ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారుగా దూసుకెళుతున్న ఎంజీ విండ్సర్ ఈవీలో కొత్త వేరియంట్ తాజాగా లాంచ్ అయ్యింది. దీని పేరు ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో. ఈ నేపథ్యంలో కొత్త ఎంజీ విండ్సర్ ఈవీ ప్రోని, ఇప్పటికే మార్కెట్లో ఉన్న విండ్సర్ ఈవీతో పోల్చి.. ఈ రెండింటిలో ఏది బెస్ట్? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో ఎక్స్‌షోరూమ్ ధర రూ.17.50 లక్షలు. ఈ కొత్త వేేరియంట్లో బ్యాటరీ-యాస్-ఏ-సర్వీస్ (బీఏఎస్) ఫీచ్ని ఎంచుకునే వినియోగదారులు విండ్సర్ ఈవీ ప్రో ఎలక్ట్రిక్ కారును రూ .12.50 లక్షల నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. బ్యాటరీ అద్దె కిలోమీటరుకు రూ .4.5 వద్ద లభిస్తుంది. అయితే ఇవి ఇంట్రొడక్టరీ ప్రైజ్ అని గుర్తుపెట్టుకోవాలి. మొదటి 8వేల కస్టమర్స్‌కి మాత్రమే ఇవి వర్తిస్తాయి.
కొత్త ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో బుకింగ్స్ మే 8, 2025న ప్రారంభమవుతాయి.
మరోవైపు స్టాండర్డ్ మోడల్ ఎంజీ విండ్సర్ ఈవీ ఎలక్ట్రిక్ కారు బేస్ ఎక్సైట్ వేరియంట్ ధర రూ .13.99 లక్షలు. ఎక్స్‌క్లూజివ్, ఎసెన్స్ వేరియంట్స్ ఎక్స్‌షోరూం ధరలు వరుసగా రూ .14.99 లక్షలు, రూ .15.99 లక్షలు. ఈ ధరలు పూర్తిగా కొనుగోలు చేయడానికి. బీఏఎస్ విషయానికి వస్తే విండ్సర్ ఈవీ ధర కిలోమీటరుకు రూ.3.5 చొప్పున రూ.9.99 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. బీఏఎస్తో ఎక్స్‌క్లూజివ్, ఎసెన్స్ ట్రిమ్ లెవల్ ఎక్స్‌షోరూం ధరలు వరుసగా రూ.10.99 లక్షలు, రూ.11.99 లక్షలుగా ఉన్నాయి.
ఎంజీ విండ్సర్ ఈవీ ప్రోలో అతిపెద్ద మార్పు కొత్త బ్యాటరీ ప్యాక్! కొత్త ఎలక్ట్రిక్ కారులో 52.9 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 449 కిలోమీటర్ల రేంజ్‌ని ఇస్తుంది. అయితే, ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో పవర్ ఔట్‌పుట్‌లో ఎటువంటి మార్పు లేదు. ఇది 134 బీహెచ్పీ, 200 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను జనరేట్ చేసే అదే ఫ్రంట్-యాక్సిల్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగిస్తుంది.
మరోవైపు విండ్సర్ ఈవీ స్టాండర్డ్ వెర్షన్లో 38 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 331 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. మోటార్ స్పెసిఫికేషన్లు ప్రో మోడల్ మాదిరిగానే ఉంటాయి.
విండ్సర్ ఈవీ ప్రో క్యాబిన్ కొత్త డ్యూయెల్-టోన్ బ్లాక్, ఐవరీ ఇంటీరియర్లతో వస్తుంది. ఇది కొత్త వేరియంట్‌కి ప్రీమియం టచ్‌ని జోడిస్తుంది. ఇది కాకుండా క్యాబిన్ కోసం సాధారణ మోడల్ మాదిరిగానే అవే ఫీచర్లు ఉన్నాయి. అయితే ప్రో వేరియంట్లో లెవల్ 2 అటానమస్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టెమ్ (ఏడీఏఎస్) విత్ ట్రాఫిక్ జామ్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి కొత్త ఫీచర్లు వచ్చాయి. ఈ మోడల్ లో వెహికల్-టు-లోడ్ (వీ2ఎల్) ఫంక్షన్, వెహికల్-టు-వెహికల్ (వీ2వీ) ఛార్జింగ్ ఉన్నాయి. ఇది మోడల్‌కు మరింత వైవిధ్యతను తెస్తుంది.
రెగ్యులర్ మోడల్ బ్లాక్ ఇంటీరియర్ థీమ్‌ని పొందుతుంది. ఏడీఏఎస్, వీ2ఎల్, వీ2వీ వంటి ఫీచర్లను కోల్పోతుంది. ఇది 6-వే అడ్జెస్టెబుల్ సీటును పొందుతుంది. ఫ్రంట్ ప్యాసింజర్ 4-వే అడ్జెస్టెబుల్ సీటును పొందుతుంది. అంతేకాకుండా, ఇది 15.6 టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, రేర్ ఏసీ వెంట్స్, పనోరమిక్ గ్లాస్ రూఫ్ వంటి ఫీచర్లను కూడా పొందుతుంది.
విండ్సర్ ఈవీ ప్రో ఎలక్ట్రిక్ కారు కొత్త డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌ని పొందుతుంది. ఇది తక్కువ వేరియంట్లలో లభించే ఏరో వీల్స్‌తో పోలిస్తే భిన్నమైన రూపాన్ని ఇస్తుంది. కొత్త ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో సెలాడన్ బ్లూ, గ్లేజ్ రెడ్, అరోరా సిల్వర్ అనే మూడు కొత్త రంగులతో లభిస్తుంది.
విండ్సర్ డిజైన్‌లో సొగసైన ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ఉన్నాయి. ఇవి ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఇవి ముందు భాగంలో నడిచే ఎల్ఈడీ స్ట్రిప్‌తో అనుసంధానించి ఉంటాయి. ఈ కారులో ఇల్యూమినేటెడ్ బ్రాండ్ లోగో, ఎల్ఈడీ హెడ్- టెయిల్ ల్యాంప్స్, ఫ్లష్ ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి.
సంబంధిత కథనం