Best selling EV : భారతీయులు ఎక్కువగా కొంటున్న ఎలక్ట్రిక్​ కారు ఇదే- రేంజ్​ ఎంతంటే..-mg windsor ev becomes fastest ev to sell 20 000 units in 6 months ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best Selling Ev : భారతీయులు ఎక్కువగా కొంటున్న ఎలక్ట్రిక్​ కారు ఇదే- రేంజ్​ ఎంతంటే..

Best selling EV : భారతీయులు ఎక్కువగా కొంటున్న ఎలక్ట్రిక్​ కారు ఇదే- రేంజ్​ ఎంతంటే..

Sharath Chitturi HT Telugu

MG Windsor EV price : ఇండియాలో భారతీయులు ఎక్కువగా కొంటున్న ఈవీ ఏంటో తెలుసా? దాని పేరు ఎంజీ విండ్సర్​ ఈవీ! ఈ వెహికిల్​ ఇటీవలే అతిపెద్ద మైలురాయిని తాకింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఈవి ఇది..

ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఎలక్ట్రిక్​ కారుగా కొనసాగుతోంది ఎంజీ విండ్సర్​ ఈవీ. ఇప్పుడు ఈ మోడల్​కి సంబంధించి బిగ్​ అప్డేట్​ ఇచ్చింది జేఎస్​డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా. భారత మార్కెట్​లో కేవలం 6 నెలల్లోనే 20,000 యూనిట్ల విండ్సర్ ఈవీని విక్రయించినట్లు ప్రకటించింది. ఫలితంగా అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న తొలి ఎలక్ట్రిక్ వెహికిల్​గా నిలిచింది ఎంజీ విండ్సర్​ ఈవీ. ఈ నేపథ్యంలో ఈ మోడల్​కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఎంజీ విండ్సర్ ఈవీ- బ్యాటరీ, రేంజ్​..

ఎంజీ విండ్సర్​ ఈవీలో 38 కిలోవాట్​ బ్యాటరీ ప్యాక్​ ఉంటుంది. ఇది 332 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్​ని అందిస్తుంది. అయితే, రియల్​ టైమ్​లో ఈ రేంజ్​ 260 నుంచి 280 కి.మీ వరకు ఉంటుందని సమాచారం. డీసీ ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగించినప్పుడు బ్యాటరీని 55 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. అదనంగా, ఎలక్ట్రిక్ కారులో ప్రామాణిక పరికరాలుగా పోర్టబుల్ ఛార్జర్ ఉంటుంది. వాల్ బాక్స్ ఛార్జర్​ని ఆప్షనల్​గా ఇచ్చింది ఆటోమొబైల్​ సంస్థ.

ఎంజీ విండ్సర్ ఈవీ- బ్యాటరీ ప్యాక్​పై వారంటీ..

ఎంజీ విండ్సర్​ ఈవీపై జేఎస్​డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా మొదటి యజమానికి బ్యాటరీపై జీవితకాల వారంటీని అందిస్తుండగా, రెండొవ యజమాని నుంచి, వారంటీ 8 సంవత్సరాల 1,60,000 కిలోమీటర్లుగా నిర్ణయించింది.

ఎంజీ విండ్సర్ ఈవీ- ధర..

జేఎస్​డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా విండ్సర్ ఈవీకి చెందిన అన్ని వేరియంట్ల ధరలను ఇటీవలే రూ .50,000 పెంచింది. ఎక్సైట్ వేరియంట్ ధర రూ.13,99,800. ఎక్స్ క్లూజివ్ వేరియంట్ ధర రూ.14,99,800. టాప్ ఎండ్ ఎస్సెన్స్ వేరియంట్ ధర రూ.15,99,800. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్.

ఎంజీ విండ్సర్ ఈవీ- స్పెసిఫికేషన్లు..

ఎంజీ విండ్సర్ ఈవీలో ఫ్రంట్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది గరిష్టంగా 134బీహెచ్​పీ పవర్, 200ఎన్ఎమ్ పీక్​ టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

20వేల యూనిట్ల అమ్మకాల మైలురాయి గురించి జేఎస్​డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ రాకేష్ సేన్ మాట్లాడుతూ.. “లాంచ్ అయినప్పటి నుంచి, ఎంజీ విండ్సర్ ఈవీ తన అసాధారణ వాల్యూ ప్రతిపాదనతో కారు కొనుగోలుదారులను సంతోషపరిచింది. ఫ్యూచరిస్టిక్ డిజైన్, సహజమైన టెక్ ఫీచర్లు, విశాలమైన క్యాబిన్, అన్నీ కలిపి స్థిరమైన, పాకెట్ ఫ్రెండ్లీ డ్రైవింగ్ అనుభవాన్ని వినియోగదారులు ప్రశంసిస్తున్నారు. అదనంగా, ఎంజీ విండ్సర్​తో, మేము ఈ కేటగిరీలోని అడ్డంకులను విజయవంతంగా పరిష్కరించాము, మా వినూత్న విధానం ద్వారా భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల చుట్టూ ఉన్న అనేక అపోహలను తొలగించాము. ఇది కొత్త వినియోగదారులు ఈవీ జీవనశైలికి అనుగుణంగా మారడానికి వీలు కల్పించింది. ఈ అంశాలు రికార్డు సమయంలో 20,000 అమ్మకాల మైలురాయిని చేరుకున్న వేగవంతమైన ఈవీ మోడల్​గా ఎంజీ విండ్సర్​ని నిలిపాయి,” అని అన్నారు.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం