జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా భారత మార్కెట్లో విండ్సర్ ఈవీ ప్రో ఎలక్ట్రిక్ కారు డెలివరీలను ప్రారంభించింది. ఇటీవల లాంచ్ అయిన ఈవీ కేవలం 24 గంటల్లోనే 8,000 బుకింగ్స్ సాధించడం విశేషం. ఇది విండ్సర్ లైనప్‌లో కొత్త టాప్-ఎండ్ వేరియంట్‌గా అందుబాటులోకి వచ్చింది. స్టాండర్డ్ విండ్సర్ ఈవీ కంటే అనేక కొత్త ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..
ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో ఎలక్ట్రిక్ కారులో ఎక్స్‌షోరూమ్ ధర రూ.18.10 లక్షలు. తొలుత రూ.17.49 లక్షల ఎక్స్‌షోరూమ్ ధరతో లాంచ్ చేసినప్పటికీ తొలి 8,000 మంది కస్టమర్లకు మాత్రమే ఇది అందుబాటులోకి ఉంది.
ఎంజీ విండ్సర్ ఈవీ ప్రోలో 52.9 కిలోవాట్ల బ్యాటరీ ఉంది. స్టాండర్డ్ విండ్సర్ ఈవీ 38 కిలోవాట్ల యూనిట్‌తో అందుబాటులో ఉంది.
విండ్సర్ ఈవీ ప్రోని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 449 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా వెల్లడించింది.
విండ్సర్ ఈవీ ప్రో ఎలక్ట్రిక్ మోటారులో కంపెనీ ఎటువంటి మార్పులు చేయలేదు. ఇది 134 బీహెచ్పీ పవర్, 200ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
ఎంజీ విండ్సర్ ఈవీతో పోలిస్తే, ప్రో వేరియంట్ ఎలక్ట్రిక్ టెయిల్ గేట్, ఏడీఏఎస్ లెవల్ 2తో వస్తుంది. ఇది కాకుండా, ఇంటీరియర్ ఇప్పుడు బీజ్, బ్లాక్ డ్యూయెల్-టోన్ థీమ్‌తో వస్తుంది.
15.6 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, 8.8 ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, పానోరమిక్ గ్లాస్ రూఫ్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్, 9 స్పీకర్ ఇన్ఫినిటీ ఆడియో సిస్టెమ్, 360 డిగ్రీల కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆరు ఎయిర్ బ్యాగులు వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఈ ఎలక్ట్రిక్ కారులో జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా మూడు అదనపు కలర్ ఆప్షన్లను ప్రవేశపెట్టింది. అవి.. సెలాడాన్ బ్లూ, అరోరా సిల్వర్, గ్లేజ్ రెడ్. అదనంగా, పెర్ల్ వైట్, స్టార్బర్ట్స్ బ్లాక్, టర్కోయిస్ గ్రీన్ కూడా అందుబాటులో ఉన్నాయి. 19 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ను ప్రవేశపెట్టింది. ఈ కారుకు ఇవి బాగా సూట్ అవుతాయి. అట్రాక్టివ్‌గా ఉన్నాయి.
సంబంధిత కథనం