Electric Vehicle : భారతీయ మార్కెట్‌లోకి మరో ఎలక్ట్రిక్ కారు.. ఫీచర్లు సూపరు.. మైలేజీ ఎంతంటే
MG Windsor EV : ఇటీవల భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో చాలా కంపెనీలు మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికల చేస్తున్నాయి. ఎంజీ మోటర్స్ కూడా మంచి ఫీచర్లతో ఈవీని లాంచ్ చేసేందుకు ప్లాన్ చేసింది. ఇది మార్కెట్లోకి ఎప్పుడు వస్తుంది? ఇందులో ఉండే ఫీచర్లు ఏంటో తెలుసుకోండి?
కొన్నేళ్లుగా భారతీయ వినియోగదారుల్లో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. అయితే టాటా మోటార్స్ ఇప్పటికీ ఈ సెగ్మెంట్లో ఆధిపత్యం కొనసాగిస్తోంది. భారతదేశంలో మొత్తం ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్ వాటా 65 శాతంగా ఉంది. ఇప్పుడు ఈ డిమాండ్ దృష్ట్యా దిగ్గజ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్స్ తన మోస్ట్ అవైటెడ్ ఎలక్ట్రిక్ క్రాసోవర్ ఎంజీ విండ్సర్ ఈవీని విడుదల చేయబోతోంది.
ఎంజీ విండ్సర్ ఈవీ సెప్టెంబర్ 11 న భారత మార్కెట్లోకి ప్రవేశించనుంది. రాబోయే విండ్సర్ ఈవీలో 15.6-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇవ్వబడుతుందని సమాచారం. ఎంజీ విండ్సర్ ఈవీ విదేశాల్లో విక్రయించే కంపెనీ క్లౌడ్ ఈవీ ఆధారంగా పనిచేస్తుంది. ఎంజీ విండ్సర్ ఈవీ ఫీచర్లు, పవర్ట్రెయిన్, డ్రైవింగ్ రేంజ్, ధర గురించి వివరంగా తెలుసుకుందాం..
ఫీచర్లు
ఇటీవల విడుదలైన ఎంజీ విండ్సర్ ఈవీ టీజర్ ప్రకారం.. ఇది 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రికల్ ఆపరేటెడ్ టెయిల్గేట్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, క్యాబిన్ మోడ్ వంటి ఫీచర్లను పొందుతుంది. రాబోయే ఎంజీ విండ్సర్ ఈవీ భారతదేశంలో కంపెనీ మూడో ఎలక్ట్రిక్ కారు. అంతకుముందు కంపెనీ ఎంజీ జెడ్ఎస్ ఈవీ, కామెట్ ఈవీ 2019 నుండి భారత మార్కెట్లో అమ్మకానికి ఉన్నాయి.
ఇది కాకుండా రాబోయే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో డెడికేటెడ్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, తగినంత స్టోరేజ్ స్పేస్, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, స్లీక్ హెడ్ లైట్స్, రెండు ఛార్జింగ్ పోర్ట్‌లు ఉన్నాయి. కంపెనీ రాబోయే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టెస్టింగ్ సమయంలో అనేకసార్లు భారతీయ రోడ్లపై కనిపించింది.
మైలేజీ వివరాలు
ఎంజీ రాబోయే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పవర్ట్రెయిన్ గురించి మాట్లాడితే దీనికి రెండు బ్యాటరీ ప్యాక్‌లు ఇవ్వబడతాయి. మొదటిది 37.9 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్, ఇది వినియోగదారులకు ఒకసారి ఛార్జ్ చేస్తే 360 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. రెండవది 50.6 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది, ఇది వినియోగదారులకు ఒకసారి ఛార్జ్ చేస్తే 460 కిలోమీటర్ల వరకు పరిధిని అందిస్తుంది.
వీటికి పోటీగా
ఈ కారు మోటారు గరిష్టంగా 134 బిహెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేయగలదు. రాబోయే ఎంజీ విండ్సర్ ఈవీ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.20 లక్షలు ఉండవచ్చు. ఇండియన్ మార్కెట్లో ఎంజీ విండ్సర్ ఈవీ టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా ఎక్స్‌యూవీ 400 ఈవీలకు గట్టి పోటీ ఇవ్వనుంది.