Meta Layoffs: ఉద్యోగులపై మెటా మరో పిడుగు.. నేటి నుంచే!-meta prepares for more layoffs across facebook whatsapp instagram check details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Meta Prepares For More Layoffs Across Facebook Whatsapp Instagram Check Details

Meta Layoffs: ఉద్యోగులపై మెటా మరో పిడుగు.. నేటి నుంచే!

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 19, 2023 11:39 AM IST

Meta Layoffs: ఫేస్‍బుక్ మాతృసంస్థ మెటా మరోసారి వేలాది మంది ఉద్యోగులను తొలగించేందుకు రెడీ అయింది. నేటి నుంచే ప్రక్రియ మొదలవుతుందని తెలుస్తోంది.

Meta Layoffs: ఉద్యోగులపై మెటా మరో పిడుగు.. నేటి నుంచే!
Meta Layoffs: ఉద్యోగులపై మెటా మరో పిడుగు.. నేటి నుంచే! (Reuters)

Meta Layoffs: ఫేస్‍బుక్, వాట్సాప్, ఇన్‍స్టాగ్రామ్ ప్లాట్‍ఫామ్‍ల పేరెంట్ కంపెనీ మెటా (Meta) మరోసారి ఉద్యోగులను తొలగించేందుకు (Job Cuts) సిద్ధమైంది. గతేడాది 11వేల మందిని తీసేసిన ఆ కంపెనీ మరోసారి లేఆఫ్‍లను చేయనుంది. నేడే (ఏప్రిల్ 19) తొలగింపు ప్రక్రియను ప్రారంభించనుందని సమాచారం బయటికి వచ్చింది. టీమ్‍ల పునర్‌వ్యవస్థీకరణ చేపడతామని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించిన విధంగానే రెండో రౌండ్ తొలగింపులు జరగనున్నాయి. వివరాలు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

మేనేజర్లకు మెమోలు

Meta Layoffs: ఉద్యోగుల తొలగింపును బుధవారం ప్రకటించేందుకు సిద్ధం కావాలని టీమ్‍ల మేనేజర్లకు మెమో ద్వారా మెటా తెలియజేసిందని బ్లూమ్‍బర్గ్ న్యూస్ రిపోర్ట్ చేసింది. వాట్సాప్, ఫేక్‍బుక్, ఇన్‍స్టాగ్రామ్‍తో పాటు రియాల్టీ ల్యాబ్స్, క్వీస్ట్ హార్డ్ వేర్ ప్లాట్‍ఫామ్‍ల్లో పని చేస్తున్న ఉద్యోగులను మెటా తీసివేయనుందని ఈ మెమోల ద్వారా వెల్లడైంది. సుమారు 10వేల మంది ఉద్యోగులను మెటా ఇప్పుడు సాగనంపుతుందని తెలుస్తోంది. ఈ విషయంపై మార్చిలోనే సంకేతాలు ఇచ్చారు మార్క్ జుకర్‌బర్గ్. మేలో మరింత ఉద్యోగాల కోత ఉండొచ్చని కూడా అంచనాలు ఉన్నాయి.

Meta Layoffs: గతేడాది నవంబర్‌లో మొత్తం సిబ్బందిలో 13 శాతం అంటే 11,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది మెటా. ఆదాయం క్షీణించటంతో ఖర్చులను తగ్గించుకునేందుకు ఎంప్లాయిస్‍ను తీసేస్తోంది.

డిస్నీ కూడా మళ్లీ..

Disney Layoffs: ప్రముఖ ఎంటర్‌టైన్‍మెంట్, ఓటీటీ సంస్థ వాల్ట్ డిస్నీ కూడా రానున్న వారాల్లో మరో 7వేల మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం బయటికి వచ్చింది. మొత్తం సిబ్బందిలో మరో 15 శాతం మందిని తగ్గించుకోనుంది. మార్చిలోనే వేలాది మందికి ఉద్వాసన పలికిన డిస్నీ మళ్లీ ఇప్పుడు వేటు వేసేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 24వ తేదీలోగా తాజా తొలగింపులతో ప్రభావితమయ్యే వారికి సమాచారం చేరుతుందని తెలుస్తోంది.

Layoffs: దిగ్గజ కంపెనీ అమెజాన్ కూడా ఆరు నెలల వ్యవధిలో రెండుసార్లు వేలాది మంది ఉద్యోగులను తొలిగించింది. సుమారు 20వేల జాబ్స్ కట్ చేసింది. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం ఇలా అనేక భారీ కంపెనీలు వేలాది మంది ఎంప్లాయిస్‍ను ఇంటికి పంపాయి. ఇటీవలే లేఆఫ్స్ ట్రెండ్ కాస్త తగ్గినట్టు కనిపించగా.. తాజాగా మెటా, డిస్నీ నిర్ణయాలతో మళ్లీ ఆందోళన రేగే అవకాశం ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం