సింగిల్​ ఛార్జ్​తో 550 కి.మీ వరకు రేంజ్​- ఈ ఎలక్ట్రిక్​ కారు.. రోడ్డు మీద పడవ! అడుగడుగునా లగ్జరీ ఫీల్​-mg m9 ev launched in india as a fully loaded electric mpv see range price and other details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  సింగిల్​ ఛార్జ్​తో 550 కి.మీ వరకు రేంజ్​- ఈ ఎలక్ట్రిక్​ కారు.. రోడ్డు మీద పడవ! అడుగడుగునా లగ్జరీ ఫీల్​

సింగిల్​ ఛార్జ్​తో 550 కి.మీ వరకు రేంజ్​- ఈ ఎలక్ట్రిక్​ కారు.. రోడ్డు మీద పడవ! అడుగడుగునా లగ్జరీ ఫీల్​

Sharath Chitturi HT Telugu

ఎంజీ ఎం9 ఈవీ ఇండియాలో తాజాగా లాంచ్​ అయ్యింది. ఈ మోడల్​ సింగిల్​ ఛార్జ్​తో 550 వరకు రేంజ్​ని ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్​ కారు ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఎంజీ ఎం9 ఈవీ

దేశంలో ఎంజీ ఎం9 ఈవీని తాజాగా విడుదల చేసింది జేఎస్​డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 69.90 లక్షలు! ఈ అత్యాధునిక, లగ్జరీ ఎలక్ట్రిక్ కారు డెలివరీలు ఆగస్టు 10 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇది కియా కార్నివాల్, టయోటా వెల్​ఫైర్ వంటి ప్రత్యర్థులకు గట్టి పోటీనిచ్చే లగ్జరీ ఎలక్ట్రిక్ ఎంపీవీగా మార్కెట్లోకి వచ్చింది.

ఎంజీ సెలెక్ట్ నుంచి విడుదలైన మొదటి ఉత్పత్తి ఇది. దీన్ని ఎంజీ సైబర్‌స్టర్​తో పాటు ప్రీమియం రిటైల్ నెట్‌వర్క్ ద్వారా విక్రయిస్తారు. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ రేంజ్​, ఫీచర్స్​ వంటి వివరాలను ఇక్కడ చూసేయండి..

ఎంజీ ఎం9 ఈవీ- డిజైన్, క్యాబిన్ విశేషాలు..

ఎంజీ ఎం9 ఈవీ సాధారణంగా ఎంపీవీలలో కనిపించే బాక్సీ డిజైన్‌తో వస్తుంది. ఇది కింది భాగంలో అమర్చిన హెడ్‌ల్యాంప్‌లు, పెద్ద ఫ్రంట్, రేర్ ఓవర్‌హాంగ్‌లు, పెద్ద కనెక్టెడ్ టెయిల్‌లైట్లు వంటి ఎలిమెంట్స్​ని కలిగి ఉంది. క్యాబిన్ లోపల, ఎంజీ ఎం9 ఎలక్ట్రిక్​ కారు అనేక అధునాతన సాంకేతిక, లగ్జరీ ఫీచర్లతో నిండి ఉంది. మూడు వరుసల సీటింగ్ అంతటా బ్రౌన్, బ్లాక్ అప్‌హోల్‌స్టరీ కలయికను ఇందులో చూడవచ్చు. వెనుక సీట్లలో కూర్చునే వారికి పవర్డ్ కెప్టెన్ సీట్లు అందించారు. ఇది ఈ ఈవీ ముఖ్యమైన ప్రత్యేకతల్లో ఒకటి.

ఎంజీ ఎం9 ఈవీ పూర్తి ఫీచర్స గురించి తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

ఎంజీ ఎం9 ఈవీ- ప్రధాన ఫీచర్లు..

ఈ ఎలక్ట్రిక్​ కారులో 12.23 ఇంచ్​ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, 7.0 ఇంచ్​ ఫుల్లీ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, డిజిటల్ ఐఆర్​వీఎం, క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్, 13-స్పీకర్ల జేబీఎల్​ సౌండ్ సిస్టమ్, లెథర్- స్యూడ్ అప్‌హోల్‌స్టరీ, హీటింగ్, మసాజ్, వెంటిలేషన్ ఫంక్షన్లతో కూడిన పవర్డ్ ఫ్రంట్, రియర్ సీట్లు, కనెక్టెడ్ కార్ టెక్ వంటి కీలక ఫీచర్లు ఉన్నాయి.

ఈ ఎలక్ట్రిక్ ఎంపీవీ వెహికల్-టు-లోడ్ (V2L), వెహికల్-టు-వెహికల్ (V2V) కార్యాచరణను కూడా అందిస్తుంది.

ఎంజీ ఎం9 ఈవీ- భద్రత, పనితీరు..

భద్రత విషయానికి వస్తే, ఎంజీ ఎం9 ఈవీలో అనేక ఫీచర్లు ఉన్నాయి. ఇందులో లెవెల్ 2 అడాస్​ సూట్, 360-డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా, ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, ఫ్రంట్, రేర్ డిస్క్ బ్రేక్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈపీఎస్​), టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

ఈ ఎలక్ట్రిక్ కారుకు 90 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్ పవర్​ని అందిస్తుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 548 కి.మీల వరకు రేంజ్​ని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది ఫ్రంట్-వీల్-డ్రైవ్ లేఅవుట్‌ను కలిగి ఉంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 245 బీహెచ్​పీ పవర్​, 350 ఎన్​ఎం పీక్​ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం