MG Majestor : టయోటా ఫార్చ్యునర్​కి పోటీగా మార్కెట్​లోకి భారీ ఎస్​యూవీ! ఎంజీ మెజెస్టర్​ ఎలా ఉందంటే..-mg majestor unveiled at auto expo 2025 will rival toyota fortuner legender ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mg Majestor : టయోటా ఫార్చ్యునర్​కి పోటీగా మార్కెట్​లోకి భారీ ఎస్​యూవీ! ఎంజీ మెజెస్టర్​ ఎలా ఉందంటే..

MG Majestor : టయోటా ఫార్చ్యునర్​కి పోటీగా మార్కెట్​లోకి భారీ ఎస్​యూవీ! ఎంజీ మెజెస్టర్​ ఎలా ఉందంటే..

Sharath Chitturi HT Telugu
Jan 18, 2025 01:40 PM IST

MG Majestor car price : ఎంజీ మెజెస్టర్​ని సంస్థ తాజాగా ఆవిష్కరించింది. ఇప్పటికే మార్కెట్​లో ఉన్న ఎంజీ గ్లోస్టర్​కి ఇది ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​గా వస్తోంది. ఈ మోడల్​ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..

ఎంజీ మెజెస్టర్​ ఎస్​యూవీ..
ఎంజీ మెజెస్టర్​ ఎస్​యూవీ..

జేఎస్​డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా మంచి దూకుడు మీద ఉంది! అటు ఎలక్ట్రిక్​ వాహనాలతో పాటు ఇటు ఐసీఈ ఇంజిన్​ మోడల్స్​ని లాంచ్​ చేస్తూ, మార్కెట్​లో పోటీని మరింత పెంచుతోంది. ఇందులో భాగంగానే, దిల్లీ వేదికగా జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్​పో 2025లో మెజెస్టర్ పేరుతో సరికొత్త ఎస్​యూవీని సంస్థ ఆవిష్కరించింది. ఇది ఇప్పటికే భారత మార్కెట్లో అమ్మకానికి ఉన్న ఎంజీ గ్లోస్టర్ ఫేస్​లిఫ్ట్ వర్షెన్. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. గ్లోస్టర్ అమ్మకాలు కూడా కొనసాగుతాయి! ఈ ఎంజీ మెజెస్టర్​.. లైనప్​లో గ్లోస్టర్​కి పైన ఉంటుంది. ఇక ఈ ఎంజీ మెజెస్టర్​ ఇప్పటికే మార్కెట్​లో బెస్ట్​ సెల్లింగ్​గా ఉన్న టయోటా ఫార్చ్యునర్​ లెజెండర్​కి గట్టి పోటీనివ్వనుంది.

yearly horoscope entry point

ఎంజీ మెజెస్టర్ డిజైన్ హైలైట్స్ ఏంటి?

కొన్ని గ్లోబల్ మార్కెట్లలో అమ్మకానికి ఉన్న మాక్సస్ డీ90 ఎస్​యూవీ ఆధారంగా ఈ ఎంజీ మెజెస్టర్​ని రూపొందించింది సంస్థ. ఈ మోడల్​ సెగ్మెంట్​లోనే పొడవైన, వెడల్పైనది అని సంస్థ చెబుతోంది. దీని ముందు భాగంలో భారీ ఫ్రంట్ గ్రిల్ ఉంటుంది. దీనికి గ్లాస్ బ్లాక్​ లో ఫినిషింగ్​ వచ్చింది. స్ప్లిట్-హెడ్ ల్యాంప్ డిజైన్ ఉంది. ఇక్కడ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్ పైన ఉంది. మెయిన్​ హెడ్​ల్యాంప్ క్లస్టర్ బంపర్​లో నిలువుగా వస్తోంది.

ఎంజీ మెజెస్టర్​లో 12.3 ఇంచ్​ ఫ్రీస్టాండింగ్​ టచ్​స్క్రీన్​ ఇన్​ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, పానొరమిక్​ సన్​రూఫ్​, ఫుల్లీ డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ కనసోల్​, 3 జోన్​ క్లైమేట్​ కంట్రోల్​, వైర్​లెస్​ మొబైల్​ ఛార్జింగ్​ సెటప్​తో పాటు మరెన్నో ఫీచర్స్​ ఉంటాయి.

ఇక సేఫ్టీ విషయానికొస్తే ఈ భారీ ఎస్​యూవీలో లెవల్​ 2 ఏడీఏఎస్, 6 ఎయిర్​బ్యాగ్​లు, హిల్​ హోల్డ్​ కంట్రోల్​, ఎలక్ట్రానిక్​ స్టెబిలిటీ ప్రోగ్రామ్​, హిల్​ డిసెంట్​ కంట్రోల్​, డ్రైవర్​ ఫాటిగ్​ వార్నింగ్​, ట్రాక్షన్​ కంట్రోల్​, రోల్​ మూవ్​మెంట్​ ఇంటర్వెన్షన్​, ఎలక్ట్రిక్​ పార్కింగ్​ బ్రేక్​ విత్​ ఆటో హోల్డ్​, 360 డిగ్రీ వ్యూ కెమెరా వంటి ఫీచర్స్​ సైతం ఉన్నాయి.

కాగా మెకానిక్స్​ పరంగా గ్లోస్టర్​తో పోల్చితే ఎంజీ మెజెస్టర్​లో ఎలాంటి మార్పులు ఉండకపోవచచు. ఇందులో 2 లీటర్​, ట్విన్​ టర్బో డీజిల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 213 బీహెచ్​పీ పవర్​ని, 478 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. ఇందులో 8 స్పీడ్​ ఆటోమొబైల్​ ట్రాన్సిషన్​ సెటప్​ స్టాండర్డ్​గా ఉంటుంది. ఇదొక 4x4 వెహికిల్​.

ఈ ఎంజీ మెజెస్టర్​ ఎప్పుడు లాంచ్​ అవుతుంది? అన్న దానిపై ప్రస్తుతం క్లారిటీ లేదు. కానీ దీని ప్రారంభ ధర రూ. 40లక్షల వద్ద ఉండొచ్చని సమాచారం. హై ఎండ్​ మోడల్​ ధర రూ. 45లక్షల వరకు వెళ్లొచ్చు. రెండూ ఎక్స్​షోరూం ధరలే!

Whats_app_banner

సంబంధిత కథనం