MG Cyberster EV : వావ్ కేక అనిపించే స్టైలిష్ లుక్‌లో ఎంజీ సైబర్‌స్టర్ ఈవీ.. చూస్తే పడిపోవాల్సిందే!
MG Cyberster Electric Car : ఎంజీ కంపెనీ నుంచి వచ్చే కొత్త మోడల్స్ కోసం చాలా మంది ఎదురుచూస్తూ ఉంటారు. వాటి స్టైలిష్ లుక్ బాగుంటుంది. కొత్తగా ఆటో ఎక్స్‌పోలో సైబర్‌స్టర్ ఈవీని ఆవిష్కరించారు. ఇది అద్భుతమైన లుక్‌లో ఆకట్టుకుంటోంది.
జిందాల్, ఎంజీ మోటార్స్ భారతదేశంలో వ్యాపార భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. అందులో భాగంగానే దేశీయ విపణిలోకి జేఎస్‌డబ్ల్యూ ఎంజీ పేరుతో పలు కొత్త కార్లు విడుదల అవుతుంటాయి. తాజాగా ఎంజీ కంపెనీ నుంచి ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించారు. కొత్త సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ సెడాన్ దిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ప్రదర్శించారు. కారు చాలా క్రేజీ లుక్‌లో ఉంది. మరికొన్ని నెలల్లో దీనిని విక్రయించనున్నారు.

అదిరిపోయే ఎక్స్‌టీరియర్
ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన కొత్త ఎంజీ సైబర్‌స్టర్ సెడాన్ మరింత అధునాతనంగా ఎక్స్‌టీరియర్ డిజైన్ అదిరిపోయింది. ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, బ్లాంక్డ్ ఆఫ్ గ్రిల్, బటర్‌ఫ్లై డోర్లు, డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, వెడల్పు డిఫ్యూజర్, ఎల్‌ఈడీ లైట్ బార్, టర్న్ ఇండికేటర్స్, కన్వర్టిబుల్ సాఫ్ట్-టాప్ వంటి ఫీచర్లు ఇందులో ఉంటాయి. ప్రస్తుతానికి ఎంజీ సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ సెడాన్ పనితీరుకు సంబంధించి.. కచ్చితమైన వివరాలు ఇంకా రాలేదు.
మంచి మైలేజీ!
ఈ కారు 77 కిలోవాట్ (kWh) బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ కలిగి ఉంటుంది. 2 ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగిస్తుంది. ఇది 510 బీహెచ్‌పీ, 725 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ కారు పూర్తి ఛార్జ్‌పై 510 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని అంచనా. ఇది కేవలం 3.2 సెకన్లలో 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది.
సేఫ్టీలోనూ టాప్
ఈ కొత్త కారులో అనేక అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇది డ్రైవర్ డిస్‌ప్లే కోసం డ్యూయల్ స్క్రీన్‌లు, 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మల్టీ-స్పోక్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, ప్యాడిల్ షిఫ్టర్‌లను కలిగి ఉంటుంది. ఎంజీ సైబర్‌స్టర్ సేఫ్టీలోనూ తోపుగా రానుంది. భద్రత పరంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ వంటి వివిధ సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి.
అంచనా ధర
ఎంజీ సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ సెడాన్ ఖరీదైనదిగా ఉంటుందని అంటున్నారు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ కారు త్వరలో విడుదల కానుంది. మార్చిలో సైబర్‌స్టర్ ఈవీ బుకింగ్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.