'రేంజ్​' పెరిగింది! ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఈవీపై బిగ్​ అప్డేట్..-mg windsor ev likely to get a bigger battery could promise longer range ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  'రేంజ్​' పెరిగింది! ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఈవీపై బిగ్​ అప్డేట్..

'రేంజ్​' పెరిగింది! ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఈవీపై బిగ్​ అప్డేట్..

Sharath Chitturi HT Telugu

ఎంజీ విండ్సర్ ఈవీలో లాంగ్ రేంజ్ వెర్షన్​ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. సింగిల్​ ఛార్జ్​తో 450. కి.మీ కన్నా ఎక్కువ రేంజ్​ ఇచ్చే ఈ మోడల్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఎంజీ విండ్సర్​ ఈవీ

ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఎలక్ట్రిక్​ వెహికిల్​గా దూసుకెళుతోంది ఎంజీ విండ్సర్​ ఈవీ. లాంచ్​ అయిన 6 నెలల్లోనే 20వేలకుపైగా యూనిట్లు విక్రయించి రికార్డు సృష్టించింది. ఇక ఇప్పుడు ఈ మోడల్​పై బిగ్​ అప్డేట్​ బయటకు వస్తోంది! ఎంజీ విండ్సర్​ ఈవీలో కొత్త బ్యాటరీ ప్యాక్​ అందుబాటులోకి రానుందని సమాచారం. దీని ద్వారా ఓవరాల్​ రేంజ్​ మరింత పెరుగుతుందని తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఎంజీ విండ్సర్​ ఈవీ- కొత్త బ్యాటరీ..

ఎంజీ విండ్సర్ ఈవీ ప్రస్తుతం 38 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్​తో అందుబాటులో ఉంది. ఇందులో పెద్ద బ్యాటరీ ప్యాక్ (50.6 కిలోవాట్​) యూనిట్ అందుబాటులోకి రానుంది. ఇది ప్రస్తుత మోడల్​తో పోలిస్తే ఎలక్ట్రిక్ కారుకు పూర్తి ఛార్జ్​పై అధిక రేంజ్​ని ఇస్తుంది.

ఈ విండ్సర్ ఈవీ ఎలక్ట్రిక్​ వెహికిల్​ లాంగ్ రేంజ్ వెర్షన్ వచ్చే నెలలో భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఆ వెంటనే ఎంజీ షోరూమ్స్​కి చేరుకోవడం ప్రారంభమవుతుంది.

కొత్త ఎంజీ విండ్సర్ ఈవీ లాంగ్​ రేంజ్​ మోడల్​ డిజైన్​లో ఎలాంటి మార్పులు ఉండవు. కానీ అలాయ్​ వీల్స్​ మారవచ్చు. ఈవీకి ప్రధాన అప్​గ్రేడ్ పెద్ద బ్యాటరీ ప్యాక్ మాత్రమే. ఈ ఎలక్ట్రిక్​ కారు లాంగ్ రేంజ్ వెర్షన్​లోని 50.6 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్​ని పూర్తిగా ఛార్జ్​ చేస్తే 460 కిలోమీటర్ల రేంజ్​ని అందిస్తుంది. ఇది ఎంజీ జెడ్ఎస్ ఈవీ మాదిరిగానే ఉంటుంది.

అయితే, ఇది ప్రస్తుత మోడల్ మాదిరిగానే, అదే పీఎంఎస్ మోటారుతో వస్తుందా? లేదా? అనేది తెలియదు. ఒకవేళ అదే ఉంటే మాత్రం.. రానున్న ఎంజీ విండ్సర్ ఈవీ లాంగ్ రేంజ్ మోడల్​లోని ఫ్రంట్ వీల్ డ్రైవ్ మోటార్ 131.3బీహెచ్​పీ పవర్, 200ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఇది ఎలక్ట్రిక్ వాహనాన్ని గరిష్టంగా గంటకు 175 కిలోమీటర్ల వేగంతో నడపడానికి వీలు కల్పిస్తుంది. ప్రస్తుతం ఉన్న విండ్సర్ ఈవీ సరిగ్గా అదే నంబర్లతో వస్తుంది.

ప్రస్తుతం ఈవీ ఏడు గంటల్లో 20-100 శాతం ఛార్జ్ అవుతుంది. డీసీ ఫాస్ట్ ఛార్జర్​ని ఉపయోగించి, 30 నిమిషాల్లో 30 శాతం నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.

ఎంజీ విండ్సర్ ఈవీ రాబోయే లాంగ్ రేంజ్ వెర్షన్ ప్రస్తుత మోడల్ టాప్ ట్రిమ్ కంటే రూ .4 లక్షల ప్రీమియంతో వచ్చే అవకాశం ఉంది! ఆ సందర్భంలో, రాబోయే విండ్సర్ ఈవీ లాంగ్ వెర్షన్ నేరుగా టాటా కర్వ్ ఈవీ, మహీంద్రా బీఈ 6లకు గట్టి పోటీగా నిలుస్తుంది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం