MG Cyberster : 100 కేఎంపీహెచ్​ స్పీడ్​ను 3.2 సెకన్లలో అందుకునే ఎంజీ సైబర్​స్టర్​!-mg cybersters specs revealed promises 528 bhp and 0 100 kmph in 3 2 seconds ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mg Cyberster : 100 కేఎంపీహెచ్​ స్పీడ్​ను 3.2 సెకన్లలో అందుకునే ఎంజీ సైబర్​స్టర్​!

MG Cyberster : 100 కేఎంపీహెచ్​ స్పీడ్​ను 3.2 సెకన్లలో అందుకునే ఎంజీ సైబర్​స్టర్​!

Sharath Chitturi HT Telugu

MG Cyberster : ఎంజీ సైబర్​స్టర్​ ఈవీ స్పెసిఫికేషన్స్​ను సంస్థ రివీల్​ చేసింది. ఆ వివరాలు..

ఎంజీ సైబర్​స్టర్​ స్పెసిఫికేషన్స్​ ఇవే..

MG Cyberster : ఎంజీ సైబర్​స్టర్​ని 2021లో ప్రపంచానికి తొలిసారిగా పరిచయం చేసింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. ఇక ఇప్పుడు.. ఈ ఎలక్ట్రిక్​ వెహికిల్​ స్పెసిఫికేషన్స్​ను రివీల్​ చేసింది. ఆ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

ఈ ఎలక్ట్రిక్​ రోడ్​స్టర్​ స్పెసిఫికేషన్స్​ ఇవే..

ఈ ఎంజీ సైబర్​స్టర్​.. ఒక 2-సీటర్​ ఈవీ. ఇందులో డ్యుయెల్​ ఎలక్ట్రిక్​ మోటార్స్​ ఉంటాయి. ఇందులోని ఇంజిన్​.. 528 హెచ్​పీ పీక్​ పవర్​ను, 725 ఎన్​ఎం పీక్​ టార్క్​ను జనరేట్​ చేస్తుంది. అంతేకాకుండా.. 0-100 కేఎంపీహెచ్​ను కేవలం 3.2 సెకన్లలో అందుకోగలదు ఈ ఎలక్ట్రిక్​ వెహికిల్​. ఇందులో 77 కేడబ్ల్యూహెచ్​ లిథియం- ఐయాన్​ బ్యాటరీ ప్యాక్​ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 570 కి.మీల దూరం ప్రయాణిస్తుందని సంస్థ చెబుతోంది.

MG Cyberster EV range : ఈ ఓపెన్​ టాప్​ స్పోర్ట్స్​ కార్​ బరువు 1,984కేజీలు. ఈవీగా చూస్తే.. ఈ మోడల్​ బరువు కాస్త ఎక్కువగానే ఉంది. ఈ వెహికిల్​ పొడవు 4533ఎంఎం. వెడల్పు 1,912ఎంఎం. ఎత్తు 1,328ఎంఎం. వీల్​బేస్​ వచ్చేసి 2,689ఎంఎం ఉంటుంది.

ఇదీ చూడండి:- MG Comet EV Gamer Edition : ఎంజీ కామెట్​ ఈవీ గేమర్​ ఎడిషన్​ లాంచ్​.. ధర ఎంతంటే!

ఇక 2 సీటర్​ కేబిన్​లో బోస్​ ఆడియో సిస్టెమ్​, క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 8155 చిప్​ ఆధారిత టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సెటప్​ ఈ ఎంజీ సైబర్​స్టర్​ ఈవీలో ఉండనున్నాయి. ఈ మోడలకు సంబంధించిన ఇతర ఫీచర్స్​, ధర వంటి వివరాలు అందుబాటులో లేవు. కాగా.. వచ్చే ఏడాది ఈ ఈవీ సెల్స్​ మొదలవుతాయని సమాచారం. ఇండియా లాంచ్​పైనా క్లారిటీ లేదు. సంస్థ నుంచి ప్రకటన వెలువడాల్సి ఉంది. చూస్తుంటే మాత్రం.. ఇదొక లగ్జరీ వెహికిల్​గానే ఉంది.

MG Cyberster EV specifications : ఇక ఎంజీ సైబర్​స్టర్​ ఈవీకి లైట్​వెయిట్​ వర్షెన్​ను కూడా సంస్థ ప్లాన్​ చేస్తున్నట్టు సమాచారం. ఇందులో సింగిల్​ మోటర్​ ఉంటుందని, ఇది 295 బీహెచ్​పీ పవర్​ను జనరేట్​ చేస్తుందని తెలుస్తోంది. 64కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఉండొచ్చు. ఇదొక ఆర్​డబ్ల్యూడీ వేరియంట్​గా రావొచ్చు. దీనిని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 519కి.మీల రేంజ్​ ఇస్తుందని తెలుస్తోంది.

సంబంధిత కథనం