మీరు సమీప భవిష్యత్తులో కొత్త ప్రీమియం కారును కొనుగోలు చేయాలనుకుంటే మీ కోసం గుడ్‌న్యూస్. ఎంజీ మోటార్ ఈ సంవత్సరం అనేక కొత్త ప్రీమియం మోడళ్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. రాబోయే మోడళ్లలో ఎంజీ ఎం 9, మెజెస్టర్ ఉన్నాయి. కంపెనీ ఎంజీ ఎం 9ను ఆటో ఎక్స్ పో 2025లో ప్రదర్శించింది. దీంతోపాటు ప్రీ బుకింగ్స్ కూడా ప్రారంభించింది. రాబోయే రెండు కార్ల ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
ఎలక్ట్రికల్‌గా స్లైడింగ్ రియర్ డోర్లు, పవర్ టెయిల్ గేట్, మసాజ్, మెమొరీ, వెంటిలేషన్, పవర్ అడ్జస్ట్ మెంట్ ఫంక్షన్స్‌తో అడ్వాన్స్డ్ ఫస్ట్, సెకండ్ లైన్ సీట్లు వంటి ప్రీమియం ఫీచర్లను కంపెనీ అందించనుంది. 64-కలర్ యాంబియంట్ లైటింగ్ సిస్టమ్, లేన్ కీపింగ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, రియర్ అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్, రియర్ కలెక్షన్ వార్నింగ్ సిస్టమ్, 360 డిగ్రీల కెమెరా సిస్టమ్ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి.
పవర్‌ట్రెయిన్ గురించి చూస్తే.. ఎంజీ ఎం9 90 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగిస్తుంది. ఈ ఎంపీవీ బ్యాటరీని కిలోవాట్ (ఏసీ), 150 కిలోవాట్ల (డీసీ) ఛార్జర్లతో ఛార్జ్ చేయవచ్చు. డబ్ల్యుఎల్టిపి ప్రకారం, ఎలక్ట్రిక్ ఎంపీవీ సుమారు 430 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉంటుందని మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
మరోవైపు కంపెనీ తన మోస్ట్ అవైటెడ్ మెజెస్టర్‌ను కూడా ఈ సంవత్సరం లాంచ్ చేయవచ్చు. డిజైన్ పరంగా ఈ ఎస్‌యూవీలో క్రాస్-బార్ పెద్ద, చతురస్రాకార రేడియేటర్ గ్రిల్, చుంకియర్ స్కిడ్ ప్లేట్లు, స్ప్లిట్ హెడ్ ల్యాంప్స్, కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్, కొత్త ఎగ్జాస్ట్ అవుట్ లెట్లు ఉంటాయి. ఇంటీరియర్‌లో 12.3 అంగుళాల డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా ఉండనుంది.
ఈ ఎస్‌యూవీలో 2.0-లీటర్ డీజల్ ఇంజన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 159బిహెచ్పీ పవర్, 373.5ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ ఈ కారు ఇంజిన్‌ను 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్, ఆన్-డిమాండ్ 4 డబ్ల్యూడీ సిస్టమ్‌తో అందిస్తుంది. ఈ కొత్త మోడల్ త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.