Electric car : సింగిల్​ ఛార్జ్​తో 580 కి.మీ రేంజ్​- ఫ్యామిలీ కోసమే ఈ పెద్ద ఎలక్ట్రిక్​ కారు..!-mg m9 ev unveiled is first all electric limousine in india see range and other details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Electric Car : సింగిల్​ ఛార్జ్​తో 580 కి.మీ రేంజ్​- ఫ్యామిలీ కోసమే ఈ పెద్ద ఎలక్ట్రిక్​ కారు..!

Electric car : సింగిల్​ ఛార్జ్​తో 580 కి.మీ రేంజ్​- ఫ్యామిలీ కోసమే ఈ పెద్ద ఎలక్ట్రిక్​ కారు..!

Sharath Chitturi HT Telugu
Jan 10, 2025 09:00 AM IST

MG M9 EV : ఒక పెద్ద ఎలక్ట్రిక్​ కాారును ఇండియాలోకి తీసుకొస్తోంది ఎంజీ. దీని పేరు ఎంజీ ఎం9 ఈవీ. ఇదొక లిమోసిన్​. ఈ మోడల్​ రేంజ్​తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఎంజీ ఎం9 ఈవీ..
ఎంజీ ఎం9 ఈవీ..

ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లోని ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​.. రోజుకో ప్రాడక్ట్​ లాంచ్​తో కళకళలాడిపోతోంది. డిమాండ్​ని క్యాష్​ చేసుకునేందుకు అన్ని ఆటోమొబైల్​ సంస్థలు పోటీ పడుతూ.. కస్టమర్స్​కి కొత్త కొత్త ఆఫర్స్​ని తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే జేఎస్​డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తన కొత్త లగ్జరీ లిమోసిన్​ని ఆవిష్కరించింది. ఈ ఎలక్ట్రిక్​ కారు పేరు ఎం9 ఈవీ. కొత్త లిమోసిన్​ని జేఎస్​డబ్ల్యూ ఎంజీ కొత్త లగ్జరీ బ్రాండ్ ఛానల్ “ఎంజీ సెలెక్ట్​” ద్వారా విక్రయించడం జరుగుతుంది. త్వరలో ప్రారంభంకానున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్​పో 2025లో ఈ ఎం9 ఈవీ లిమోసిన్​ని ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ మోడల్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

yearly horoscope entry point

ఎంజీ ఎం9 ఈవీ..

ఈ ఎం9 ఈవీలో చాలా ప్రత్యేకలు ఉన్నాయి. సెకెండ్​ రోలో ఉండే ఒట్టామన్​ సీట్స్​కి 8 మసాజ్​ మోడ్స్​ ఉన్నాయి. హ్యాండ్​రెయిల్​పై ఉండే టచ్​స్క్రీన్​ ప్యానెల్ ద్వారా నియంత్రించే త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ కూడా ఉంది. మసాజ్ మోడ్​లను నియంత్రించడానికి కూడా ఇదే స్క్రీన్​ను ఉపయోగించవచ్చు.

ఎంజీ ఎం9 ఈవీ స్పెసిఫికేషన్లు..

గ్లోబల్ మార్కెట్లో ఈ ఎంజీ ఎం9 ఎలక్ట్రిక్​ కారు బ్లాక్ పెర్ల్, వైట్ పెర్ల్ అనే రెండు రంగుల్లో అందుబాటులో ఉంది. ఇందులో 90 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్​ ఉంది. దీనిని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 580 కిలోమీటర్ల రేంజ్​ని అందిస్తుంది. ఎంజీ 11 కిలోవాట్ల ఛార్జర్​ని అందిస్తుంది. ఇది బ్యాటరీ ప్యాక్​ని 5 శాతం నుంచి 100 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 8.5 గంటలు పడుతుంది! అయితే డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ కేవలం 30 నిమిషాల్లో బ్యాటరీని 30 శాతం నుంచి 80 శాతానికి పెంచుతుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు గరిష్టంగా 241బీహెచ్​పీ పవర్, 350ఎన్ఎమ్ టార్క్​ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎం9 ఈవీ టాప్ స్పీడ్ గంటకు 180 కిలోమీటర్లు.

అయితే, ఇవి అంతర్జాతీయ మార్కెట్​లో అందుబాటులో ఉన్న ఎంజీఎం9 ఈవీవి. జేఎస్​డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా.. ఇండియా-స్పెక్ మోడల్​లో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది.

ఎంజీ ఎం9 ఈవీ డైమెన్షన్స్​..

ఎంజీ ఎం9 ఈవీ 5,270 ఎంఎం పొడవు, 2,000 ఎంఎం వెడల్పు, 1,840 ఎంఎం ఎత్తు ఉంటుంది. వీల్ బేస్ 3,200 ఎంఎం.

జేఎస్​డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా చీఫ్ గ్రోత్ ఆఫీసర్ గౌరవ్ గుప్తా మాట్లాడుతూ.. “పర్సనలైజ్​డ్​ మాస్టర్ పీస్ అయిన ఎంజీ ఎం9 బెస్పోక్ ఇంటీరియర్స్, ఖచ్చితమైన హస్తకళ, అత్యాధునిక సాంకేతికతను అందిస్తుంది. సొగసుల ప్రపంచంలో లీనమవ్వాలనుకునేవారికి ఇది సౌకర్యం, శుద్ధి చేసిన విలాసానికి ప్రతిరూపం. లగ్జరీ మొబిలిటీ ప్రామాణికమైన భవిష్యత్తును మేము ఊహించాము. ఎం9 ఆ ప్రయాణంలో ఒక అడుగు,” అని వివరించారు.

ఈ మోడల్​ ధరతో పాటు మరిన్ని వివరాలపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం