ఎంజీ విండ్సర్​ ఈవీ ప్రో లాంచ్​- సింగిల్​ ఛార్జ్​తో 449 కి.మీ రేంజ్​! ధర ఎంతంటే..-mg windsor pro launched with more range advanced tech check price and other details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఎంజీ విండ్సర్​ ఈవీ ప్రో లాంచ్​- సింగిల్​ ఛార్జ్​తో 449 కి.మీ రేంజ్​! ధర ఎంతంటే..

ఎంజీ విండ్సర్​ ఈవీ ప్రో లాంచ్​- సింగిల్​ ఛార్జ్​తో 449 కి.మీ రేంజ్​! ధర ఎంతంటే..

Sharath Chitturi HT Telugu

ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో తాజాగా లాంచ్​ అయ్యింది. ఇందులో 52.9 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 449 కిలోమీటర్ల వరకు రేంజ్​ని ఇస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఎంజీ విండ్సర్​ ఈవీ ప్రో

ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఎలక్ట్రిక్​ కారుగా ఉన్న ఎంజ విండ్సర్​ ఈవీలో కొత్త వేరియంట్​ని లాంచ్​ చేసింది జేఎస్​డబ్ల్యూ ఎంజీ మోటార్​. దీని పేరు ఎంజీ విండ్సర్​ ఈవీ ప్రో. మరిన్ని ఫీచర్లు, అధునాతన సాంకేతికత, లాంగ్​ రేంజ్​ని ఈ కొత్త ఈవీ తీసుకొస్తోంది. ఈ ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో ఇంట్రొడక్టరీ ఎక్స్​షోరూం ధర రూ .17.49 లక్షలు. మొదటి 8,000 యూనిట్లకు మాత్రమే ఈ ధర వర్తిస్తుంది.

కొత్త ఎంజీ విండ్సర్ ఈవీ ప్రోలో బ్యాటరీ-ఆస్-ఏ-సర్వీస్ (బీఏఎస్) ఫీచర్ను ఎంచుకున్న కొనుగోలుదారులు విండ్సర్ ప్రోను రూ .12.50 లక్షల నుంచి కొనుగోలు చేయవచ్చు. బ్యాటరీ అద్దె.. కిలోమీటరుకు రూ .4.5 వద్ద లభిస్తుంది. కొత్త ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో కోసం బుకింగ్స్ మే , 2025న ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్​ కారు వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో..

కొత్త ఎంజీ విండ్సర్ ఈవీ ప్రోలో 52.9 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 449 కిలోమీటర్ల వరకు రేంజ్​ని ఇస్తుందని సంస్థ చెబుతోంది​. ప్రో వేరియంట్ ట్రాఫిక్ జామ్ అసిస్ట్​తో కూడిన లెవల్ 2 అటానమస్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టెమ్ (ఏడీఏఎస్), ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి కొత్త ఫీచర్లను కలిగి ఉంది. ఈ మోడల్​లో వెహికల్-టు-లోడ్ (వీ2ఎల్) ఫంక్షన్, వెహికల్-టు-వెహికల్ (వీ2వీ) ఛార్జింగ్ వంటివి కూడా ఉన్నాయి. ఇది మోడల్​కు మరింత వైవిధ్యతను తెస్తుంది.

ఎలక్ట్రిక్​ కారు క్యాబిన్ కొత్త డ్యూయెల్-టోన్ బ్లాక్, ఐవరీ ఇంటీరియర్లతో వస్తోంది. ఇది కొత్త వేరియంట్​కి ప్రీమియం టచ్​ని జోడిస్తుంది. ఇప్పటి అందుబటులో ఉన్న వేరియంట్లలో లభించే ఏరో వీల్స్​తో పోలిస్తే ఈ మోడల్ కొత్త డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ వస్తున్నాయి.

కొత్త ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో సెలాడన్ బ్లూ, గ్లేజ్ రెడ్, అరోరా సిల్వర్ అనే మూడు కొత్త రంగులతో లభిస్తుంది.

ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో పవర్ ఔట్​పుట్​లో ఎటువంటి మార్పు లేదు. ఇది 134 బీహెచ్​పీ పవర్​, 200 ఎన్ఎమ్ టార్క్​ని జనరేట్​ చేసే అదే ఫ్రంట్-యాక్సిల్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగిస్తుంది.

ఎంజీ విండ్సర్ ఈవీ వేరియంట్లు..

కొత్తగా లాంచ్​ అయిన ఎంజీ విండ్సర్​ ఈవీ ప్రోతో పాటు స్టాండర్డ్ ఎంజీ విండ్సర్ ఈవీ ఎక్సైట్, ఎక్స్​క్లూజివ్, ఎసెన్స్ అనే మూడు వేరియంట్లు అందుబాటులో ఉంటాయి. ధర రూ.9.99 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. దిగువ వేరియంట్లలో ఫ్యాన్సియర్ ఫీచర్లు, డ్యూయల్-టోన్ ఇంటీరియర్​ ఉండవు. కానీ అదే ఎలక్ట్రిక్ మోటార్, పనితీరును కలిగి ఉంటాయి. లోయర్ ట్రిమ్స్ 38 కిలోవాట్ల బ్యాటరీని ప్యాక్ చేస్తాయి. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 332 కిలోమీటర్ల రేంజ్​ని అందిస్తుంది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం