్ అనంతరం జెడ్ఎస్ ఈవీ ధరలు ఇప్పుడు రూ. 16.75 లక్షల నుంచి ప్రారంభమై రూ .20.50 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. ఈ ధర తగ్గింపు టాటా కర్వ్ ఈవీ, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, మహీంద్రా బీఈ 6, ఎంజీ విండ్సర్ ప్రో (ఫిక్స్డ్ బ్యాటరీ ఆప్షన్) ను కూడా వెనక్కి నెట్టి జెడ్ఎస్ ఈవిని మరింత చౌకగా చేస్తుంది!
ఎంజీ జెడ్ఎస్ ఈవీ వేరియంట్లు | కొత్త ధరలు (ఎక్స్‌షోరూం) | పాత ధరలు (ఎక్స్‌షోరూం) | వ్యత్యాసం |
---|---|---|---|
ఎగ్జిక్యూటివ్ | ₹16,75,000 | ₹16,88,000 | ₹13,000 |
ఎక్సైట్ ప్రో | ₹18,49,800 | ₹18,97,800 | ₹48,000 |
ఎక్స్‌క్లూజివ్ ప్లస్ | ₹19,49,800 | ₹23,64,800 | ₹4,15,000 |
ఎస్సెన్స్ | ₹20,49,800 | ₹24,93,800 | ₹4,44,000 |
ధరల తగ్గింపు గురించి జెఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా సేల్స్ హెడ్ రాకేష్ సేన్ మాట్లాడుతూ.. “గత ఆరేళ్లుగా డైనమిక్ ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో గ్రోత్ స్టోరీని రూపొందించడంలో మాకు సహాయపడిన మా కస్టమర్లు, ఇతర సంబంధిత వాటాదారులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను. కంపెనీ పునాది ఆవిష్కరణపై ఆధారపడి ఉంది. జెడ్ఎస్ ఈవీ 2020లో ఎంజీ బ్రాండ్ నిజంగా ఏమి చేయగలదో నిజమైన సాక్ష్యంగా నిలుస్తుంది. సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే ఆవిష్కరణలను చేర్చడం ద్వారా సాంప్రదాయ మొబిలిటీని పునర్నిర్వచించిన కారు ఇది. భారతదేశంలో మా ఆరొవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని.. స్టైలిష్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి అప్ గ్రేడ్ కావాలనుకునే వినియోగదారులకు ఎంజీ జెడ్ఎస్ ఈవీని మరింత అందుబాటులోకి తీసుకువచ్చాము. మా ఇతర రెండు ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పటికే అందుబాటు ధర వద్ద ఉన్నాయి. ఈ ప్రత్యేక ధరతో, జెడ్ఎస్ ఈవీ ప్రీమియం రైడ్ కోరుకునే వినియోగదారులను కూడా ఆకర్షిస్తుంది. ఆకర్షణీయమైన మొత్తం ప్యాకేజింగ్, ధరతో.. ఎంజీ జెడ్ఎస్ ఈవీ ఖచ్చితంగా భారతీయ కొనుగోలుదారులను ఆకర్షిస్తుందని మేము నమ్ముతున్నాము,” అని అన్నారు.
ఎంజీ జెడ్ఎస్ ఈవీలోని 50.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 461 కి.మీ వరకు రేంజ్‌ని ఇస్తుంది.
కాగా ధర తగ్గింపుతో జెడ్ఎస్ ఈవీ కొనుగోలుదారులకు మరింత ఆకర్షణీయంగా మారుతుంది. రాబోయే వారాల్లో దాని అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది.
ఎంజీ జెడ్ఎస్ ఈవీ భారతదేశంలో బ్రాండ్ నుంచి వచ్చిన రెండవ ఆఫర్. గత ఆరు నెలల్లో సగటున 600 యూనిట్లను విక్రయిస్తోంది. ముఖ్యంగా, ఎంజీ మరొక ఎలక్ట్రిక్ ఆఫర్, విండ్సర్ ఈవీ, మార్కెట్లో ఇతర ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను మాత్రమే కాకుండా జెడ్ఎస్ ఈవీ అమ్మకాలను కూడా లాగేసుకుందని చెప్పుకోవాలి! గత ఆరు నెలల్లో ఎంజీ విండ్సర్ ఈవీ సగటున 3,450 యూనిట్లను విక్రయించింది. గత సంవత్సరం సెప్టెంబర్‌లో లాంచ్ చేసినప్పటి నుంచి ఈ మోడల్ 27,000 యూనిట్లకు పైగా సేల్ అయింది.
సంబంధిత కథనం