సింగిల్​ ఛార్జ్​తో 500 కి.మీ రేంజ్! ఈ 3-రో ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ కారు లాంచ్​ రేపే..-mg m9 ev to be launched in india on july 21 see this electric car range here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  సింగిల్​ ఛార్జ్​తో 500 కి.మీ రేంజ్! ఈ 3-రో ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ కారు లాంచ్​ రేపే..

సింగిల్​ ఛార్జ్​తో 500 కి.మీ రేంజ్! ఈ 3-రో ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ కారు లాంచ్​ రేపే..

Sharath Chitturi HT Telugu

ఎంజీ ఎం9 ఈవీ భారత దేశంలో సోమవారం లాంచ్​కానుంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ రేంజ్​, ఫీచర్స్​ వంటి పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..

ఎంజీ ఎం9..

ఎంజీ మోటార్ నుంచి ఫుల్లీ ఎలక్ట్రిక్, 3- రో లగ్జరీ ఎంపీవీ సోమవారం భారత మార్కెటలో లాంచ్​కానుంది. దాని పేరు ఎంజీ ఎం9. 2025 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన ఈ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ మోడల్.. భారత మార్కెట్ కోసం ప్రవేశపెట్టిన ఐదొవ ఈవీ. మే 2025 నుంచి రూ. 51,000 టోకెన్ డిపాజిట్‌తో దీని బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.

ఎం9 ఈవీని ఎంజీ సెలెక్ట్ అనే ప్రీమియం రిటైల్ నెట్‌వర్క్ ద్వారా విక్రయిస్తారు. సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారుతో పాటు ఇది అందుబాటులో ఉంటుంది. లగ్జరీ ఎంపీవీ విభాగంలో టయోటా వెల్‌ఫైర్, కియా కార్నివాల్ వంటి వాహనాలకు ఇది పోటీ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. సీబీయూ దిగుమతి కారణంగా దీని ధర రూ. 65-70 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చని అంచనా. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

ఎంజీ ఎం9 ఈవీ: బ్యాటరీ, రేంజ్..

ఎంజీ ఎం9 ఈవీ 90 కేడబ్ల్యూహెచ్​ లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 500 కి.మీ. రేంజ్‌ను అందిస్తుంది. దీని ముందు భాగంలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 241 బీహెచ్‌పీ పవర్​ని, 350 ఎన్​ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్​ కారు టాప్​ స్పీడ్​ 180 కేఎంపీహెచ్​. 11 కేడబ్ల్యూ ఛార్జర్‌తో 5 శాతం నుంచి 100 శాతం వరకు పూర్తి ఛార్జ్ చేయడానికి 8.5 గంటలు పడుతుంది!. ఇది డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. దీని ద్వారా బ్యాటరీని 30 శాతం నుంచి 80 శాతానికి కేవలం 30 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు.

ఎంజీ ఎం9 ఈవీ: డిజైన్, డైమెన్షన్స్​..

మూడు వరుసలు, ఏడు సీట్లతో కూడిన ఎం9 ఎలక్ట్రిక్​ ఎంపీవీ.. 5,270 ఎంఎం పొడవు, 2,000 ఎంఎం వెడల్పు, 1,840 ఎంఎం ఎత్తును కలిగి ఉంది. దీని వీల్‌బేస్ 3,200 ఎంఎం. ఇది కార్నివాల్, వెల్‌ఫైర్ వంటి పోటీదారుల కంటే పెద్దది. దీని డిజైన్‌లో క్లోజ్డ్​ ట్రాపెజోయిడల్ ఫ్రెంట్ గ్రిల్, బంపర్‌పై అమర్చిన స్లీక్ ఎల్​ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, పైన కనెక్ట్ చేసిన ఎల్​ఈడీ డీఆర్ఎ​ల్​లు ఉన్నాయి. దీనికి ఎలక్ట్రిక్ స్లైడింగ్ డోర్‌లు, సెల్ఫ్-హీలింగ్ కాంటినెంటల్ కాంటిసీల్ టైర్లతో కూడిన 19-ఇంచ్​ అల్లాయ్ వీల్స్, వెనుక ఎల్ఈడీ టెయిల్‌లైట్లు, ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్, రూఫ్ స్పాయిలర్ వంటివి ఉన్నాయి.

ఎంజీ ఎం9 ఈవీ: వేరియంట్లు, రంగులు..

ప్రపంచవ్యాప్తంగా, ఎం9 ఈవీ రెండు వేరియంట్లలో వస్తుంది. రెండు వేరియంట్లు దాదాపు ఒకే విధమైన పనితీరు, భద్రతా ఫీచర్లను అందిస్తాయి. అయితే టాప్-స్పెక్ మోడల్‌లో నేచురల్​ లెథర్​ అప్‌హోల్‌స్టరీ, రెండవ వరుసలో ఎలక్ట్రికల్లీ అడ్జెస్టెబుల్​ ఒట్టోమాన్ సీట్లు, మొదటి- రెండొవ వరుస సీట్లకు వెంటిలేషన్, హీటింగ్, మసాజ్ ఫంక్షన్‌లు ఉన్నాయి.

భారతదేశంలో ఈ ఎంపీవీ ఫుల్లీ లోడెడ్​ టాప్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనికి “ప్రెసిడెన్షియల్ లిమో” అని పేరు పెట్టారు. ఇది మెటల్ బ్లాక్, కాంక్రీట్ గ్రే, పెర్ల్ లస్టర్ వైట్ రంగులలో లభిస్తుంది. క్యాబిన్ కాగ్నాక్ బ్రౌన్ లెథర్​, స్వెడ్ మిశ్రమంతో ఫినిష్​ చేశారు.

ఎంజీ ఎం9 ఈవీ: ఇంటీరియర్, భద్రతా ఫీచర్లు..

అతి విలాసవంతమైన క్యాబిన్‌లో త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, హీటింగ్, కూలింగ్, మసాజ్‌తో కూడిన 2వ-వరుస ఒట్టోమాన్ సీట్లు ఉన్నాయి. వీటిని హ్యాండ్‌రెయిల్‌లోని టచ్‌స్క్రీన్ ద్వారా నియంత్రించవచ్చు. వెనుక ప్రయాణికులకు వ్యక్తిగత ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్‌లు లభిస్తాయి. క్యాబిన్ షామోయిస్​తో కప్పిన డ్యూయల్-పేన్ సన్‌రూఫ్‌ ఉంది. ఇది విశాలమైన అనుభూతిని ఇస్తుంది.

ఎంజీ ఎం9 ఈవీ ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబిఎస్, ఆటో హోల్డ్‌తో కూడిన ఈఎస్​పీ, టీపీఎమ్​ఎస్​తో కూడి ఉంది. ఇది అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఇంటిగ్రేటెడ్ క్రూయిజ్ అసిస్ట్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్-కీపింగ్ ఎయిడ్స్, స్పీడ్ అసిస్ట్ సిస్టమ్, 360-డిగ్రీ సరౌండ్ వ్యూ మానిటర్‌ను కలిగి ఉన్న ఏడీఏఎస్ సూట్‌ను కూడా అందిస్తుంది. యూరోపియన్, ఆస్ట్రేలియన్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లలో 5-స్టార్ రేటింగ్‌లను సాధించింది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం